భారత్‌లోకి రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII విడుదల

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ ఎనిమిదవ తరానికి చెందిన 2018 ఫాంటమ్(Phantom VIII) లగ్జరీ కారును నేడు (ఫిబ్రవరి 23, 2018) విపణిలోకి విడుదల చేసింది.

By Anil

Recommended Video

Kia Motors India New Models Walkaround - DriveSpark

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ ఎనిమిదవ తరానికి చెందిన 2018 ఫాంటమ్(Phantom VIII) లగ్జరీ కారును నేడు (ఫిబ్రవరి 23, 2018) విపణిలోకి విడుదల చేసింది.

రోల్స్ రాయిస్ పాపులర్ లగ్జరీ కారు ఫాంటమ్ యొక్క 8వ జనరేషన్ మోడల్ ప్రారంభ ధర రూ. 9.5 కోట్లు మరియు పొడగించబడిన వీల్ బేస్ వేరియంట్ ధర రూ. 11.35 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్దిగాంచిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII లో రోల్స్ రాయిస్ అభివృద్ది చేసిన 6.75-లీటర్ కెపాసిటి గల వి12 ఇంజన్ కలదు. ఇది 5,000ఆర్‌పిఎమ్ వద్ద 563బిహెచ్‌పి పవర్ మరియు 1,700ఆర్‌పిఎమ్ వద్ద 900ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారులో జడ్ఎఫ్ నుండి సేకరించిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది. ఇందులో జిపిఎస్ రిసీవర్ కలదు, ఇది కారు లొకేషన్ మరియు స్పీడ్ ఆధారంగా గేర్లను మార్చడానికి సహకరిస్తుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII లగ్జరీ సెడాన్ కేవలం 5.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

రోల్స్ రాయిస్ వారి నూతన "ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ" అనే ఫ్లాట్‌ఫామ్ నుండి సేకరించిన సరికొత్త అల్యూమినియం స్పేస్‌ ఫ్రేమ్ ఆధారంగా అభివృద్ది చేసిన ఛాసిస్ మీద ఫాంటమ్ VIII కారును నిర్మించారు. రోల్స్ రాయిస్ ఇక మీదట నిర్మించే ప్రతి కారుతో సహా, రోల్స్ రాయిస్ యొక్క మొట్టమొదటి ఎస్‌యూవీ "కుల్లినన్‌"ను కూడా ఇదే ఛాసిస్ మీద నిర్మించనుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

2018 రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII పొడవు 5,762ఎమ్ఎమ్, వెడల్పు 2,018ఎమ్ఎమ్, ఎత్తు 1,646ఎమ్ఎమ్ మరియు దీని వీల్ బేస్ 3,552ఎమ్ఎమ్‌గా ఉంది. వీల్ బేస్ పొడగించబడిన వేరియంట్ పొడవు 5,982ఎమ్ఎమ్ మరియు దీని వీల్ బేస్ 3,772ఎమ్ఎమ్‌గా ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

డిజైన్ విషయానికి వస్తే, మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే సరికొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారులో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. వెనుక వైపున తగ్గించిన డిక్కీ పొడవు, ముందువైపున పెద్ద పరిమాణంలో ఉన్న బానెట్ ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన సీటింగ్‌తో పాటు వెనక్కి తెరుచుకునే రియర్ డోర్లు ఉన్నాయి.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

ఫ్రంట్ డిజైన్ మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే అత్యంత పదునైన డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. చిన్న పరిమాణంలో ఉన్న హెడ్‌ల్యాంప్స్, రెండు హెడ్‌ల్యాంప్స్‌కు మధ్యలో రోల్స్ రాయిస్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ కూర్చుంది. బానెట్ ముందు వైపున వచ్చే తన్మయత్యంతో కూడిన లోహపు ఆర్నమెంట్ పొడవు కూడా అర అంగుళం దాకా పెరిగింది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

రోల్స్ రాయిస్ VIII ఇంటీరియర్‌లో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రతి రోల్స్ రాయిస్ అభిమానిని ఆకట్టుకునేలా డ్యాష్ బోర్డ్ మీద పెద్ద పరిమాణంలో ఉన్న గ్లాస్ ప్యానల్ ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

చలి కాలంలో కారులో ప్రయాణిస్తున్నపుడు ఇంటీరియర్‌లో వెచ్చదనాన్ని అందించే ఫ్రంట్ డోర్ ఆర్మ్‌రెస్ట్, ఫ్రంట్ సెంటర్ కన్సోల్, సి-పిల్లర్ దిగువ భాగం, వెనుక సీటులో ఉన్న ఆర్మ్ రెస్ట్, మరియు వ్యక్తిగత సీట్లు ఉన్నాయి. కస్టమర్లు విభిన్న రకాల లెథర్ అప్‌హోల్‌స్ట్రే, వుడ్ ఫినిషింగ్ మరియు పలు వేరియంట్లలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ను ఎంచుకోవచ్చు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ విపణిలో రోల్స్ రాయిస్ ఇండియా విభాగానికి రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII అతి ముఖ్యమైన మోడల్ కానుంది. ఫాంటమ్ VIII విడుదల భారత్‌లో లగ్జరీ లెవల్‍‌ను మరో స్థాయికి తీసుకెళుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రోల్స్ రాయిస్ గతంలో ప్రవేశపెట్టిన ఫాంటమ్ VII సిరీస్ కంటే ఎక్కువ ధరతో వచ్చింది. లగ్జరీ ఫీల్ కోరుకునే కస్టమర్లు ధర గురించి ఎందుకు ఆలోచిస్తారు చెప్పడి...

Most Read Articles

English summary
Read In Telugu: Rolls-Royce Phantom VIII Launched In India; Prices Start At Rs 9.50 Crore
Story first published: Friday, February 23, 2018, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X