భారత్‌ కోసం స్కోడా అభివృద్ది చేస్తున్న చిన్న కారు

స్కోడా ఇండియన్ మార్కెట్ లక్ష్యంగా ఎంట్రీ-లెవల్ హ్యాచ్‍‌బ్యాక్‌ను సిద్దం చేస్తోంది. ఇండియన్ మార్కెట్ కోసం వీలైనంత వరకు తక్కువ ధరలో అందించేందుకు వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ఏఓ ఫ్లాట్‌ఫామ్ ద్వారా చిన

By Anil Kumar

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

ఇండియా వంటి అభివృద్ది చెందిన ప్యాసింజర్ కార్ల మార్కెట్ కోసం స్కోడా ఆటో అతి చిన్న హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది చేస్తున్నట్లు ఇది వరకే ఓ ప్రకటనలో ప్రచురించాము. స్కోడా స్మాల్ కారు గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఇండియన్ మార్కెట్ లక్ష్యంగా ఎంట్రీ-లెవల్ హ్యాచ్‍‌బ్యాక్‌ను సిద్దం చేస్తోంది.

స్కోడా చిన్న కారు

ఇండియన్ మార్కెట్ కోసం వీలైనంత వరకు తక్కువ ధరలో అందించేందుకు వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ఏఓ ఫ్లాట్‌ఫామ్ ద్వారా చిన్న హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తోంది.

స్కోడా చిన్న కారు

భారత్‌లో టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ చిన్న కార్ల అభివృద్ది మరియు తయారీ చేపట్టాలని స్కోడా భావించింది. కానీ, ఇరు సంస్థల మధ్య చర్చలు సఫలం కాలేదు. దీంతో స్కోడా ఒంటిరిగానే చిన్న కార్లను అభివృద్ది చేసుకోవడానికి సిద్దమైంది.

స్కోడా చిన్న కారు

స్కోడా చీఫ్ ఎక్జ్సిక్యూటివ్ బెర్న్‌హార్డ్ మాయర్ మాట్లాడుతూ, "2021 నుండి స్కోడా చిన్న కార్లను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది. కొత్త ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేస్తున్న వీటిని పూర్తి స్థాయిలో దేశీయంగానే ఉత్పత్తి చేస్తుంది. మరియు వోక్స్‌వ్యాగన్ ఫ్లాట్‌ఫామ్‌ను కూడా వీటి అభివృద్ది కోసం వినియోగించుకుంటుందని" ఓ ప్రకటనలో వెల్లడించాడు.

స్కోడా చిన్న కారు

ప్రస్తుతం, స్కోడా ఇండియా లైనప్‌లో ఎలాంటి చిన్న కార్లు లేవు, గతంలో ఉన్న ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను కూడా స్కోడా తమ లైనప్‌ నుండి తొలగించింది. వోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన ఫ్యాబియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పలు విదేశీ మార్కెట్లలో విక్రయాల్లో ఉంది.

స్కోడా చిన్న కారు

అంతర్జాతీయ విపణిలో సిటిగో అనే చిన్న కారును విక్రయిస్తోంది. అయితే, చెక్ రిపబ్లిక్ కెంపెనీ స్కోడా సిటిగో కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవకాశాలు దాదాపుగా లేనట్లే. స్కోడా ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం అత్యంత సరసమైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మాల్ కార్లను తయారు చేయాలని భావిస్తోంది.

స్కోడా చిన్న కారు

స్కోడా మరియు టాటా మోటార్స్ మధ్య ఒప్పందం ఏర్పడితే, టాటా మోటార్స్‌కు చెందిన ఏఎమ్‌పి ఫ్లాట్‌ఫామ్‌ను స్కోడా ఉపయోగించుకునేది. కానీ, ఈ రెండింటి మధ్య భాగస్వామ్యం దాదాపు అసాధ్యమే. కాబట్టి, స్కోడా మాతృ సంస్థ వోక్స్‌వ్యాగన్ గ్రూపులో ఉన్న ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌నే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

స్కోడా చిన్న కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత మార్కెట్లో స్కోడా ప్రీమియమ్ బ్రాండ్. ఖరీదైన సెడాన్ కార్లు మరియు లగ్జరీ ఎస్‌యూవీలను విక్రయించే స్కోడా ఇప్పుడు అత్యంత సరసమైన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును ప్రవేశపెట్టాలని చూస్తోంది. 2021 నాటికి స్కోడా స్మాల్ హ్యాచ్‌బ్యాక్ పూర్తి స్థాయిలో విపణిలోకి రానుంది.

*Images for representational purpose only.

Most Read Articles

Read more on: #skoda #స్కోడా
English summary
Read In Telugu: Skoda To Launch New Small Car In India — Expected Launch And More Details
Story first published: Tuesday, March 6, 2018, 14:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X