కొత్త ఎస్‍యూవీకి హ్యారియర్ పేరును ఖరారు చేయాలని భావిస్తున్న టాటా

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో హెచ్5ఎక్స్ (H5X) కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఆ తరువాత ఇండియన్ రోడ్ల మీద పలుమార్లు పరీక్షిస్తూ వచ్చింది. ఇప్పుడు ప

By Anil Kumar

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో హెచ్5ఎక్స్ (H5X) కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఆ తరువాత ఇండియన్ రోడ్ల మీద పలుమార్లు పరీక్షిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీకి టాటా హ్యారీయర్ అనే పేరు ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ తమ నూతన ఎస్‌యూవీకి టాటా హ్యారీయర్ అనే పేరును ఖరారు చేస్తున్నట్లు అతి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. హ్యారీయర్ కొత్త పేరు ఏమీ కాదు, టయోటా అంతర్జాతీయ మార్కెట్లో హ్యారీయర్ పేరుతో మిడ్ సైజ్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టయోటా హ్యారీయర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీని జపాన్ మరియు మలేషియా వంటి అంతర్జాతీయ విపణిలో మాత్రమే విక్రయిస్తోంది, కాబట్టి ఇండియాలో టాటా హ్యారీయర్‌కు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ఈ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని 2019 తొలిసగంలో విడుదల చేయాలని భావిస్తోంది. దీని విడుదల కంటే ముందుగా దేశవ్యాప్తంగా టాటా సేల్స్ నెట్‍‌‌వర్క్ పెంచుకోవాలనే ఆలోచనలో ఉంది. అంతే కాకుండా భవిష్యత్తులో ప్రవేశపెట్టనున్న ఖరీదైన ఉత్పత్తులు మరియు పొటెన్షియల్ కస్టమర్ల కోసం తమ విక్రయ కేంద్రాలను విలాసవంతంగా తీర్చిదిద్దనుంది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ ఆవిష్కరణతో టాటా మోటార్స్ వారి ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీని పరిచయం చేసింది. ప్రొడక్షన్ వెర్షన్ హెచ్5ఎక్స్ చూడటానికి దాదాపు కాన్సెప్ట్ వెర్షన్‌నే పోలి ఉంది. ఇటీవల రహస్యంగా లీక్ అయిన ఫోటోల ద్వారా టాటా హెచ్5ఎక్స్ డిజైన్ అంశాలను గుర్తించడం జరిగింది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని నిజానికి ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేశారు. భారత రహదారి పరిస్థితులకు తగ్గట్లుగా మరియు తక్కువ ధరలో ఈ హెచ్5ఎక్స్‌ను నిర్మించారు. టటా హెచ్5ఎక్స్ లేదా హ్యారీయర్ 5-సీటర్ మరియు 7-సీటర్ లేఔట్లో లభ్యం కానుంది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

సాంకేతికంగా టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో ఫియట్ నుండి సేకరించిన 2-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. జడ్ఎఫ్ కంపెనీ నుండి సేకరించిన 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 140 నుండి 170బిహెచ్‌పి మధ్య పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. జీప్ కంపాస్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్ ఉంది. పెట్రోల్ వేరియంట్ కోసం నూతన ఇంజన్ పరిచం చేయనుంది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీకి కొనసాగింపుగా 2.0 వెర్షన్ ప్రారంభించింది. ఈ నూతన ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా నిర్మించి, హెచ్5ఎక్స్ పేరుతో ఆవిష్కరించిన ఎస్‌యూవీకి "హ్యారీయర్" అనే పేరును పరిశీలిస్తోంది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా హ్యారీయర్ పేరు పట్ల మీ అభిప్రాయం ఏమిటి...? టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీకి హ్యీరియర్ కాకుండా ఏదైనా కొత్త పేరు పెట్టాలంటే మీరు ఏ పేరు పెడతారు...? క్రింది కామెంట్ బాక్సులో రాయండి.

Most Read Articles

English summary
Read In Telugu: Tata H5X To Be Named As Tata Harrier — Launch In 2019
Story first published: Monday, July 9, 2018, 15:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X