విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న హై స్పీడ్ టాటా నెక్సాన్: అందరూ సేఫ్!!

అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్న టాటా నెక్సాన్ ఎస్‍‌యూవీ అదుపు తప్పి రోడ్డు డివైడర్ మీదున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. నెక్సాన్ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ముగ్గరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షిత

By Anil Kumar

అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్న టాటా నెక్సాన్ ఎస్‍‌యూవీ అదుపు తప్పి రోడ్డు డివైడర్ మీదున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. నెక్సాన్ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ముగ్గరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

విద్యుత్ స్తంభాన్ని హై స్పీడ్ టాటా నెక్సాన్

ఫోటోలను గమనిస్తే, నెక్సాన్ ఎస్‌యూవీ మీద ఎరుపు రంగులో ఉన్న నెంబర్ ప్లేట్ చూడవచ్చు. అంటే, కొత్త వెహికల్ కాబట్టి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించి ఉండవచ్చు లేదా డీలర్‌షిప్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కావచ్చు. అయితే వెహికల్ ఎవరిది అనేది ఖచ్చితంగా తెలియరాలేదు.

విద్యుత్ స్తంభాన్ని హై స్పీడ్ టాటా నెక్సాన్

ఈ ప్రమాదం గోవాలో నాలుగు లైన్ల జాతీయ రహదారి మీద చోటు చేసుకుంది. ప్రమాద దృశ్యాల మేరకు, నాలుగు లైన్ల జాతీయ రహదారి మీద మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న నెక్సాన్ అదుపుతప్పు ఢివైడర్‌ను ఢీకొట్టి, అదే మార్గంలో ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొని పక్క లైన్లో ఆగిపోయింది.

విద్యుత్ స్తంభాన్ని హై స్పీడ్ టాటా నెక్సాన్

భూమిలో పాతిన విద్యుత్ స్తంభం పూర్తిగా బయటికొచ్చేసింది మరియు నెక్సాన్ ఎస్‌యూవీ కూడా తీవ్రంగా గాయపడింది. ముందు వైపున తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. ఎస్‌యూవీకి ఎడమవైపున ఉన్న అల్లాయ్ వీల్ యాక్సిల్ కూడా విరిగిపోయింది. భారీ వేగంతో ఢీకొన్నట్లు ఫోటోల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

విద్యుత్ స్తంభాన్ని హై స్పీడ్ టాటా నెక్సాన్

ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదం సిటీ పరిధిలో చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పెద్ద మలుపు ఉండటంతో ఎవరైనా రోడ్డు దాటుతుండగా తప్పించే క్రమంలో లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా జరిగి ఉండవచ్చు.

విద్యుత్ స్తంభాన్ని హై స్పీడ్ టాటా నెక్సాన్

నెక్సాన్ రోడ్డు ప్రమాదానికి గురికావడం ఇదేమీ మొదటిసారి కాదు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు సందర్భాల్లో నెక్సాన్ యాక్సిడెంట్లు జరిగాయి. అయితే, ఎందులో కూడా ప్రయాణికులు మరణించినట్లు మరియు తీవ్ర గాయాలపాలు అవ్వలేదు. చాలా వరకు చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నారు. ప్రమాదానికి గురైన నెక్సాన్ ఓనర్లు కూడా టాటా నిర్మాణ నాణ్యత అద్భుతమని కితాబు ఇచ్చారు.

విద్యుత్ స్తంభాన్ని హై స్పీడ్ టాటా నెక్సాన్

మనం ప్రయాణిస్తున్న కారు ఎంత సురక్షితమైనా... పరిమిత వేగంతోనే నడపాలి. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా ఆయా ప్రదేశాల్లో స్పీడ్ లిమిటర్లను ఏర్పాటు చేస్తారు. దానికంటే అధిక వేగంతో ప్రయాణిస్తే ఈ ప్రదేశాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రోడ్డు మీద ఎదురయ్యే స్పీడ్ లిమిట్ ఖచ్చితంగా పాటించాలి.

జాతీయ రహదారులను దాటుతున్నపుడు రోడ్డుకు ఇరువైపులా గమనించి వాహనాలు రాలేదని నిర్ధారించుకునే రోడ్డును దాటండి. ఒకవేళ కార్లు మరియు మితిమీరిన వేగంతో దూసుకెళ్లే వాహనాలు వెళుతున్నట్లయితే అవే వెళ్లేంత వరకు ఆగి తరువాత రోడ్డును దాటండి.

Source: Team-BHP

Most Read Articles

English summary
Read In Telugu: Speeding Tata Nexon Accident: Hits An Electric Pole — Passengers Escape
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X