భద్రత పరంగా జపాన్ వెర్షన్ స్విఫ్ట్‌కు 5 స్టార్లు: ఇండియన్ స్విఫ్ట్ ఎంత వరకు సేఫ్....?

కేవలం జపాన్ మార్కెట్లో మాత్రమే లభించే స్విఫ్ట్ మోడల్‌కు సేఫ్టీ పరంగా ఐదు స్టార్ల రేటింగ్ లభించింది. అత్యంత సురక్షితమైన ఈ స్విఫ్ట్ జపాన్ మార్కెట్‌కు మాత్రమే పరిమితం. జపాన్ నుండి ఎగుమతయ్యే మరియు ఇతర మార

By Anil Kumar

జపాన్ దిగ్గజం సుజుకి మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును తొలుత జపనీస్ మార్కెట్లో విడుదల చేసి, తరువాత యూరప్, ఇండియా మరియు ఇతర మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. వాస్తవానికి, వెహికల్ సేఫ్టీ రూల్స్ ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. వాటిని పాటిస్తేనే, ఆ దేశంలో కొత్త కార్లను విడుదల చేసే అవకాశం ఉంది.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

ఈ క్రమంలో కార్ల కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వెహికల్ క్రాష్ టెస్ట్ ఏజెన్సీల ద్వారా తమ వాహనాలకు క్రాష్ టెస్ట్ నిర్వహించి, భద్రత పరంగా సేఫ్టీ రేటింగ్ పొందుతాయి. వాటికి అనుగుణంగా వివిధ మార్కెట్లలోకి లాంచ్ చేస్తాయి.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం సుజుకి ఇటీవల థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తాజాగా జపాన్ వెర్షన్ స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ కూడా నిర్వహించింది. జపాన్-న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఐదింటికి ఐదు స్టార్ల రేటింగ్ పొందింది.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

కేవలం జపాన్ మార్కెట్లో మాత్రమే లభించే స్విఫ్ట్ మోడల్‌కు సేఫ్టీ పరంగా ఐదు స్టార్ల రేటింగ్ లభించింది. అత్యంత సురక్షితమైన ఈ స్విఫ్ట్ జపాన్ మార్కెట్‌కు మాత్రమే పరిమితం. జపాన్ నుండి ఎగుమతయ్యే మరియు ఇతర మార్కెట్లో లభించే స్విఫ్ట్‌కు జపాన్ మోడల్ సేఫ్టీకి ఎలాంటి సంభందం లేదు.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

ఈ క్రాష్ ఫలితాలు జపాన్ డొమెస్టిక్ మోడల్ సుజుకి స్విఫ్ట్‌కు మాత్రమే వర్తిస్తాయి. మరియు మేడిన్ ఇండియా స్విఫ్ట్ మోడల్‌కు ఈ సేఫ్టీ రేటింగ్ వర్తించదు. ఎందుకంటే ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్‌తో పోల్చుకుంటే జపాన్ మార్కెట్లో లభించే స్విఫ్ట్ కారులో ఎన్నో రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

జపాన్ వెర్షన్ స్విఫ్ట్ ప్రయాణికుల భద్రత పరంగా 87.8 పాయింట్లు మరియు పాదచారుల భద్రత పరంగా 78.87 పాయింట్లను సాధించింది. మరియు ఓవరాల్‍‌గా జపాన్ స్విఫ్ట్‌కు 5-స్టార్ రేటింగ్ లభించింది.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

ఉదాహరణకు, జపాన్ వెర్షన్ స్విఫ్ట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా లభిస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, డ్యూయల్ సెన్సార్ బ్రేకింగ్ సపోర్ట్ కొల్లిషన్ మిటిగేషన్ సిస్టమ్ కూడా స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

అంతే కాకుండా, స్విఫ్ట్ జపాన్ మోడల్‌లో ఆడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హైబీమ్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, అరౌండ్ వ్యూవ్ మానిటర్, లేన్ డిపార్చర్ వార్నింగ్, వేవింగ్ అలర్ట్ మరియు నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

ఇదే క్రమంలో ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న స్విఫ్ట్ మోడల్ సేఫ్టీ విషయానికి వస్తే, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ వీల్స్‌కు డిస్క్ బ్రేకులు మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మాత్రమే అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. పార్కింగ్ సెన్సార్లు మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా కొన్ని వేరియంట్లలో మాత్రమే లభిస్తున్నాయి.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

జపాన్ మార్కెట్లో ఉన్న థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ కేవలం పెట్రోల్ మరియు పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్‌లతో మాత్రమే లభిస్తోంది. కానీ, ఇండియన్ వెర్షన్ స్విప్ట్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ విపణిలోకి విడుదలైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న 1.2-లీటర్ కె-సిరీస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి-113ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, 1.3-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

రెండు ఇంజన్ ఆప్షన్లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు. ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్ ప్రారంభ ధర రూ. 5 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇదే.

సుజుకి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్

జపాన్ మరియు యూరోపియన్ దేశాలతో పోల్చితే ఇండియాలో వెహికల్ సేఫ్టీ నియమాలు అంత కఠినంగా లేవు. అత్యంత ముఖ్యమైన ఎన్నో సేఫ్టీ ఫీచర్లను భారత ప్రభుత్వం తప్పనిసరి చేయాల్సి ఉంది. పెరుగుతున్న జనాభా, అరకొర సేఫ్టీ ఫీచర్లు గల వాహనాలు మరియు నాణ్యమైన రోడ్లు లేకపోవడంతో ఏ చిన్న ప్రమాదం జరిగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

జపాన్‌లో ఎన్నో సేఫ్టీ ఫీచర్లతో లభించే స్విఫ్ట్, కనీసం అందులో సగం ఫీచర్లు కూడా ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్‌లో లేకపోడం చాలా దారుణం. మార్కెట్ వాటా పెంచుకునే క్రమంలో కార్ల కంపెనీలు కూడా కస్టమర్ల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Swift gets 5 star JNCAP safety rating
Story first published: Wednesday, June 13, 2018, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X