వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు: రోజుకు 10 మంది మృతి

ఇండియాలో కేవలం రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగా మరణిస్తున్న వారి గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాది దేశవ్యాప్తంగా 3,597 మంది గతుకుల రోడ్లకు బలయ్యారు. అంటే రోజుకు సగటున 10 మంది చొప్పున మరణించారు.

By Anil Kumar

వర్షాకాలం కొందరికి చిరునవ్వులు కురిపిస్తే మరికొందరికి కనువిప్పు కలిగిస్తుంది. ఇంకొందరి జీవితాలను రోడ్డు మీద పడేస్తుంది. సాధారణంగా, వర్షాకాలంలో తడిసిన రోడ్లపై వాహనాలను నడపటం అంటే, కత్తిమీద సాము లాంటిదే. అందులోను గతుకులతో కూడిన ఇండియన్ రోడ్ల మీద ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటం అనే చెప్పాలి.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నగరాల్లోని గుంతలమయైన రోడ్లు ఎంతో మంది అభాగ్యులను మింగేస్తున్నాయి. రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగా ప్రమాదానికి గురయ్యి మరణించిన సంఘటనలు వీడియోల రూపంలో మీడియాను కుదిపేస్తున్నాయి.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

చేయని పొరపాటుకు వాహన చోదకులు రోడ్డు మీదనే ప్రాణాలొదులుతున్నారు. గతం వారంలో ఓ జంట బైకు మీద వెళుతుండగా, గతుకుల రోడ్డులు అదుపుతప్పి క్రింద పడ్డారు. ఈ దుర్ఘటనలో బస్సు చక్రాల క్రిందపడిన మహిళ్ల అక్కడిక్కడే చనిపోయింది.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

ఇదొక్కటే కాదు, వారంలో రోజుల వ్యవధిలో ఇదే తరహాలో ముగ్గురు ప్రాణాలు ప్రాణాలు విడిచారు. వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న గతుకుల రోడ్లు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

ఇండియాలో కేవలం రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగా మరణిస్తున్న వారి గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాది దేశవ్యాప్తంగా 3,597 మంది గతుకుల రోడ్లకు బలయ్యారు. అంటే రోజుకు సగటున 10 మంది చొప్పున మరణించారు.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

గతుకుల రోడ్ల కారణంగా 2016లో మరణించిన వారితో పోల్చితే, 2017లో ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. మరి 2018లో ఈ సంఖ్య ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా కురుస్తున్న భీభత్సమైన వర్షాల కారణంగా ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

గతుకుల రోడ్ల కారణంగా ఏడాదికి వేల సంఖ్యలో మరణాలు నమోదవ్వడం చాలా బాధాకరమైన విషయం. ప్రపంచ గణాంకాలతో పోల్చితే గతుకులు రోడ్ల మీద చనిపోతున్నవారి సంఖ్య ఇండియాలో అత్యధికం.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

డ్రైనేజ్ సిస్టమ్, రోడ్ల నిర్మాణ నాణ్యత, సరైన అవగాహన లేకుండా రోడ్లను నిర్మించడంతో అతి తక్కువ కాలంలోనే రహదారులు దెబ్బతింటున్నాయి. దీనికి తోడు ప్రతి ఏడాది వర్షాకాలాన్ని ఎదుర్కోవడంలో నగరపాలక మరియు నగర అభివృద్ది శాఖ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

వర్షాకాంలో వాహన చోదకులు ఎన్నో జాగ్రత్తలు వహించాలి. నీటితో నిండిన రోడ్ల మీద వెళ్లడం, హెల్మెట్ లేకుండా నడపడం, సిగ్నల్స్ జంప్ చేయడం వంటివి చేయకూడదు మరియు ఓవర్ టేకింగ్ చేస్తున్నపుడు జాగ్రత్తలు వహిస్తే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు.

వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు

1. మరో నిండు ప్రాణాన్ని బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం - వీడియో

2. మాన్‌సూన్ డ్రైవింగ్ టిప్స్: వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయటానికి

3.ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా...?

4.ఏబిఎస్ అంటే ఏమిటి ? ఎలా పని చేస్తుంది ?

5.ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ కార్లలో ఏది బెస్ట్ ?

Most Read Articles

English summary
Read In Telugu: Potholes on Indian roads resulted in 3,597 deaths during 2017 – Highest in the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X