సిట్రియోన్ ఎస్‌యూవీతో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించనున్న పిఎస్ఎ గ్రూపు

By Anil Kumar

ఆసియా విపణిలో ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్ శరవేగంగా అభివృద్ది చెందుతుండటంతో ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ పిఎస్ఎ గ్రూపు 2019 నుండి కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమవుతోంది. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

నిజానికి పిఎస్ఎ గ్రూప్ 2020లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించాలని ముందే నిర్ణయించకుంది. అయితే, అనుకున్న సమయాని కంటే ఏడాది ముందుగానే విపణిలోకి తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

తాజాగా అందిన సమాచారం మేరకు, పిఎస్ఎ గ్రూపు తమ భాగస్వామ్యపు దిగ్గజం సిట్రియోన్‌కు చెందిన ఓ ఎస్‌యూవీ మోడల్‌ను 2019లో మార్కెట్లోకి లాంచ్ చేసే అలోచనలో ఉన్నట్లు తెలిసింది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

పిఎస్ఎ గ్రూపు తొలుత రెండేళ్ల పాటు బ్రాండింగ్ మీద దృష్టి సారించనుంది. ఆ తరువాత అధిక సంఖ్యలో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టి పూర్తి స్థాయి మార్కెట్‌ను సాధించే లక్ష్యంతో ఉంది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

పిఎస్ఎ గ్రూపు తొలుత సిట్రియోన్ సి84 మరియు సిట్రియోన్ సి5-ఎయిర్‌క్రాస్ మోడళ్లను ఇండియాకు దిగుమతి చేసుకొని అందుబాటులో ఉంచనుంది. కస్టమర్ల నమ్మకాన్ని సాధించుకున్న తరువాత విసృతంగా తమ సేల్స్ పెంచుకోనుంది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

పిఎస్ఎ గ్రూపు దేశీయ మరియు విదేశీ అవసరాలకు తమ అన్ని మోడళ్లను తమ చెన్నైలోని ప్రొడక్షన్ ప్లాంటు కేంద్రంగా తయారీ చేపట్టనుంది. అయితే, ప్రొడక్షన్ విషయంలో తుది నిర్ణయం ఇంకా పెండింగులో ఉంది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

పిఎస్ఎ గ్రూపు వచ్చే ఏడాది విపణిలోకి ప్రవేశపెట్టనున్న ఎస్‌యూవీ మార్కెట్లో ఉన్న జీప్ కంపాస్, హ్యుందాయ్ టుసాన్ మరియు అప్‌కమింగ్ స్కోడా కరోక్ ఎస్‌యూవీలకు గట్టి సవాల్ విసరనుంది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

కస్టమర్లు తొలుత తమ ఉత్పత్తుల అనుభవాలను పొందేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాలలో పిఎస్ఎ సంస్థ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లను ప్రారంభించనుంది. ఇది, విలువైన కార్ బ్రాండ్ ఉత్పత్తులను డ్రైవ్ చేసి, అనుభవం పొందడంలో సహాయపడుతుంది. తరువాత దశలో రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 80 నుండి 100 విక్రయ కేంద్రాలను ప్రారంభించే లక్ష్యంతో ఉంది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

ఫ్రెంచ్ దిగ్గజం దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన ప్రధాన బృందాన్ని సిద్దం చేసింది. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ కంపెనీల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులు పిఎస్ఎ గ్రూప్‌లో చేరినట్లు తెలిసింది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

యూరోపియన్ మార్కెట్లో రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా నిలిచిన పిఎస్ఎ దేశీయంగా తన ఉనికిని క్రమక్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది మూడవ ఆర్థిక త్రైమాసికం నుండి వివిధ స్థానాలకు ఉద్యోగుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనుంది.

సిట్రియోన్ ఎస్‌యూవీతో సమరానికి సిద్దమైన పిఎస్ఎ గ్రూపు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యూరప్‌లో దిగ్గజ సంస్థగా రాణిస్తున్న పిఎస్ఎ గ్రూప్ ఎలాగైనా ఇండియన్ మార్కెట్లో తమ ఉనికిని చాటుకోవాలని పరితపిస్తోంది. పిఎస్ఎ గ్రూప్ అనే మూడు కార్ల కంపెనీల భాగస్వామ్యం(సిట్రియోన్, ప్యూజో మరియు డిఎస్ ఆటోమొబైల్స్). దేశీయంగా సికె బిర్లా భాగస్వామ్యంతో ప్యూజో బ్రాండ్ పేరుతో తమ విభిన్న ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. అంతే కాకుండా, తమ భవిష్యత్ ఉత్పత్తుల తయారీకి చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్లాంటును వినియోగించుకోనుంది.

Source: ET Auto

Most Read Articles

English summary
Read In Telugu: PSA Group To Enter India Soon With A Citroen SUV
Story first published: Tuesday, June 12, 2018, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X