మారుతి బాలెనో మరియు హ్యుందాయ్ ఐ20 లకు చెమటలు పుట్టించే టాటా కొత్త మోడల్

టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018 వాహన ప్రదర్శన వేదిక మీద విసృత శ్రేణి కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో టాటా ఆవిష్కరించనున్న కొత్త ఉత్పత్తులకు సంభందించిన టీజర్లను

By Anil

Recommended Video

Ducati 959 Panigale Crashes Into Buffalo - DriveSpark

టాటా మోటార్స్ అతి త్వరలో ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌పో 2018 వాహన ప్రదర్శన వేదిక మీద విసృత శ్రేణి కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో టాటా ఆవిష్కరించనున్న కొత్త ఉత్పత్తులకు సంభందించిన టీజర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తోంది.

టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

విపణిలో ఉన్న మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు పోటీనిచ్చే ఎక్స్451 మోడల్ ఫోటోలను టీజర్ రూపంలో రివీల్ చేసి పోటీదారులకు చెమటలు పుట్టించింది.

టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

టాటా మోటార్స్ ఎక్స్451 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ టీజర్ ఫోటోను రివీల్ చేసింది. హెడ్ ల్యాంప్ క్లస్టర్ మరియు బానెట్ కనబడే విధంగా తీసిన ఫోటోను టాటా ట్వీట్ చేసింది. పలుచగా, ఫ్యూచర్ డిజైన్ లక్షణాలను ఇమిడి ఉండే ఫుల్-ఎల్ఇడి యూనిట్ ఫోటోలో గమనించవచ్చు.

టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

టాటా సిద్దం చేసిన ఎక్స్451 ఓవరాల్ డిజైన్ టాటా లైనప్ ఇప్పటికీ వరకు విడుదల చేసిన మరే ఇతర మోడల్‌ను పోలి ఉండదు. మిగతా మోడళ్లకు ఇది చాలా భిన్నంగా ఉంటుంది.

టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

టాటా మోటార్స్ ఈ ఎక్స్451 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ యొక్క సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 వెర్షన్ ఆధారంగా డెవలప్ చేసింది. ఇందులో ఆకర్షణీయైన వీల్ ఆర్చెస్, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉన్న విండో లైన్స్, మరియు నెక్సాన్ ఎస్‌యూవీలో ఉన్న అదే ఫ్రంట్ గ్రిల్ మరియు స్పోర్టివ్ టెయిల్ ల్యాంప్స్ రానున్నాయి.

టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

టాటా వారి అడ్వాన్స్‌డ్ మోడ్యులర్ ప్లాటఫామ్(AMP) ఆధారంగా వస్తున్న తొలి మోడల్ కూడా ఇదే. సాంకేతికంగా ఇది, 108బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది.

  • 2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్
  • నెక్సాన్ కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టిన టాటా డీలర్లు
  • తప్పుడు మైలేజ్ ప్రకటన- హీరో కంపెనీని కోర్టుకు ఈడ్చి గెలిచిన కస్టమర్
  • టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

    అంతే కాకుండా, టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.05-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. టాటా ఈ సరికొత్త ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పో 2018లో ఆష్కరించనుంది.

    టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

    ఎక్స్451 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు హెచ్5 ప్రీమియమ్ ఎస్‌యూవీని అట్మోస్ పేరుతో ఆవిష్కరించనుంది. ఈ ఎస్‌యూవీని ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా 5- మరియు 7-సీటింగ్ కెపాసిటితో అభివృద్ది చేసింది.

    టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

    ప్రీమియమ్ ఎస్‌యూవీ మరియు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు లైట్ కమర్షియల్ వెహికల్‌ను కూడా ఆవిష్కరిస్తోంది. సరికొత్త డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఇండియన్ రోడ్లకు అనుగుణంగా అభివృద్ది చేసిన మీడియం మరియు హెవీ కమర్షియల్ వాహనాలను కూడా సిద్దం చేసింది.

    టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్451

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేసిన టియాగో, నెక్సాన్, టిగోర్ మరియు హెక్సా మోడళ్లతో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 2.0 ఆధారంగా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు ప్రీమియమ్ ఎస్‌యూవీలను సిద్దం చేసింది. వచ్చే ఆటో ఎక్స్‌పో 2018 వేదిక మీద ఈ కొత్త మోడళ్లను ఆవిష్కరించింది.

    మరిన్ని ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

    Trending DriveSpark Telugu YouTube Videos

    Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Tata X451 Premium Hatchback Teased; To Rival Maruti Baleno And Hyundai i20
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X