పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం పోర్షే తమ అత్యంత శక్తివంతమైన మరియు ట్రాక్-ఫోకస్డ్ మోడల్ 911 కారును విపణిలోకి లాంచ్ చేసింది. పవర్‌ఫుల్ రోడ్ లీగల్ పోర్షే 911 జిటి2 ధర రూ. 3.88 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్

By Anil Kumar

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం పోర్షే తమ అత్యంత శక్తివంతమైన మరియు ట్రాక్-ఫోకస్డ్ మోడల్ 911 కారును విపణిలోకి లాంచ్ చేసింది. పవర్‌ఫుల్ రోడ్ లీగల్ పోర్షే 911 జిటి2 ధర రూ. 3.88 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

ఇండియన్ మార్కెట్ కోసం ఒకటి కంటే ఎక్కువ యూనిట్లను అందుబాటులో ఉంచినట్లు పోర్షే పేర్కొంది. 911 జిటి2 ఆర్ఎస్ కారును తొలుత గత ఏడాది జరిగిన గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ వేడుకలో ఆవిష్కరించింది. రెండవ తరానికి చెందిన జిటి2 ఆర్ఎస్ పర్ఫామెన్స్ పరంగా పోర్షే 911 సిరీస్‌లో టాప్ రేంజ్ మోడల్.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

సాంకేతికంగా పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ కారులో 3.85-లీటర్ కెపాసిటి గల ఆరు సిలిండర్ల ఫ్లాట్ ట్విన్-టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 686బిహెచ్‌పి పవర్ మరియు 750ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జడ్ఎఫ్ కంపెనీ నుండి సేకరించిన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ 911 సిరీస్ యొక్క ఆధునిక పర్ఫామెన్స్ వెర్షన్. జర్మన్ దిగ్గజం పోర్షే జిటి3 కారును 2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. 911 జిటి2 ఆర్ఎస్ కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 100 కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 340 కిమీలుగా ఉంది.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌‌తో వచ్చింది. ఇది రోడ్డు పరిస్థితిని బట్టి ప్రతి చక్రం మీద డ్యాంపింగ్‌ను అడ్జెస్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో రియర్-యాక్సిల్ స్టీరింగ్ మరియు పోర్షే టార్క్ వెక్టారింగ్ సిస్టమ్ ఉంది.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్‌లో ఉన్న మరో స్టాండర్డ్ ఫీచర్లలో పోర్షే స్టెబిలిటి మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు కార్బన్ సిరామిక్ బ్రేకులు ఉన్నాయి. జిటి2 ఆర్ఎస్ రూఫ్ టాప్‌ను మెగ్నీషియంతో రూపొందించారు. కారు చుట్టుప్రక్కల ఉన్న బానెట్, ఫ్రంట్ స్ల్పిట్టర్, రియర్ వింగ్ మరియు బూట్ లిడ్‌ను ఫైబర్‌తో తయారు చేశారు.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

బరువును తగ్గించడం కోసం పోర్షే 911 జిటి2 ఆర్ఎస్‌‌లోని విండోలను ప్లాస్టిక్ వంటి మెటీరియల్‌తో రూపొందించారు. అయితే, జిటి2 ఆర్ఎస్‌‌లో కంప్లీట్ టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్ వచ్చింది

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

కారు బరువును వీలైనంత వరకు తగ్గించే క్రమంలో ఇందులో చాలానే మిస్సయ్యాయి. డోర్ హ్యాండిల్స్, కంఫర్ట్ సీట్లు మరియు సరైన డ్యాష్ బోర్డు కూడా లేకపోవడం గమనార్ఙం. 911 జిటి2 ఆర్ఎస్ స్టాండర్డ్ కార్బన్-ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ బకెట్ సీట్లు ఉన్నాయి. బ్లాక్ లెథర్ మరియు రెడ్ అల్కంటారా ఫినిషింగ్‌లో ఉన్న అప్‌హోల్‌స్ట్రే ఉంది.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

ఆప్షనల్‌గా పోర్షే 911 జిటి2 ఆర్ఎస్‌లో వీషాచ్ ప్యాకేజీని అందించారు. ఇది తదుపరి కారు బరువును 30కిలోల మేర తగ్గిస్తుంది. ఈ ప్యాకేజీ క్రింద కారులోని రూఫ్, యాంటీ-రోల్ బార్ మరియు కప్లింగ్ రాడ్లను కార్బన్-ఫైబర్‌తో మెటీరియల్‌తో అందిస్తారు. అంతే కాకుండ తేలికపాటి మెగ్నీషియం వీల్స్ కూడా ఉన్నాయి.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

వీషాచ్ ప్యాకేజీలో భాగంగా జిటి2 ఆర్ఎస్ ఇంటీరియర్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు మిస్సయ్యాయి.

పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ స్పోర్ట్స్ కారు విడుదల

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పోర్షే దిగ్గజం లాంచ్ చేసిన పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ అత్యంత శక్తివంతమైన మరియు ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్. ఇది నర్‌బర్గ్‌రింగ్ ల్యాప్ టైమ్‌ రికార్డును కూడా సాధించింది. నర్‌బర్గ్‌రింగ్ ల్యాప్ టైమ్ సాధించిన రోడ్ లీగల్ కారు కూడా ఇదే. పోర్షే 911 జిటి2 ఆర్ఎస్ ల్యాప్ టైమ్ 6:47.3.

Most Read Articles

English summary
Read In Telugu: Porsche 911 GT2 RS Launched At Rs 3.88 Crore — The Most Track-Focussed Porsche Available In India
Story first published: Wednesday, July 11, 2018, 10:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X