ఆటో ఎక్స్‌పో 2018: ఆటో ఎక్స్‌పోలో సత్తా చాటిన టాటా మోటార్స్

By Anil

దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటర్స్ గత రెండేళ్ల నుండి అద్భుతమైన సేల్స్ సాధిస్తోంది. గతంలో ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా తీసుకొచ్చిన టియాగో, నెక్సాన్, హెక్సా మరియు టిగోర్ కార్లే ఇందుకు కీలకం.

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ మంచి సక్సెస్ సాధించడంతో తాజాగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో ఇదే ఫిలాసఫీలోని 2.0 వెర్షన్ ఆధారంగా అభివృద్ది చేసిన మరికొన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

భారతదేశపు టాప్ 3 బెస్ట్ ప్యాసింజర్ కార్ల కంపెనీల జాబితాలో స్థానం దక్కించుకోవడంలో ఈ కొత్త మోడళ్లు కీలకపాత్ర పోషించనున్నాయి. ఆటో ఎక్స్‌పోలో టాటా ఆవిష్కరించిన తొమ్మిది కొత్త మోడళ్ల గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోలు ఇవాళ్టి ప్రత్యేక కథనంలో....

Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా హెచ్5ఎక్స్ కాన్సెప్ట్

టాటా మోటార్స్ ఈసారి పూర్తిగా ఎస్‌యూవీ సెగ్మెంట్ మీదనే టార్గెట్ చేసింది. టాటా ఇండియా లైనప్‌లోనే అతి ముఖ్యమైన మరియు ఖరీదైన మోడల్‌ హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ లగ్జరీ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. లగ్జరీ కార్ల కంపెనీల డిజైన్ తరహాలో ప్రవేశపెట్టిన టాటా హెచ్5ఎక్స్‌కు ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా మోటార్స్ హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీని టాటా వారి ఒమెగా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించింది. ఈ ఫ్లాట్‌ఫామ్‌ను టాటా సొంతం చేసుకున్న బ్రిటన్ సంస్థ ల్యాండ్ రోవర్ వారి ఎల్ఆర్ ఛాసిస్ ఆధారంగా అభివృద్ది చేశారు.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

ప్రొడక్షన్ వెర్షన్ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని టాటా బృందం ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. ఈ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ఇండియన్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీల తరువాత అత్యధిక ఆదరణ లభిస్తున్న సెగ్మెంట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్. ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. వీటికి పోటీగా సంచలనాత్మక 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్‌ను టాటా రివీల్ చేసింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా కాన్సెప్ట్ వెర్షన్‌లో కొలువుదీరిన టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. అత్యాధునిక ఫ్యూచరిస్టిక్ డిజైన్ మరియు ఎక్ట్సీరియర్ స్టైలింగ్‌తో చూపరులను విపరీతంగా ఆకర్షించింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో టాటా నుండి ఊహించని డిజైన్ లక్షణాలు వచ్చాయి. పదునైన ఫ్రంట్ అండ్ రియర్ లుక్, సైడ్ డిజైన్‌లో ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్ మరియు రియర్ డిజైన్‌లో మునుపెన్నడూ టాటా ఉత్పత్తుల్లో ఇప్పటి వరకు పరిచయం చేయని సరికొత్త రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే ఇతర మోడళ్ల మనుగడకు పెద్ద ప్రమాదమనే చెప్పవచ్చు.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా నెక్సాన్ ఏరో

టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆధారిత ఎస్‌యూవీని ఆటో ఎక్స్‌పో వేదికలో ఆవిష్కరించింది. కస్టమైజ్డ్ లేదా వ్యక్తిగతంగా నచ్చినట్లు ఎక్ట్సీరియర్ బాడీ స్టైలింగ్‌లో నెక్సాన్ ఏరో ద్వారా ఎంచుకునే అవకాశాన్ని టాటా మోటార్స్ కల్పించింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా నెక్సాన్ ఏరో కాంపాక్ట్ ఎస్‌యూవీని ఏరో మరియు ఆక్టివ్ అనే రెండు కస్టమైజేషన్ కిట్ లతో ఎంచుకోవచ్చు. అరుదైన నెక్సాన్ ఎస్‌యూవీలను కోరుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ టాటా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా నెక్సాన్ ఏరో ఎక్ట్సీరియర్‌లో లిక్విడ్ సిల్వర్ బాడీ కలర్ స్కీమ్, పియానో బ్లాగ్ ఫినిషింగ్ గల రూఫ్ టాప్, ఫ్రంట్ మరియు రియర్ బంపర్ ప్రొటెక్టర్స్, సైడ్ స్కర్ట్స్, ఇంటీరియర్‌లో గ్లాస్ బ్లాక్ ప్లాస్టిక్ ఫినిషింగ్ గల సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్ మరియు డ్యాష్‌బోర్డ్ వంటివి రెగ్యులర్ నెక్సాన్‌ కంటే నెక్సాన్ ఏరో మోడల్‌ను విభిన్నంగా చూపిస్తాయి.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

టాటా మోటార్స్ గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటాకు అద్భుతమైన సేల్స్ సాధించిపెడుతోంది. గతంలో కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే నెక్సాన్‌లో ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా చేర్చింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

తాజాగా ఢిల్లీలో జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లో ఆవిష్కరించింది. టాటా ప్రతినిధుల కథనం మేరకు, మరికొన్ని నెలల్లో దీనిని పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

రెగ్యులర్ వెర్షన్ నెక్సాన్ కంటే ఏఎమ్‌టి వెర్షన్ నెక్సాన్ ధర రూ. 30,000 లు అధికంగా ఉండనుంది. అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లో వస్తున్న నెక్సాన్ ఏఎమ్‌టిలో సిటీ, ఇకో మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్‌ మోడ్స్ ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా టియాగో జెటిపి

టాటా మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ టియాగో యొక్క పర్ఫామెన్స్ వెర్షన్‌ను ఆటో ఎక్స్‌లో ఆవిష్కరించింది. దీనిని దేశీయ ఆటోమోటివ్ దిగ్గజం జయేం ఆటో భాగస్వామ్యంతో టాటా మోటార్స్ సంయుక్తంగా అభివృద్ది చేసి, జయేం టాటా పర్ఫామెన్స్(JTP) అనే బ్యాడ్జ్ పేరును అందించింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా టియాగో జెటిపి రెగ్యులర్ వెర్షన్ యొక్క స్పోర్ట్స్ కారుగా తీసుకొచ్చింది. సాధారణ టియాగోతో పోల్చితే టియాగో జెటిపి ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో జెటిపి బ్యాడ్జింగ్ మరియు ప్రత్యేకమైన డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా టిగోర్ జెటిపి

టియాగో తరహాలోనే టిగోర్ రెగ్యులర్ వెర్షన్ యొక్క పర్ఫామెన్స్ వెర్షన్‌ను టిగోర్ జెటిపి పేరుతో ఆవిష్కరించింది. టాటా టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి రెండు మోడళ్లలో కూడా అత్యంత శక్తివంతమైన నెక్సాన్ నుండి సేకరించిన 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ అందించారు.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

జయేం భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన ఎయిర్ ఇంటేక్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా ఈ జెటిపి వెర్షన్ టియాగో మరియు టిగోర్ కార్లలో అందించిన పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 109బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు మోడళ్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా టియాగో ఎలక్ట్రిక్

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల విభాగంలో టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ సెడాన్ ఆధారిత ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టింది. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దం చేసిన కార్లను ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

ప్రస్తుతం మహీంద్రా మాత్రమే పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు చేపట్టింది. దీనికి పోటీగా తనదైన శైలిలో రాణించేందుకు టాటా ప్రయత్నిస్తోంది. టియాగో మరియు టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి అచ్చం రెగ్యులర్ మోడళ్లనే పోలి ఉంటాయి. అయితే, ఎక్ట్సీరియర్‌లో ఇవి అనే బ్యాడ్జ్ ఉంటుంది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా టిగోర్ ఎలక్ట్రిక్

టాటా టియాగో మరియు టిగోర్ రెండు కార్లలో కూడా ఇంజన్ స్థానంలో ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ అందించారు. ఆటోమొబైల్ సెక్టార్‌కు కావాల్సిన ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ అభివృద్ది, తయారీ మరియు సరఫరా చేసే సంస్థ ఎలక్ట్రా ఇవి కంపెనీ నుండి సేకరించిన పవర్ ట్రైన్ ఈ రెండు కార్లలో అందివ్వడం జరిగింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టియాగో మరియు టిగోర్ ఎలక్ట్రిక్ కార్లలో త్రీ-ఫేస్ ఏసి ఇండక్షన్ మోటార్ గరష్టంగా 40బిహెచ్‌పి వరకు పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిని పది లక్షల ధరల శ్రేణిలో విడుదల చేసే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా టామో రేస్‌మో & రేస్‌మో ఎలక్ట్రిక్(RaceMo)

టాటా మోటార్స్ రేస్‌మో మోడల్‌ను తొలుత జెనీవా మోటార్ షో 2017లో ఆవిష్కరించింది. గోల్డ్ క్యాటగిరీలో జర్మన్ డిజైన్ అవార్డుల పోటీల్లో పాల్గొన్న రేస్‍‌మో సూపర్ మరియు రేస్‌మో ఎలక్ట్రిక్ కార్లును ఆటో ఎక్స్‌పో 2018లో ప్రదర్శించారు.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా రేస్‌మో సూపర్ కారులో 1.2-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 187బిహెచ్‌పి పవర్ మరియు 210ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

టాటా రేస్‌మే కేవలం 6 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇదే వేదికగా రేస్‌మో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ఆవిష్కరించి టాటా దానికి సంభందించిన ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించలేదు.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ రెండు సరికొత్త మోడళ్లతో పాటు, కస్టమైజేషన్, ఆటోమేటిక్, స్పోర్ట్స్ ఎడిషన్, పర్ఫామెన్స్ ఎడిషన్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లతో పాటు సూపర్ కార్ ఇలా అన్ని సెగ్మెంట్ల వారీగా విభిన్న మోడళ్లను విష్కరించింది.

ఆటో ఎక్స్‌పోలో టాటా కొత్త కార్లు

ఆటో ఎక్స్‌పో 2018లో ప్రదర్శించిన అన్ని కార్లను ఒక్కొక్కటిగా రానున్న రెండేళ్లలోపు విపణిలోకి విడుదల చేయనుంది. ఈ అన్ని మోడళ్లు మార్కెట్లోకి వస్తే, ప్రతక్షంగా మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ మోటార్స్‌కు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Tata Cars At Auto Expo; Unveils, Showcases, Concepts, EVs, Sports Versions & More
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X