రహస్యంగా పట్టుబడిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌

రెనో బృందం క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారును పరీక్షిస్తుండగా రహస్యంగా పట్టుబడింది. దీంతో రెనో క్విడ్ అతి త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదలకు సన్నద్దమవుతున్నట్లు తెలిసింది.

By N Kumar

ఫ్రెంచ్ ఫ్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనోకు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్. క్విడ్ కారు ఇచ్చిన సక్సెస్ ఊపులో సందర్భానుసారంగా పలుమార్లు క్విడ్ ఆధారిత కార్లను విపణిలోకి ప్రవేశపెట్టింది.

క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తున్న రెనో

ఇప్పుడు తాజాగా రెనో బృందం క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారును పరీక్షిస్తుండగా రహస్యంగా పట్టుబడింది. దీంతో రెనో క్విడ్ అతి త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదలకు సన్నద్దమవుతున్నట్లు తెలిసింది.

క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తున్న రెనో

రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 2018 రెనో క్విడ్‌ ఫ్రంట్ గ్రిల్, డోర్ల పైనున్న సైడ్ స్ట్రిప్స్ మీద క్రోమ్ ఎలిమెంట్లతో రెనో బ్రాండింగ్ ఉంది. క్రోమ్ డిజైన్ ఎలిమెంట్లను మినహాయిస్తే క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ఓవరాల్ డిజైన్ ప్రస్తుతం ఉన్న మోడల్‌నే పోలి ఉంటుంది.

క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తున్న రెనో

ఫేస్‌లిఫ్ట్ అవతారంలో వస్తోన్న క్విడ్ ఇంటీరియర్‌లో కూడా పలు మార్పులు చేర్పులతో నూతన ఫీచర్లు పరిచయం అయ్యాయి. రియర్ ప్యాసింజర్ల కోసం 12వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, క్రోమ్ సొబగులున్న డోర్ హ్యాండిల్స్ మరియు వెనుక వైపున్న రెనో లోగోలో చాలా చాకచక్యంగా అమర్చిన రియర్ వ్యూవ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తున్న రెనో

సాంకేతికంగా ఈ రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ అవే మునుపటి 800సీసీ మరియు 1-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. రెండింటిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తోంది. అయితే, 1-లీటర్ ఇంజన్ గల టాప్ ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రానుంది.

క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తున్న రెనో

రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లోని ఇతర ఫీచర్లలో పవర్ స్టీరింగ్ మరియు ఎయిర్ కండీషనింగ్ బేస్ వేరిసయంట్ మినహా అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా రానున్నాయి. క్విడ్‌లో ఉన్న ఏకైక సేఫ్టీ ఫీచర్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, ఇది కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే ఉంది. అయితే, ఎందులోనూ కనీసం ఆప్షనల్‌గా కూడా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రాలేదు.

క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తున్న రెనో

ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో పలు క్రోమ్ ఎలిమెంట్స్ మరియు నూతన ఫీచర్లతో రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ సేల్స్ ఊపందుకునే అవకాశం ఉంది. రెనో క్విడ్ ప్రస్తుతం కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. క్విడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదలతో ఎక్కువ మంది కస్టమర్లను చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తున్న రెనో

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ఓవరాల్ డిజైన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్‌నే పోలి ఉంటుంది. ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యే నాటికి క్విడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, విపణిలో ఉన్న మారుతి ఆల్టో, హ్యందాయ్ ఇయాన్ మరియు హ్యుందాయ్ అతి త్వరలో విడుదల చేయనున్న శాంట్రోకు పోటీనివ్వనుంది.

Source: Motoroctane

Most Read Articles

English summary
Read In Telugu: Renault Kwid Facelift Spotted In India — To Be Launched Soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X