కంపాస్ మరియు ఎక్స్‌యూవీ500కు పోటీగా టాటా నుండి 5,7-సీటర్ హెచ్5 ఎస్‌యూవీ

2018 ఆటో ఎక్స్‌పో వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు సరికొత్త మోడళ్ల ఆవిష్కరణకు సిద్దమయ్యాయి.

By Anil

Recommended Video

Fire Accident In Chengicherla, Telangana | Petrol Tanker Blast

2018 ఆటో ఎక్స్‌పో వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు సరికొత్త మోడళ్ల ఆవిష్కరణకు సిద్దమయ్యాయి. అందులో దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ చిన్న మోడళ్లతో పాటు అత్యంత ఖరీదైన ఎస్‌యూవీలను కూడా ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది.

టాటా హెచ్5 ఎస్‌యూవీ

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, టాటా మోటార్స్ ప్రొడక్షన్ దశకు చేరుకున్న హెచ్5 అనే కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ఎస్‌యూవీని రూపొందించినట్లు తెలిసింది. మార్కెట్లో ఉన్న జీప్ కంపాస్‌కు గట్టి పోటీనిచ్చేలా దీనిని డెవలప్ చేసినట్లు తెలిసింది.

టాటా హెచ్5 ఎస్‌యూవీ

ఈ సరికొత్త ఎస్‌యూవీని టాటా మోటార్స్ 5-సీటింగ్ మరియు 7-సీటింగ్ లేఔట్లో పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. రెండు వెర్షన్‌లు కూడా ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎల్550 ఫ్లాట్‌ఫామ్ మీద టాటా బృందం అభివృద్ది చేస్తోంది.

టాటా హెచ్5 ఎస్‌యూవీ

కంపాస్‌కు పోటీగా వస్తున్న టాటా హెచ్5 ఎస్‌యూవీలో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ వారి 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల మల్టీజెట్-II డీజల్ ఇంజన్ రానుంది. 5-సీటర్ వెర్షన్‌లోని ఇంజన్ 140బిహెచ్‌పి పవర్ మరియు 7-సీటర్ వెర్షన్‌లోని ఇంజన్ 170బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా హెచ్5 ఎస్‌యూవీ

టాటా హెచ్5 ఎస్‌యూవీలోని బేస్ వేరియంట్ టూ వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యం కానున్నాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా పోటీని ఎదుర్కొనేందుకు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో రావచ్చు.

Trending On DriveSpark Telugu:

ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి నగ్న సత్యాలు

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు: వీడియో

భర్తకు భలే కానుకిచ్చిన జెనీలియా

టాటా హెచ్5 ఎస్‌యూవీ

వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తమ ఇంపాక్ట్ డిజైన్ 2.0 వెర్షన్‌ను పరిచయం చేయనుంది. ఈ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా అభివృద్ది చేసిన మోడళ్లకు ఈ ఆటో ఎక్స్‌పో ప్రధాన వేదిక కానుంది.

టాటా హెచ్5 ఎస్‌యూవీ

టాటా హెచ్5 ఎస్‌యూవీ 5-సీటర్ ధరల శ్రేణి రూ. 13 లక్షలు మరియు హెచ్5 7-సీటర్ ధరల శ్రేణి రూ. 15 లక్షల నుండి మొదలయ్యే అవకాశం ఉంది. పలు ఆటోమొబైల్ మీడియాలు టాటా తమ హెచ్5 ఎస్‌యూవీని పరీక్షిస్తున్నపుడు రహస్యంగా ఫోటోలు సేకరించాయి.

టాటా హెచ్5 ఎస్‌యూవీ

టాటా హెచ్5 ప్రీమియమ్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500, జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా, రెనో క్యాప్చర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా హెచ్5 ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో ఇండియన్ మార్కెట్లో తననుతాను పునర్నిర్మించుకుంది. చతికిలపడిపోయే దశలో చివరి ప్రయత్నంగా ఇంపాక్ట్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా గత రెండేళ్లలో పరిచయం చేసిన ఎన్నో మోడళ్లు టాటా మోటార్స్‌కు భారీ విజయాన్ని సాధించి పెట్టాయి.

టాటా హెచ్5 ఎస్‌యూవీ

భవిష్యత్తులో భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా ఎదిగేందుకు టాటా మోటార్స్ ఇప్పుడు ఇంపాక్ట్ డిజైన్ లాంగ్వేజ్ 2.0 వెర్షన్ ఆధారంగా ఎన్నో కొత్త మోడళ్ల ఆవిష్కరణకు సిద్దమవుతోంది. ఢిల్లీ జరిగే ఆటో ఎక్స్‌పో లైవ్‌ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: Autocar IndiaImage Suorce: The Automotive India

Most Read Articles

English summary
Auto Expo 2018: Tata H5 (Q501) Five-Seater, Seven-Seater SUV To Be Unveiled. Read In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X