బాలెనో, ఎలైట్ ఐ20 కార్లకు పోటీగా వస్తున్న టాటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇదే

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో సరికొత్త 45ఎక్స్ కారును విడుదల చేసేందుకు సిన్నద్దమవుతోంది. తాజాగా, టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ యొక్క ప్రోటోటైప్ వ

By Anil Kumar

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో సరికొత్త 45ఎక్స్ కారును విడుదల చేసేందుకు సిన్నద్దమవుతోంది. తాజాగా, టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ యొక్క ప్రోటోటైప్ వెర్షన్‌ను ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో ఉన్న టాటా మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కార్లకు గట్టి పోటీనివ్వనున్న టాటా 45ఎక్స్ గురించి పూర్తి వివరాల కోసం...

టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్

టాటా ప్రతినిధులు తాజాగా టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ కారును పరీక్షిస్తుండగా, పలు ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలను రహస్యంగా సేకరించారు. ఆ ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్

తాజాగా లభించిన ఫోటోల మేరకు, టాటా 45ఎక్స్ ఇంటీరియర్‌లో అధునాతన్ స్టీరింగ్ వీల్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డ్యాష్‌బోర్డ్ డీటైల్స్ గమనించవచ్చు. అంతే కాకుండా, టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో ఉన్నటువంటి ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా గుర్తించవచ్చు.

టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్

టాటా 45ఎక్స్ ఇంటీరియర్‌లోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌కు ఇరువైపులా అనలాగ్ డయల్స్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డుకు మధ్యలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింది వైపున రెండు చివరల్లో ఏసి వెంట్స్ ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌లో క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి మరియు ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ టాటా 45ఎక్స్ సొంతం.

టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్

డిజైన్ విషయానికి వస్తే, రోడ్ల మీద పరీక్షిస్తున్న టాటా 45ఎక్స్ ఎక్ట్సీరియర్ మొత్తాన్ని ఎలాంటి డిజైన్ అంశాలు గుర్తించడానికి వీల్లేకుండా బ్లాక్ అండ్ వైట్ పేపరుతో కప్పేశారు. టాటా మోటార్స్ 45ఎక్స్ కాన్సెప్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును టాటా ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా రూపొందించారు మరియు ఇందులో పెద్ద పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ మరియు వీల్ ఆర్చెస్ గల సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు రానున్నాయి.

టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్

టాటా మోటార్స్ 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గురించి ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించలేదు. అయితే, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు వచ్చే అవకాశం ఉంది. నెక్సాన్ కంటే శక్తివంతమైన కారుగా వస్తున్న టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ పరిచయం కానుంది.

టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్

టాటా మోటార్స్ 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్‌ను తొలుత మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పరిచయం చేసి, తరువాత దశలో టాటా అభివృద్ది చేస్తున్న డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించే అవకాశం ఉంది.

టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్

టాటా మోటార్స్ ఇటీవల హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ హ్యారియర్ అనే పేరును ఖరారు చేసింది. టాటా హ్యారియర్ ప్రీమియం ఎస్‌యూవీని వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల చేసిన అనంతరం, 2019 మలి సగంలో 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల పరిశ్రమలో మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి మోడళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటా మోటార్స్ 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ కారును సిద్దం చేస్తోంది. ఫ్యూచర్ డిజైన్ అంశాలు మరియు అత్యాధునిక ఫీచర్ల మేళవింపులతో రుపొందించిన టాటా 45ఎక్స్ టాటాకు మరో భారీ విజయాన్ని సాధించిపెట్టడం ఖాయం అని చెప్పవచ్చు.

Source: ACI

Most Read Articles

English summary
Read In Telugu: Tata 45X Hatchback Spotted Testing In India — Interior Revealed Read more at:
Story first published: Friday, August 10, 2018, 15:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X