ఐపిఎల్ ఎడిషన్ చెన్నై సూపర్ కింగ్స్ థీమ్‌లో టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ముంబై ఇండియన్స్ ఎడిషన్‌లో డీలర్ల వద్ద పట్టుబడినట్లు ఇది వరకటి కథనంలో ప్రకటించాము. తాజాగా, మరో ఐపిఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్‌లో పట్టుబడింది. అచ్చం మునుపటి వెర్షన్ తరహా

By Anil Kumar

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ముంబై ఇండియన్స్ ఎడిషన్‌లో డీలర్ల వద్ద పట్టుబడినట్లు ఇది వరకటి కథనంలో ప్రకటించాము. తాజాగా, మరో ఐపిఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్‌లో పట్టుబడింది. అచ్చం మునుపటి వెర్షన్ తరహాలోనే చెన్నై సూపర్ కింగ్స్ థీమ్ గల ఎక్స్‌జడ్ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ ఆధారంగా సిఎస్‌కె ఎడిషన్ నెక్సాన్‌ ఎస్‌యూవీని సిద్దం చేశారు.

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ టాటా నెక్సాన్

ఐపిఎల్ 2018 సీజన్‌కు అఫీషియల్ స్పాన్సర్‌ టాటా నెక్సాన్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు నెక్సాన్ ఎస్‌యూవీని బహుకరించనున్నారు. ఐపిఎల్ ఎడిషన్‌లో పట్టుబడి నెక్సాన్ గ్రే మరియు పసుపు రంగుల మేళవింపులో డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌లో ఉంది. ఎక్ట్సీరియర్‌లో సిఎస్‌కె డీకాల్స్ మరియు నెక్సాన్‌కు వెపున ఎస్‌ఆర్‌టి బ్యాడ్జింగ్ కూడా కలదు.

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ టాటా నెక్సాన్

చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ ఎడిషన్ టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో వీల్ ఆర్చెస్, సైడ్ స్కర్ట్స్, రూఫ్ టాప్ మొత్తం, వెనుక వైపున్న అద్దం మరియు రియర్ బంపర్ మీద అత్యంత ఆకర్షణీయమైన పసుపు రంగు మేళవింపులు ఉన్నాయి. అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, డోర్లు, ఫ్రంట్ బంపర్ మరియు అల్లాయ్ వీల్స్ వంటివి యెల్లో కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ మీద సిఎస్‌కె లోగోను గమనించవచ్చు.

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ టాటా నెక్సాన్

ముంబాయ్ ఇండియన్స్ వెర్షన్ నెక్సాన్‌తో పోల్చుకుంటే, సిఎస్‌కె వెర్షన్ టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో పలు డిజైన్ మార్పులు జరగటంతో కాస్త విభిన్నంగా ఉంది. ముందు వైపు ఉన్న బంపర్ కాస్త తేడాగా ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్స్ వంటివి వైట్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. సాధారణ మోడల్‌తో పోల్చితే దీని హెడ్‌ల్యాంప్స్ కాస్తంత పలుచగా ఉంటాయి.

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ టాటా నెక్సాన్

ఇతర ముఖ్యమైన మార్పుల్లో ఎస్‌యూవీకి వెనుక వైపున్న ఎస్ఆర్‌టి బ్యాడ్జ్ గురించి చెప్పుకోవాలి. ఎక్స్‌జడ్ ప్లస్ వేరియంట్ ఆధారంగా రూపొందించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ ఎడిషన్ ఎస్‌యూవీకి జరిగిన అప్‌డేట్స్ అన్నీ డీలర్ లెవల్ మోడిఫికేషన్స్ అని చెప్పవచ్చు. మరి ఇది టాటా వారి పనితనమా లేకపోతే డీలర్ల పనితనమా అనేది ఖచ్చితంగా చెప్పలేము.

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ టాటా నెక్సాన్

నెక్సాన్ ఎస్‌యూవీ విపణిలోకి విడుదలైనప్పటి నుండి టాటా మోటార్స్‌కు నిర్ధిష్టమైన ఫలితాలు సాధించిపెడుతోంది. సాంకేతికంగా నెక్సాన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అందులో, 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-పెట్రోల్ మరియు 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు.

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ టాటా నెక్సాన్

రెండు శక్తివంతమైన ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి. టాటా మోటార్స్ అతి త్వరలో నెక్సాన్ ఎస్‌యూవీని ఆటోమేటిక్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. ఈ 2018 ఎడిషన్ ఐపిఎల్ మే 2018 వరకు ఉంది, కాబట్టి ఈ సమయంలోపే ఏఎమ్‌టి వెర్షన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ టాటా నెక్సాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రతి ఏడాది జరిగే ఐపిఎల్ ఎడిషన్‌లో అఫీషియల్ కారు ఒకటి ఉంటుంది. ఈ ఎడిషన్‌లో టాటా లేటెస్ట్ మోడల్ నెక్సాన్ ఎస్‌యూవీ 2018 ఐపిఎల్ ఎడిషన్‌ అఫీషియల్ కారుగా నిలిచింది. క్రికెట్ మ్యాచుల్లో పాల్గొనే అభిమానులు మరియు ఐపిఎల్‌ను ఫాలో అయ్యే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యూవీని పలు ఐపిఎల్ జట్ల ఆధారంగా ఐపిఎల్ ఎడిషన్‌లో ఆవిష్కరిస్తోంది.

ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఎడిషన్ టాటా నెక్సాన్

ఇప్పటి వరకు ఇలాంటి ప్రమోషన్ మరే ఇతర కారుకు జరగలేదంటే నమ్మండి. ఏదేమైనప్పటికీ, ఈ ఐపిల్ ఎడిషన్ నెక్సాన్ ఎస్‌యూవీ మీకు నచ్చినట్లయితే, దీని గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి.

Source: Rushlane

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon IPL Edition With Chennai Super Kings Theme Spotted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X