స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన స్కోడా

స్కోడా ఓ విభిన్నమైన కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. సన్‌రాక్ పేరుతో ఆవిష్కరించిన ఈ కాన్సెప్ట్ కారును స్కోడా వొకేషన్ స్కూల్‌కు చెందిన విద్యార్థుల బృందం రూపొందించింది.

By Anil Kumar

స్కోడా ఓ విభిన్నమైన కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. సన్‌రాక్ పేరుతో ఆవిష్కరించిన ఈ కాన్సెప్ట్ కారును స్కోడా వొకేషన్ స్కూల్‌కు చెందిన విద్యార్థుల బృందం రూపొందించింది.

స్కోడా కంపెనీకి చెందిన కరోక్ ఎస్‌యూవీని క్యాబ్రియోలెట్ యొక్క కాన్సెప్ట్ వెర్షన్‌లో డెవలప్ చేశారు. ఆక్టోబరు 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 23 మంది విద్యార్థులు పనిచేశారు. జూన్ 2018తో కేవలం 8 నెలల్లోనే సన్‌రాక్ కాన్సెప్ట్ క్యాబ్రియోలెట్ ఎస్‌యూవీని ఆవిష్కరించారు.

స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ

స్కోడా కంపెనీకి చెందిన కరోక్ ఎస్‌యూవీని క్యాబ్రియోలెట్ యొక్క కాన్సెప్ట్ వెర్షన్‌లో డెవలప్ చేశారు. ఆక్టోబరు 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 23 మంది విద్యార్థులు పనిచేశారు. జూన్ 2018తో కేవలం 8 నెలల్లోనే సన్‌రాక్ కాన్సెప్ట్ క్యాబ్రియోలెట్ ఎస్‌యూవీని ఆవిష్కరించారు.

స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ

కరోక్ ఎస్‌యూవీ ఆధారంగా ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించడంతో దీనికి సన్‌రాక్ అనే పేరును ఖరారు చేశారు. కరోక్ ఎస్‌యూవీని కంప్లీట్‌గా క్యాబ్రియోలెట్ రూపంలోకి మార్చేందుకు ఈ విద్యార్థుల వివిధ రకాల విభాగాలలో పనిచేశారు.

స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ

ఇంజనీర్లు, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైనర్లు, మార్కెటర్లు మరియు మెకానిక్‌లుగా పనిచేసి సన్‌రాక్ ఎస్‌యూవీని డెవలప్ చేశారు. తమ ఆలోచనలు మరియు ప్రణాళికలు పనిచేస్తాయో లేదో అని స్కోడా కంపెనీ నిపుణుల నుండి కూడా సలహాలు తీసుకొన్నారు.

స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ

ఎత్తును మినహాయిస్తే, స్కోడా సన్‌రాక్ ఎస్‌యూవీ కొలతలు అచ్చం కరోక్ ఎస్‌యూవీని పోలి ఉన్నాయి. స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీలో 204బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఉంది.

స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ

బాడీ రూఫ్ టాప్ తొలగించిన క్యాబ్రియోలెట్ రూపంలో నిర్మించిన ఈ కారులో ఇంటీరియర్ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ, సాధారణ స్కోడా కరోక్‍‌ ఎస్‌యూవీలా పనిచేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 195కిలోమీటర్లు.

స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ

విద్యార్థులు రూపొందించిన ఈ స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ వెనుక వైపున రీడిజైన్ చేయబడిన టెయిల్ గేట్ ఉంది. పర్మినెంట్ ఓపెన్-టాప్ రోడ్‌స్టర్ ఇంటీరియర్‌లో ఎక్ట్సీరియర్‌తో సరిపోలే విలాసవంతమైన డ్యూయల్-టోన్ వైట్ మరియు రెడ్ కలర్ స్కీమ్ ఉంది. మరియు ఫ్రంట్ డిజైన్‌లో ఇల్యూమినేటెడ్ స్కోడా బ్యాడ్జింగ్ ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

తొలి చూపులోనే ఎంతగానో ఆకట్టుకున్న స్కోడా సన్‌రాక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ దశకు అస్సలు చేరదు. అయితే, 2020 వోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీని పోలి ఉంది. వోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ గోల్ఫ్ కారు యొక్క కన్వర్టిబుల్ వెర్షన్. ఇది త్వరలో ప్రపంచ ఆవిష్కరణకు రానుంది.

Most Read Articles

Read more on: #skoda #స్కోడా
English summary
Read In Telugu: Skoda Sunroq Concept Revealed — A One-Off Cabriolet Concept
Story first published: Wednesday, June 6, 2018, 15:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X