క్విడ్ కార్లను రీకాల్ చేసిన రెనో: కారణమేంటో తెలుసా...?

రెనో ఇండియా తమ బెస్ట్ సెల్లింగ్ క్విడ్ కారును స్వచ్ఛందంగారీకాల్ చేసింది. రెనో నుండి రహస్యంగా అందిన రిపోర్ట్స్ ప్రకారం క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో స్టీరింగ్ లోపం కారణంగా రీకాల్ చేసినట్లు తెలిసింది.

By N Kumar

Recommended Video

Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

రెనో ఇండియా తమ బెస్ట్ సెల్లింగ్ క్విడ్ కారును స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. రెనో కంపెనీ నుండి రహస్యంగా అందిన రిపోర్ట్స్ ప్రకారం క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో స్టీరింగ్ లోపం కారణంగా రీకాల్ చేసినట్లు తెలిసింది. రెనో విడుదల చేసిన ప్రతులు ఇప్పటికే ఆన్‌లైన్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, రెనో దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

రెనో క్విడ్ రీకాల్

ఓ ఆటోమోటివ్ మీడియా ప్రచురించిన కథనం మేరకు, రెనో తమ క్విడ్ 800సీసీ వెర్షన్‌లో స్టీరింగ్ సమస్య కారణంగా రీకాల్ చేసినట్లు తెలిసింది. రీకాల్ అయిన కార్ల యజమానులకు ప్రత్యేకంగా లేఖలను పంపించింది.

రెనో క్విడ్ రీకాల్

కస్టమర్లు తమ కార్లతో సమీపంలోని రెనో సర్వీస్ సెంటర్లను సంప్రదించి, స్టీరింగ్ వీల్‌కు సంభందించిన సర్వీస్ చేయించుకోమని కోరింది. భద్రత మరియు పనితీరు పరంగా స్టీరింగ్‌‌వీల్‌ను ఉచితంగా రిపేరి చేయనున్నారు.

రెనో క్విడ్ రీకాల్

ఎన్ని రెనో క్విడ్ కార్లు రీకాల్ అయ్యాయనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే, రెనో క్విడ్ ఇండియన్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. రెనో క్విడ్ కారును తొలుత 800సీసీ ఇంజన్‌తో విడుదలయ్యి, ఆ తరువాత 1000సీసీ ఇంజన్‌తో కూడా అందుబాటులోకి వచ్చింది.

రెనో క్విడ్ రీకాల్

కార్ల రీకాల్ కస్టమర్ల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

సాధారణంగా, కార్ల కంపెనీలు తమ కార్లలో తలెత్తిన లోపాన్ని సవరించడానికి లేదా గుర్తించడానికి స్వచ్ఛందంగా రీకాల్(వెనక్కి పిలవడం) చేస్తాయి. ఇలా స్వచ్ఛందంగా రీకాల్ చేయడం, కార్లలో ఉన్న లోపం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించడానికి సహాయపడుతుంది.

రెనో క్విడ్ రీకాల్

కాబట్టి, కార్ల కంపెనీలు రీకాల్ ప్రకటిస్తే కస్టమర్లు ఇందుకు బాధపడాల్సిన అవసరం లేదు. కస్టమర్ల భద్రత దృష్ట్యా, వారి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం లోపం ఉన్న కార్లను వెనక్కి పిలిచి ఉచితంగా సర్వీస్ మరియు రిపేరి నిర్వహిస్తాయి.

Trending On DriveSpark Telugu:

ప్యాసింజర్ కార్ల పరిశ్రమను శాసించే ప్రణాళిక వెల్లడించిన టాటా

యమహా నుండి దూసుకొస్తున్న ఏరోక్స్ 155 స్కూటర్

భారీ సంఖ్యలో రీకాల్ అయిన హోండా కార్లు: వీటిలో మీ కారు ఉన్నట్లు ఇలా తెలుసుకోండి

రెనో క్విడ్ రీకాల్

రెనో ఇండియాకు మంచి గుర్తింపు తెచ్చిన మోడళ్లలో క్విడ్ ఒకటి. అధిక సంఖ్యలో భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించింది. ఒకానొక దశలో దేశీయ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి విక్రయిస్తున్న ఆల్టోకు గట్టి పోటీనిస్తోంది.

రెనో క్విడ్ రీకాల్

స్మాల్ కార్ సెగ్మెంట్లోకి ప్రవేశించిన రెనోకు గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ, ఎన్నో రకాల ఫస్ట్ క్లాస్ ఫీచర్లు, అధునాతన డిజైన్ శైలి మరియు న్యావిగేషన్ ఇంకా ఎన్నో అవసరాల కోసం రెనో అందించిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారా మంచి సక్సెస్ అందుకుంది.

రెనో క్విడ్ రీకాల్

క్విడ్‌లోని 800సీసీ వెర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 1000సీసీ వెర్షన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతున్నాయి. 800సీసీ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటే ఎంతో మంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

రెనో క్విడ్ రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్టీరింగ్ ర్యాక్‌లో లోపాన్ని గుర్తించిన క్విడ్ కార్ల యజమానులకు రెనో ఇండియా లెటర్లను పంపి సూచించింది. కస్టమర్ల భద్రతలో భాగంగా స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లే లోపాన్ని గుర్తించి లేదా, లోపం ద్వారా ప్రమాదాలు సంభవించే వరకు వేచి ఉండకుండా, రెనో ముందస్థుగా కస్టమర్లను అప్రమత్తం చేయడం ఒక గొప్ప నిర్ణయం.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Renault Recalls Its Best-Selling Kwid In India — Find Out Why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X