రెనో క్విడ్ క్రాష్ టెస్టులో మళ్లీ అసంతృప్తే!!

రెనో అభివృద్ది చెందుతున్న మార్కెట్ల కోసం ధరను లక్ష్యంగా చేసుకుని చీపెస్ట్ హ్యాచ్‌బ్యాక్ రెనో క్విడ్ కారును 2015లో ప్రవేశపెట్టింది. దీనికి తాజాగా ఆసియన్ ఎన్‌సిఏపి భద్రతా పరీక్షలు నిర్వహించారు.

By N Kumar

ఫ్రెంచ్ దిగ్గజం రెనో అభివృద్ది చెందుతున్న మార్కెట్ల కోసం ధరను లక్ష్యంగా చేసుకుని చీపెస్ట్ హ్యాచ్‌బ్యాక్ రెనో క్విడ్ కారును 2015లో ప్రవేశపెట్టింది. దీనికి తాజాగా ఆసియన్ ఎన్‌సిఏపి భద్రతా పరీక్షలు నిర్వహించారు. సేఫ్టీ పరంగా రెనో క్విడ్ ఓవరాల్ రేటింగ్ జీర్ స్టార్‌ రేటింగ్‌ సాధించింది.

రెనో క్విడ్ క్రాష్ టెస్టులో మళ్లీ అసంతృప్తే!!

గతంలో కూడా ఇదే తరహా ఫలితాలు కనబరచింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2016లో గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం క్రింద పిల్లలు మరియు పెద్దల భద్రత పరంగా క్రాష్ టెస్ట్ మరియు పలు భద్రత పరీక్షలు నిర్వహించగా అప్పుడు కూడా ఐదింటికి గాను జీర్ స్టార్ రేటింగ్ పొందింది.

రెనో క్విడ్ క్రాష్ టెస్టులో మళ్లీ అసంతృప్తే!!

నిజానికి క్రాష్ టెస్టులో ఫెయిల్ అవడం క్విడ్ తప్పు కాదు, దీనిని ఇలా రూపొందించిన రెనో కంపెనీదే తప్పు. తక్కువ ధరలో అందించే ఉద్దేశ్యంతో భద్రతను దృష్టిలో పెట్టుకోకుండా, అతి తక్కువ బాడీ క్వాలిటీ మరియు ఎలాంటి సేఫ్టీ ఫీచర్లు లేకుండా తయారు చేసింది.

రెనో క్విడ్ క్రాష్ టెస్టులో మళ్లీ అసంతృప్తే!!

దీంతో రెండు సార్లు నిర్వహించిన క్రాష్ టెస్టులో ఘోరంగా పరాజయపాలైంది. అయితే, 2016లో పలుమార్పులు చేసి, రెండవసారి నిర్వహించి క్రాష్ టెస్టులో ఏలాగో 1 స్టార్ రేటింగ్ సాధించింది.

రెనో క్విడ్ క్రాష్ టెస్టులో మళ్లీ అసంతృప్తే!!

తాజాగా ఆసియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఢీ పరీక్షలు నిర్వహించిన రెనో క్విడ్ ఇండోనేషియా మరియు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. రెనో క్విడ్ టాప్ ఎండ్ వేరియంట్ డ్రైవర్ సైడ్ సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉన్న మోడల్‌కు క్రాష్ టెస్టులు నిర్వహించగా, ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి.

రెనో క్విడ్ క్రాష్ టెస్టులో మళ్లీ అసంతృప్తే!!

రెనో క్విడ్ టాప్ ఎండ్ వేరియంట్ పెద్దల భద్రత పరంగా 10.12 పాయింట్లు, చిన్న పిల్లల భద్రత కెటగిరీలో 14.56 పాయింట్లు సాధించింది. సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ విభాగంలో ఎలాంటి పాయింట్లు సాధించలేకపోయింది.

రెనో క్విడ్ క్రాష్ టెస్టులో మళ్లీ అసంతృప్తే!!

ఆసియన్ ఎన్‌సిఎపి పరీక్షల్లో రెనో క్విడ్ ఓవరాల్ సేఫ్టీ పరంగా 24.68 పాయింట్లు మరియు 0 రేటింగ్ సాధించింది. ఆసియన్ ఎన్‌సిఎపి సెక్రెటరీ జనరల్ డాక్టర్ ఖైరిల్ అన్వర్ అబు ఖాసీం మాట్లాడుతూ, "ఆసియన్ వెర్షన్ రెనో క్విడ్ క్రాష్ట్ టెస్టులో తీవ్ర నిరాశపరిచింది. కానీ ఇదే రెనో క్విడ్ లాటిన్ అమెరికన్ క్రాష్ టెస్టులో 5 కు 3 స్టార్ల రేటింగ్ సాధించిందని చెప్పుకొచ్చాడు."

రెనో క్విడ్ క్రాష్ టెస్టులో మళ్లీ అసంతృప్తే!!

లాటిన్ అమెరికన్ వెర్షన్ రెనో క్విడ్ ఇండియన్ వెర్షన్ కంటే 140 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. మరియ అత్యుత్తమ నిర్మాణ విలువలతో నిర్మించారు. ధృడమైన బాడీ అందివ్వడంతో క్రాష్ టెస్టులో మంచి ఫలితాలు సాధించింది. అంతే కాకుండా, నాలుగు ఎయిర్ బ్యాగులు, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు బ్రెజిల్ వెర్షన్ క్విడ్‌లో తప్పనిసరిగా వచ్చాయి.

అత్యుత్తమ సేల్స్ సాధిస్తున్న ఇండియన్ మార్కెట్లో ఎలాంటి నాణ్యత లేని క్విడ్ కారును విక్రయిస్తోంది. అదే అంతర్జాతీయ విపణిలో సేఫ్టీ పరంగా పాస్ అయిన మోడల్‌ను విక్రయిస్తోంది. అంటే ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడే అవకాశాలు దాదాపు తక్కువే. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి కొత్త కారు కూడా ఆసియన్ ఎన్‍సిఎపి క్రాష్ టెస్టులో పాస్ అవ్వడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Renault Kwid Scores Zero Stars In ASEAN NCAP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X