Just In
Don't Miss
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెనో క్విడ్ ఎలక్ట్రిక్ కారు విడుదలకు సన్నాహాలు
భారత్‌లో క్విడ్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు రెనో ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. క్విడ్ కారు ఫ్రెంచ్ దిగ్గజం రెనోకు బెస్ట్ సెల్లింగ్ మోడల్. చిన్న కార్ల పరిశ్రమలో క్విడ్ ద్వారా మంచి విజయాన్ని అందుకొన్న రెనో ఇప్పుడు ఇదే క్విడ్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.

రెనో క్విడ్ ఎలక్ట్రిక్ ఖచ్చితంగా ఎప్పుడు విడుదలవుతుందనే వివరాలు ఇంకా వెల్లడవ్వలేదు. అయితే మరి కొన్నేళ్లలో క్విడ్ ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల ఖాయమని తెలుస్తోంది. క్విడ్ ఎలక్ట్రిక్ పూర్తి స్థాయిలో విడుదలైతే మార్కెట్లో ఉన్న మహీంద్రా ఇ2ఒ ఎలక్ట్రిక్ మోడల్‌కు సరాసరి పోటీనిస్తుంది.

ఇండియాలో ప్రవేశపెట్టనున్న క్విడ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కారును డెవలప్ చేసేందుకు రెనో చైనా నుండి సహాయం పొందుతోంది. చైనా ఇంజనీర్లు తమ బ్యాటరీలు మరియు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రత్యేకించి రెనో క్విడ్ కోసం అందించే అవకాశం ఉంది.

భారత దేశపు చీపెస్ట్ ప్యాసింజర్ కార్లలో రెనో క్విడ్ ఒకటి. ఇది, 800సీసీ మరియు 1,000సీసీ కెపాసిటి గల రెండు ఇంజన్లు మరియు 5-స్పీడ్ లేదా ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతోంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, సిఎమ్ఎఫ్-ఎఫ్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన క్విడ్ కారును అదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఎలక్ట్రిక్ వెర్షన్లో అభివృద్ది చేస్తోంది. అయితే, అత్యంత కీలకమైన బ్యాటరీ మరియు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు ఇతర విడి పరికరాలను చైనా నుండి దిగుమతి చేసుకోనున్నట్లు సమాచారం.

అయితే, రెనో క్విడ్ ఎలక్ట్రిక్ భారత్‌లో విడుదలకు 12 నుండి 18 నెలలకు ముందే చైనాలో విడుదల కానుంది. రెనో చైనాలో ఉత్పత్తి చేయనున్న క్విడ్ ఎలక్ట్రిక్ కార్లను ఇండియా, బ్రెజిల్ మరియు ఆగ్నేషియా మార్కెట్లకు ఎగమతి చేసే అవకాశం ఉంది. కానీ గురించి స్పష్టమైన సమాచారం లేదు.

రెనో ఇండియా మేనేజింగ్ డైరక్టర్ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, "భారత్‌కు సరైన ఉత్పత్తి తీసుకొస్తే విజయం తథ్యం, కానీ నేడు ఎలక్ట్రిక్ కారు తయారీకి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం బ్యాటరీలకే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి కీలకమన విడి భాగాలను దేశీయంగా తయారు చేస్తే అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురావచ్చని ఆయన చెప్పకొచ్చాడు."

తెలుగు డ్రైవ్స్పార్క్ అభిప్రాయం!
రెనో ఇప్పటికే 2020 వరకు తమ భవిష్యత్ ప్రణాళికను వెల్లడించింది. ఈ ప్రణాళికల్లో భారత్‌కు పలు ఎలక్ట్రిక్ వాహనాలను ఖరారు చేసింది. రెనో-నిస్సాన్ భాగస్వామ్యం అంతర్జాతీయ పలు రకాల ఎక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. కానీ, ఫ్రెంచ్ దిగ్గజం రెనో మాత్రం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరంగా భారత ప్రభుత్వం తీసుకురానున్న విధివిధానాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.