నెక్సాన్ కస్టమర్లకు కుచ్చుటోపీ: టాటా సిఇఓ వరకు చేరిన వివాదం

ఓ కస్టమర్ టాటా నెక్సాన్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి వెళితే నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర, ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌తో పాటు అదనపు ఛార్జీలు వేసి కొటేషన్ వేశారు.

By Anil

Recommended Video

Tata Nexon Faces Its First Recorded Crash

కొత్త కారును కొంటున్నారా...? అయితే, డీలర్లు ఇచ్చే కొటేషన్‌లో అదనపు మరియు హ్యాండ్లింగ్ ఛార్జీలు ఉన్నాయోమే చూడండి. హ్యాండ్లింగ్ ఛార్జీలు ఎందుకుంటాయని ఆలోచిస్తున్నారా...? ఈ మధ్య కాలంలో డీలర్లు విక్రయించే కొత్త కార్ల మీద హ్యాండ్లింగ్ ఛార్జీలు వేస్తున్నారు.

టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

తాజాగా ఓ కస్టమర్ టాటా నెక్సాన్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి వెళితే నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర, ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌తో పాటు అదనపు ఛార్జీలు వేసి కొటేషన్ వేశారు. అదనపు ఛార్జీలు ఎందుకని అడిగితే లాజిస్టిక్స్ మరియు ఇతరత్రా ఖర్చుల అంటూ డీలర్ సమర్థించుకున్నాడు.

టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

హ్యాండ్లింగ్ ఛార్జీలు అనధికారం అని తెలుసుకున్న కస్టమర్ డీలర్‌కు వివరించగా... అదనపు ఛార్జీలు తప్పనిసరి, మీరే కాదు ప్రతి కస్టమర్ కూడా తప్పనిసరిగా చెల్లించాల్సిందే అని సమధానం ఇచ్చాడు.

టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

అయితే, ఇందుకు ధీటుగా అదనపు ఛార్జీలు వేస్తే తాను వెహికల్ కొనుగోలు చేయనని డీలర్‍‌కు చెప్పాడు. అంతటి ఆగని కస్టమర్ టాటా డీలర్లు చేస్తున్న మోసాన్ని మెయిల్ ద్వారా టాటా మోటార్స్ సిఇఒ గుంటర్ బట్స్‌చెక్ దృష్టికి తీసుకెళ్లారు.

టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

అదే రోజే కస్టమర్‌కు కంపెనీ నుండి సమాధానం వచ్చింది. టాటా నుండి వచ్చిన రిప్లేకి కస్టమర్ ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రోజు టాటా మోటార్స్ డీలర్ నుండి కస్టమర్‌కు పిలుపు వచ్చింది. ఆ తరువాత తమ అన్ని కార్ల మీద హ్యాండ్లింగ్ మరియు అదనపు ఛార్జీలను తొలగించినట్లు వివరించింది.

తలక్రిందులైన టాటా నెక్సాన్: ప్రయాణికులంతా సేఫ్!!

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం 2018లో విడుదలవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

ఆ తరువాత ప్రముఖ ఆటోమొబైల్ మీడియాతో మాట్లాడిన కస్టమర్, "నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని బుక్ చేసుకున్నాను, షోరూమ్ వ్యక్తులు ఇచ్చిన కొటేషన్‌లో అదనపు హ్యాండ్లింగ్ మరియు లాజిస్టిక్ ఛార్జీలు వేశారు. ఇది చట్టవిరుద్ధం, ఇలా వసూలు చేయడం అనధికారం అని చెప్పినప్పటికీ, తప్పనిసరిగా చెల్లించాల్సిందే అని తెలిపినట్లు చెప్పుకొచ్చాడు."

టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

"టాటా మోటార్స్ డీలర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని టాటా మోటార్స్ సిఇఒకు మెయిల్ చేయగా, చాలా వేగంగా అదే రోజు కంపెనీ నుండి లభించింది. తరువాత రోజు టాటా డీలర్ షోరూమ్‌కు పిలిపించి అదనపు హ్యాండ్లింగ్ మరియు లాజిస్టిక్ ఛార్జీలు తొలగించినట్లు తెలిపారని ఆయన వెల్లడించారు."

టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

నెక్సాన్ ఎస్‌యూవీ మీద ఎక్స్‌ట్రా ఛార్జీలు ఎత్తేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో పలు కార్ల కంపెనీలు మరియు డీలర్లు కొత్త కార్లను విక్రయించేటపుడు అక్రమంగా అదనపు ఛార్జీల భారం వేసివి. వీటిని ఎదురించి వినియోగదారుల కోర్టులను ఆశ్రయించిన కస్టమర్లకు అనుగుణంగా తీర్పునిచ్చింది.

టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

డీలర్లు విక్రయించే కార్ల మీద ఎక్స్-షోరూమ్ ధర, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ ఖర్చులను మాత్రమే వసూలు చేయాలి. ఇవి కాకుండా మరే ఇతర ఛార్జీలు వసూలు చేసినా... అవి అనధికారికంగా డీలర్లు వేస్తున్నభారం అని గుర్తించండి.

  • తప్పుడు మైలేజ్ ప్రకటన- హీరో కంపెనీని కోర్టుకు ఈడ్చి గెలిచిన కస్టమర్
  • టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

    టాటా నెక్సాన్ ఇండియన్ మార్కెట్లోని సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితాలో ఒక బెస్ట్ సెల్లింగ్ వెహికల్‌. టాటా మోటార్స్ కంపెనీ యొక్క ఎక్స్ఒ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ద్వారా అభివృద్ది చేసింది. టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లతో లభ్యమవుతోంది.

    టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

    టాటా నెక్సాన్‌లోని 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి.

    మీకు నచ్చిన నగరంలో టాటా నెక్సాన్‌తో పాటు టాటా మోటర్స్ విక్రయించే అన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ మరియు ఆన్ రోడ్ ధరల కోసం

    టాటా నెక్సాన్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    డీలర్లు కార్ల మీద రూ. 3,000 ల నుండి రూ. 5,000 వరకు వివిధ మోడళ్ల ఆధారంగా హ్యాండ్లింగ్ ఛార్జీలు వేస్తారు. కొనుగోలుదారులు డీలర్లకు డబ్బు చెల్లించే ముందు ఆయా కార్లకు సంభందించిన ధరలు మరియు ఇతర ఛార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అనుమానాస్పదంగా ఉన్న ఛార్జీల గురించి నిర్మొహమాటంగా డీలరును అడిగి తెలుసుకోండి.

    ఒక వేళ డీలర్లు అదనపు ఛార్జీలు వేస్తుంటే ఈ-మెయిల్, ఆన్‌లైన్ చాట్, సోషల్ మీడియా ద్వారా కార్ల కంపెనీలకు తెలపాలి. మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటే మాతో పంచుకోండి...

    Trending DriveSpark Telugu YouTube Videos

    Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: Rushlane

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon Handling Charges Dropped After A Mail To Tata Motors CEO
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X