Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి స్విఫ్ట్‌ను దెబ్బకొట్టడానికి ఈ ఒక్క మోడల్ చాలు
ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ప్యూజో ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి కసరత్తులు మొదలుపెట్టింది. దేశీయంగా కార్ల తయారీ కోసం ప్యూజో ఇప్పటికే సికె బిర్లా దిగ్గజంతో చేతులు కలిపింది.

ప్యూజో ఇండియన్ మార్కెట్లోకి హ్యాచ్‌బ్యాక్ మోడల్‌తో ఎంట్రీ ఇవ్వనుంది. 2019 నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ప్యూజో తమ తొలి ఉత్పత్తిగా 208 హ్యాచ్‌బ్యాక్ కారును మారుతి స్విఫ్ట్ మీద సరాసరి పోటీగా తీసుకొస్తోంది.


తాజాగా, పూనే ఆర్టిఓ రిజిస్ట్రేషన్ నెంబర్ గల 208 హ్యాచ్‌బ్యాక్ కారును ప్యూజో ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుండగా ఓ ఆటోమొబైల్ మీడియా కంటబడింది. ఈ కారును PCA Motors Pvt Ltd పేరు మీద రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది.

ప్యూజో సంస్థ పూనే సమీపంలో PCA Motors Pvt Ltd పేరుతో రిజిస్టర్ ఆఫీస్ లేదా తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా పట్టుబడిన ప్యూజో 208 కారు ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించబడింది.

సరికొత్త 208 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆధునిక మరియు డిజైన్‌లో ఉంది. 208 కారు ఫ్రంట్ డిజైన్‌లో స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్ మరియు ప్రొజెక్టర్ లైట్లు, విశాలమైన ఫ్రంట్ గ్రిల్, దప్పంగా ఉండే క్రోమ్ సరౌండింగ్స్, రౌండ్ ఫాగ్ ల్యాంప్స్ మరియు అగ్రెసివ్ డిజైన్‌లో ఉన్న బంపర్ వంటివి ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్యూజో 208 ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ థీమ్ గల త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇంటీరియర్‌లో చాలా వరకు ప్రపంచ శ్రేణి డిజైన్ ఎలిమెంట్లు మరియు ఫీచర్లను ప్యూజో అందించింది. అందులో, క్రోమ్ లోహపు ఏసి వెంట్స్ మరియు డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

పరీక్షిస్తూ పట్టుబడిన ప్యూజో 208 లోని టాప్ ఎండ్ వేరియంట్ అని తెలుస్తోంది. పవర్ విండోలు, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఆపరేట్ చేయగలిగే సైడ్ మిర్రర్స్ ఉన్నాయి. అయితే, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ రాలేదు. ముందు చక్రాలకు డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఫ్రంట్ మరియు సైడ్ ఎయిర్ బ్యాగులు వంటి అదనపు ఫీచర్లను గుర్తించడం జరిగింది.
Trending On DriveSpark Telugu:
గుడ్ న్యూస్: రూ. 4.99 లక్షలకే కొత్త తరం స్విఫ్ట్
రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్‌లో ఎలక్ట్రిక్ బుల్లెట్ బైకు: ఇక మీదట ఆ సౌండ్ లేనట్లేనా..?
300 టన్నుల బంగారు రైలు దక్కించుకోవాలనే వారి కోరిక తీరుతుందా...?

రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా టెస్టింగ్ చేసిన ప్యూజో 208 కారులో పెట్రోల్ ఇంజన్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. విపణిలో స్విఫ్ట్‌కు పోటీనిచ్చే ప్యూజో 208 కారులోని 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ సుమారుగా 80బిహెచ్పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా, ఇందులో డీజల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్యూజో 2019 నాటికి పూర్తి స్థాయిలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తొలి విడుదలతోనే భారతదేశపు మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్‌కు గట్టి పోటీనిచ్చే 208 కారును ఇప్పటి నుండే ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ వస్తోంది.

మారుతి సుజుకి అతి త్వరలో కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఎన్నో మార్పులు చేర్పులతో లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ప్యూజ్ 208 చాలా స్పోర్టివ్ మరియు అడ్వాన్స్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి, ధర మరియు ఫీచర్ల పరంగా రెండింటి మధ్య పోటీ తీవ్రం కానుంది. ప్యూజో 208 కారును పరిచయం చేస్తే పోటీ ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే...
Trending DriveSpark Telugu YouTube Videos
Image Source: TeamBHP