భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న తమ అన్ని ప్యాసింజర్ కార్ల మీద ధరలు పెంచేసింది. ఈ మేరకు, ప్రతి కారు మీద 2.2 శాతం మేరకు ధరలు పెంపు చేపట్టినట్లు ఓ అధికారిక ప్రకటనను టాటా మోటార్స్ విడుదల చ

By Anil Kumar

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా రాణిస్తున్న టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న తమ అన్ని ప్యాసింజర్ కార్ల మీద ధరలు పెంచేసింది. ఈ మేరకు, ప్రతి కారు మీద 2.2 శాతం మేరకు ధరలు పెంపు చేపట్టినట్లు ఓ అధికారిక ప్రకటనను టాటా మోటార్స్ విడుదల చేసింది.

భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

టాటా మోటార్స్ 2018లో ఇలా ధరలు పెంచడం ఇది మూడవ సారి, ఇటీవల కాలంలో కొత్త మోడళ్లతో మంచి విజయాన్ని అందుకున్న టాటా మోటార్స్ ఇప్పుడు ఏ యే మోడళ్ల మీద ఎంత మేరకు ధరలు పెంచిందో చూద్దాం రండి...

భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంపు అనివార్యమైందని టాటా పేర్కొంది. తాజాగా జరిగిన ధరల పెంపుతో ఈ ఏడాదిలో ఇది మూడవ ధరల పెంపు. జనవరి నెలలో గరిష్టంగా రూ. 25,000 లు, ఏప్రిల్‌లో రూ. 60,000 మరియు ఇప్పుడు రూ. 35,000 లు వరకు ధరలు పెరిగాయి.

భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల లైనప్‌లోని అన్ని మోడళ్ల మీద ఆ యా వేరియంట్ల యొక్క ధరలో 2.2శాతం ధరల పెంపు ఉంటుంది. గరిష్టంగా రూ. 35,000 ల వరకు పెరగనున్నాయి. సవరించబడిన నూతన ధరలు ఆగష్టు 2018 నుండి అమల్లోకి వస్తాయని టాటా మోటార్స్ వెల్లడించింది.

భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ మాట్లాడుతూ, "ఈ మధ్య కాలంలో పెట్టుబడి భారం అధికమవ్వడంతో ప్యాసింజర్ కార్ల తయారీ మరింత భారమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్ప మేర ధరలు పెంపు అనివార్యం అయ్యింది. ఏదేమైనప్పటికీ, కొద్ది వరకు పెరిగిన ధరలు విక్రయాల మీద ఎలాంటి ప్రభావం చూపదని ఆశిస్తున్నాను. గడిచిన 28 నెలలో టాటా మోటార్స్ గణనీయంగా 52శాతం వృద్దిని నమోదు చేసుకుందని చెప్పుకొచ్చాడు."

భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న టాటా మోటార్స్‌ను నెక్సాన్, హెక్సా, టియాగో మరియు టిగోర్ కార్లు అద్భుతమైన సేల్స్‌తో గట్టెక్కించాయి. టాటా కార్ల విక్రయాలు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి.

భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

టాటా మోటార్స్ 2021 నాటికి మరో 12 కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు ఇటీవల వెల్లడించింది. అంతే కాకుండా, టాటా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మరియు రీసెర్చ్ అండ్ డెవలప్ సెంటర్ కోసం ఏడు వేల కోట్ల రుపాయలు పెట్టడానికి సముఖంగా ఉంది.

భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

ఈ పెట్టుబడి క్రింది టాటా మోటార్స్ తీసుకురానున్న మొట్టమొదటి మోడల్ టాటా హరీయర్. జూలై 2018 ప్రారంభంలో టాటా హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ యొక్క ప్రొడక్షన్ వెర్షన్‌కు హరీయర్ అనే అధికారికంగా ఖరారు చేసింది. 2019 ప్రారంభంలో దీనిని పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

భారీగా పెరిగిన టాటా ప్యాసింజర్ కార్ల ధరలు: ఈ ఏడాదిలో ఇది మూడవ సారి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ క్రింద ప్రవేశపెట్టిన పలు నూతన ఉత్పత్తులతో టాటా కార్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసింది. నూతన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, ధరకు తగ్గ విలువలు మరియు అత్యున్నత నిర్మాణ విలువలు వంటి అంశాల పరంగా నెక్సాన్, హెక్సా, టియాగో మరియు టిగోర్ మోడళ్లు మంచి విజయాన్ని అందుకున్నాయి. కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తుండటంతో టాటా మోటార్స్ ధైర్యంగా ధరల పెంపు చేపట్టింది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon, Tiago, Tigor, Hexa prices to increase by up to Rs 35,000 – 3rd price hike of 2018
Story first published: Tuesday, July 24, 2018, 13:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X