టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఆటో ఎక్స్‌పో 2018: టాటా మోటార్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా సంచలనాత్మక ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇదే వేదిక మీద తమ తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్న విదేశీ సంస్థలకు దిమ్మతిరిగే ఎస్‌యూవీని తీసుకొచ్చింది. టాటా మోటార్స్ ఈ ప్రీమియమ్ ఎస్‌యూవీని హెచ్5ఎక్స్ అనే పేరుతో ప్రదర్శించింది.

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 వెర్షన్ ఆధారంగా రూపొందించిన కాన్సెప్ట్ ఎస్‌యూవీలలో హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ ఒకటి. టాటా మోటార్స్ ఆప్టిమల్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ మీద హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని నిర్మించింది.

Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight
టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

ఒమెగా ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్‌ను టాటా తమ భాగస్వామ్యపు సంస్థ ల్యాండ్ రోవర్ సహకారంతో అభివృద్ది చేసింది. ల్యాండ్ రోవర్‌లోని ప్రసిద్దిగాంచిన ఎల్ఆర్4 ఛాసిస్ మీద వీటిని అభివృద్ది చేయడం మరోప్రత్యేకత.

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

టాటా హెచ్5ఎక్స్ డిజైన్

డిజైన్ పరంగా టాటా హెచ్5ఎక్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. పలుచటి యాంగులర్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, హెడ్ ల్యాంప్స్ మధ్యలో చిన్న పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కు క్రింది వైపున ఫ్రంట్ బంపర్‌కు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ డిజైన్ మొత్తాన్ని బంపర్ క్రింద ఉన్న భారీ స్కిడ్ ప్లేట్ డామినేట్ చేస్తోంది.

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

సైడ్ డిజైన్‌లో అత్యంత ఎతైన బాడీ, పెద్ద పరిమాణంలో విభిన్న డిజైన్ శైలిలో ఉన్న అల్లాయ్ వీల్స్, ఫ్లోటింగ్ రూప్ లైన్ స్లోప్, పదునైన రియర్ డిజైన్, నలుపు రంగులో ఉన్న సి-పిల్లర్లు వంటివి అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

టాటా హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో నెక్సాన్ ఎస్‌యూవీ యొక్క పదునైన డిజైన్ లక్షణాలు గమనించవచ్చు. రూఫ్ టాప్ వెనుక వైపున షార్ప్ ఎండ్ రియర్ అద్దాన్ని కొద్దిగా కవర్ చేస్తూ ఎంతో ముచ్చటగా ఉంది. పదునైన మరియు పలుచగా ఉన్న ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు ఎర్రటి రంగులో వెలిగే ఫ్రంట్ మరియు రియర్ టాటా లోగోను అందివ్వడం జరిగింది.

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

టాటా హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లోకి వస్తే, అసలు ఇది టాటా ఎస్‌యూవీనేనా... అనే ఆశ్చర్యం కలగకమానదు. టాటా మోటార్స్ ల్యాండ్ రోవర్ ఆధారిత పెద్ద పెద్ద సీట్లు, మూడు లేయర్లు ఉన్న డ్యాష్‌బోర్డ్ మరియు ల్యాండ్ రోవర్ నుండి గేర్‌నాబ్ హబ్ మొత్తాన్ని యథావిధిగా ఇందులో అందించారు.

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

అతి ముఖ్యమైన ఇతర ఇంటీరియర్ ఫీచర్లలో ఇంస్ట్రుమెంట్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ స్థానాన్ని భర్తీ చేసే డబుల్ ఫ్లోటింగ్ డిస్ల్పే, రియర్ ప్యాసింజర్ల కోసం ఫ్రంట్ సీట్లకు వెనుక వైపున ప్రత్యేక డిస్ల్పేలను అందివ్వడం జరిగింది.

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

ఇంజన్ మరియు ఇతర సాంకేతిక వివరాలను టాటా ఇంకా వెల్లడించలేదు. టాటా వారి ప్రీమియమ్ ఎస్‌యూవీగా పరిగణిస్కున్న దీనిని విపణిలో ఉన్న జీప్ కంపాస్ మరియు ఇతర ప్రీమియమ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీగా వచ్చే రెండేళ్లలోపు మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

టాటా హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కాన్సెప్ట్ వెర్షన్‌లో ఆవిష్కరించిన హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ ఇలా ఉంటే... మరి ప్రొడక్షన్ వెర్షన్ ఎస్‌యూవీ ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. అమెరికా దిగ్గజానికి(జీప్)పోటీయే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో‌ ప్రదర్శించిన ఈ టాటా హెచ్5ఎక్స్‌ ఎస్‌యూవీకి సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది.

ఈ టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ గురించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి....

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Tata H5X Concept SUV Unveiled
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X