ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

By Anil Kumar

ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా అందివ్వడానికి సిద్దమైంది. కాలం చెల్లిన పాత పెట్రోల్ మరియు డీజల్ వాహనాలను ప్రక్కన పడేసి పూర్తి స్థాయిలో విద్యుత్ సహాయంతో నడిచే వాహనాలను ఎంచుకునే వారికి గరిష్టంగా 2.5 లక్షలు వరకు రాయితీ అందిస్తోంది.

ఆశ్చర్యంగా ఉంది కదూ... అయితే పూర్తి వివరాలు చూద్దాం రండి....

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

కాలం చెల్లిన పెట్రోల్ మరియు డీజల్ వాహనాలు అత్యంత ప్రమాదకరమైన కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో ఇలాంటి పాత వాహనాలు వెదజల్లే ఉద్గారాల కారణంగా వాతావరణం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్న ఏకైక మార్గం కాలం చెల్లిన వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడమే...

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

ప్రజలను స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహించేందుకు ప్రతి ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు మీద భారీ రాయితీ అందివ్వడానికి కేంద్రం సిద్దమైంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలను కూడా చేకూర్చింది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

కేంద్రం ప్రతిపాదించిన ఈ విధానంతో దేశీయంగా అమ్ముడయ్యే ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ మీద ప్రోత్సాహకాలు అందివ్వనుంది. గరిష్టంగా 1.5 లక్షల ధరతో లభించే ఎలక్ట్రిక్ టూ వీలర్ల మీద రూ. 30,000 వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

అదే విధంగా ఎలక్ట్రిక్ కార్లు మరియు బస్సులను అద్దె వాహనాలుగా ఉపయోగించే కస్టమర్లకు కూడా ఈ ప్రయోజనాలు అందనున్నాయి. గరిష్టంగా 15 లక్షల ధర పలికే వాహనాలకు రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు రాయితీ ఇవ్వనుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్న పాత బిఎస్-3 డీజల్ మరియు పెట్రోల్ వాహనాలను శాస్వతంగా ధ్వంసం చేసి ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకునే కస్టమర్లకు ఇదే తరహా ప్రోత్సాకాలు లభిస్తాయి. అయితే, తమ పాత వాహనాన్ని నాశనం చేసినట్లు స్క్రాపింగ్ సెంటర్ నుండి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

రానున్న ఐదేళ్లలో ఎలక్ట్రిక్ కార్లు మరియు టూ వీలర్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ప్రోత్సాకాల రూపంలో రాయితీ కల్పించేందుకు 1500 కోట్ల రుపాయలను ఖర్చు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

అంతే కాకుండా, దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఎలా విస్తరించాయో... అదే రీతిలో అన్ని ప్రధాన నగరాల్లో విరివిగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందుకు అదనంగా మరో 1000 కోట్ల రుపాయలు వెచ్చించడానికి సిద్దమవుతోంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

ప్రతిపాదనల మేరకు, మెట్రో సిటీలు, చిన్న పాటి నగరాలు మరియు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్న చిన్న పాటి పట్టణాల్లో ప్రతి తొమ్మిది చదరపు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అంతే కాకుండా, జాతీయ మరియు ప్రధాన రహదారుల మీద ప్రతి 25కిలోమీటర్లకు రోడ్డుకు ఇరువైపులా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు వినియోగాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న FAME ప్రజా రవాణా మీద ఎక్కవగా దృష్టిసారిస్తోంది. ప్రత్యేకించి ట్యాక్సీలు మరియు త్రీ వీలర్లు ఎలక్ట్రిక్ మయం చేయాలని ప్రయత్నిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

ఎలక్ట్రిక్ వాహనాల డిమాండును పెంచడానికి కృషి చేసేందుకు సుమారుగా 5,800 కోట్ల రుపాయలు వెచ్చించడానికి సిద్దంగా ఉంది. రానున్న కాలంలో సుమారుగా 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ అందివ్వనుంది. వీటిలో 80 శాతం వరకు టూ వీలర్లు మరియు త్రీవీలర్లు ఉండనున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెంచడానికి కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారీ రాయితీతో ఇటు కస్టమర్లకు అటు కంపెనీలకు ప్రయోజనాన్ని చేకూర్చుతోంది. అంతే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన మోటార్లు, డ్రైవ్ మరియు పవర్ ట్రైన్ వంటి విడి భాగాలు తయారీ సంస్థల ఏర్పాటుకు 25 శాతం సబ్సీడీ అందిస్తోంది.

Source: TOI

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు మీద ప్రభుత్వం రాయితీ

1.టాటా నుండి మారుతి బాలెనోకు ఊహించని ఎదురుదెబ్బ

2.4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

3.జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం

4.కిమ్ జాంగ్ ఉన్ ఎక్కడికి వెళ్లినా ఈ కారు ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది

5. విపణిలోకి 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల: ధర రూ. 100/లీ

Most Read Articles

English summary
Read In Telugu: Scrap Old Car For A New Electric Vehicle And Get Rs 2.5 Lakh From The Government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X