టాటా హ్యారియర్‌కు పోటీని తీసుకొస్తున్న మారుతి

ప్రీమియం ఎస్‌యూవీ కెటగిరీ ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ విభాగంలో టాటా మోటార్స్ హ్యారియర్ ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది. ఇప్పుడు, ఈ కెటగిరీలో పోటీని తీవ్రం చేస్తూ మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ

By Anil Kumar

దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో ఎస్‌యూవీ విభాగం కీలకంగా మారింది. ఇందులో ప్రీమియం ఎస్‌యూవీ కెటగిరీ ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ విభాగంలో టాటా హ్యారియర్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్దమయ్యింది. ఇప్పుడిదే కెటగిరీలో పోటీని తీవ్రం చేస్తూ మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ విడుదలను ఖరారు చేస్తోంది.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

అవును, మీరు చదివింది నిజమే, దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో రాణిస్తున్న మారుతి సుజుకి ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు కసరత్తులు ప్రారంభించింది.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

అతి త్వరలో అంతర్జాతీయ ఆవిష్కరణకు రానున్న సుజుకి వితారా ఎస్‌యూవీ ఇప్పుడు మారుతి డీలర్ వద్ద రహస్యంగా పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. మరికొన్ని వారాల్లో ప్యారిస్‌లో జరగనున్న 2018 ప్యారిస్ మోటార్ షో లో సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించడానికి సిద్దమవుతోంది.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

హ్యాచ్‌బ్యాక్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న టాటా మోటార్స్ నుండి మారుతి ఇప్పటికే తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది. ఇప్పుడు టాటా తాజాగా హ్యారియర్ అనే ఎస్‌యూవీని 2019 ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో ఉలిక్కిపడిన మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీని తెరపైకి తీసుకొచ్చింది.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

అవును, టాటా ఆధిపత్యానికి బ్రేకులు వేసేందుకు హ్యారియర్‌ ఎస్‌యూవీకి పోటీగా సుజుకి వితారా ఎస్‌యూవీని విడుదల చేయాలని మారుతి సుజుకి భావిస్తోంది. సుజుకి వితారా విపణిలో ఉన్న వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ పై స్థానాన్ని భర్తీ చేయనుంది.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

2018 మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న సరికొత్త పొడవాటి క్రోమ్ స్లట్లు ఉన్న ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన లోయర్ సెక్షన్, అధునాతన హెడ్ ల్యాంప్స్, పెద్ద పరిమాణంలో ఉన్న ఎల్ఈడీ ల్యాంప్స్ మరియు నూతన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

వితారా ఇంటీరియర్‌ను ఇంటిగ్రేటెడ్ కలర్ స్క్రీన్ గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో తీర్చిదిద్దారు. సౌకర్యవంతమైన సీటింగ్, నాణ్యమైన అప్‌హోల్‌స్ట్రే మరియు సాఫ్ట్ టచ్ మెటీరియల్ గల ఇంస్ట్రుమెంట్ ప్యానల్ వంటివి ఉన్నాయి.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

సేఫ్టీ పరంగా సుజుకి వితారా ప్రీమియం ఎస్‌యూవీలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మరియు క్రాస్ ట్రాఫిక్ అలర్ట్స్ వంటి ఎన్నో అధునాతన భద్రత ఫీచర్లు ఉన్నాయి.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

సుజుకి వితారా ప్రీమియంలో సాంకేతికంగా 1.0-లీటర్ మరియు 1.4-లీటర్ బూస్టర్ జెట్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లు ఉన్నాయి. ఇవి వరుసగా 111బిహెచ్‌పి మరియు 140బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ ఆల్‌గ్రిప్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా లభిస్తుంది.

సుజుకి వితారా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి

సుజుకి వితారా ధరల వివరాలు ఇంకా వెల్లడవ్వలేదు. సమాచార వర్గాల కథనం మేరకు, దీని ప్రారంభ ధర రూ. 15 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. తొలుత యూరోపియన్ మార్కెట్లో విడుదలయ్యి, ఆ తరువాత ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న వితారా కంపెనీ యొక్క నెక్సా ప్రీమియం విక్రయ కేంద్రాలలో మాత్రమే లభించనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: New Suzuki Vitara showcased to dealers
Story first published: Thursday, August 9, 2018, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X