దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో తమ హ్యారియర్ ఎస్‌యూవీ విడుదలకు చకచకా ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోంది. అంతే కాకుండా కొత్త టాటా హ్యారియర్ కారును 2019లోని మొదటి త్రైమాసిక అవధిలో విడుదల చెయ్యాలని కొన్ని రోజుల క్రితం పూణే ప్లంట్లో కొత్త కారు ఉత్పాదనను ప్రారంభించారు.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

మార్కెట్లో ఎంతాగానో హైప్ క్రియేట్ చేసిన టాటా హ్యారియర్ కారుల ఖరీదు కోసం ఇప్పుడప్పుడే కొన్ని టాటా డీలర్లు బుక్కింగ్ తీసుకోవటం ప్రారంభించారు. కొత్త కారు కొనుగెలు చేసుకోవాలని ఇష్టపడిన వారు మీ దెగ్గిరలో ఉన్న టాటా డిలర్ల దెగ్గర రూ. 30,000 కట్టి ప్రీ-బుక్కింగ్ చేసుకోవచ్చు.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ భాగస్వామ్యంతో రూపొందించిన ఆప్టిమల్ మోడ్యూలర్ ఎఫీషియంట్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్‍‌ను ఉపయోగించి హ్యారియర్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని నిర్మించారు.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా హ్యారియర్‌ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ఉన్న డ్యాష్‌బోర్డు, స్టీరింగ్ వీల్ మరియు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏ మాత్రం గమనించడానికి వీల్లేకుండా పూర్తిగా కప్పేశారు. మోనోటోన్ లైటింగ్ గల ఇంస్ట్రుమెంట్ చాలా సింపుల్‌‌గా ఉంది. క్రోమ్ ఫినిషింగ్ గల స్పీడో మీటర్ మరియు ఆర్‌పిఎమ్ మీటర్లను గుర్తించవచ్చు.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా హ్యారియర్ ఇంటీరియర్‌లో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ల్పే (MID) కలదు. ఇది, ఫ్యూయల్ లెవల్, మైలేజ్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్ ఇంకా ఎన్నో వివరాలను చూపిస్తుంది. MID సిస్టమ్ యొక్క వివి ఫంక్షన్స్ యాక్సెస్ చేసుకునేందుకు మోడ్ అండ్ సెటప్ బటన్లు ఉన్నాయి.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా హ్యారియర్‌లోని స్టీరింగ్ వీల్ చాలా కొత్తగా ఉంది మరియు స్టీరింగ్ వీల్‌కు ఇరువైపులా పలు రకాల కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్‌కు ఎడమవైపున మ్యూజిక్, బ్లూటూత్, మరియు రిసీవ్ అండ్ ఎండ్ కాల్ బటన్స్ ఉన్నాయి. అదే విధంగా స్టీరింగ్ వీల్ మీద కుడివైపున క్రూయిజ్ కంట్లోల్ బటన్స్ ఉన్నాయి.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

హ్యారియర్ ఇంటీరియర్‌లో టియాగోలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ లైట్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ప్రీమియం ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో పలు రకాల అప్లికేషన్స్‌తో అనుంసధానమయ్యే అధునాతన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

ఏదేమైనప్పటికీ, టాటా మోటార్స్ ఈ మోడల్‌ను పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసింది. మరియు తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో దేశీయందా తయారైన విడి పరికరాలతో ఉత్పత్తి చేయనుంది.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా హెచ్5ఎక్స్ లేదా ప్రొడక్షన్ వెర్షన్ టాటా హ్యారియర్ సాంకేతికంగా ఫియట్ నుండి సేకరించిన 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్న ఇందులో బహుశా ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ పరిచయమ్యే అవకాశం ఉంది.

దేశంలో కొత్త హ్యారియర్ కారు ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ తమ ఫ్లాగ్‌షిప్ మరియు లగ్జరీ ఎస్‌యూవీకి హ్యారియర్ పేరును అధికారికంగా ఖరారు చేసింది. గతంలో దీనిని హెచ్5ఎక్స్ పేరుతో పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద అత్యంత కఠినమైన పరీక్షలు జరిపింది. 2019 ప్రారంభంలో విడుదల కానున్న టాటా హ్యారియర్ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

Read more on: #tata motors #new car #suv
English summary
Tata harrier production begins india first suv rolls out pune plant.
Story first published: Friday, November 2, 2018, 10:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X