ఇది నిజం! టాటా టియాగో సేల్స్ దెబ్బకు చతికిలపడ్డ మారుతి సెలెరియో

గడిచిన జనవరి 2018 ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకికి టాటా నుండి ఎదురుదెబ్బ తగిలింది. మారుతి సెలెరియో అత్యధిక సంఖ్యలో టాటా టియాగో కార్లు అమ్ముడయ్యాయి.

By Anil

మారుతి సుజుకి సెలెరియో, స్విఫ్ట్ తరువాత మారుతి అత్యధికంగా విక్రయిస్తున్న మోడల్. గడిచిన జనవరి 2018 ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకికి టాటా నుండి ఎదురుదెబ్బ తగిలింది. మారుతి సెలెరియో అత్యధిక సంఖ్యలో టాటా టియాగో కార్లు అమ్ముడయ్యాయి.

టాటా టియాగో సేల్స్

సరిగ్గా రెండేళ్ల క్రితం టాటా దివాళా దీసే పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా ప్రవేశపెట్టిన మోడల్ టియాగో హ్యాచ్‌బ్యాక్. గత రెండేళ్ల నుండి క్రమానుగత వృద్దిలో ఫలితాలు సాధించిన టాటా టియాగో ఇప్పుడు ఏకంగా మారుతి సెలెరియోను సేల్స్ పరంగా వెనక్కి నెట్టేసింది.

Recommended Video

Maruti Future S Concept
టాటా టియాగో సేల్స్

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ద్వారా పరిచయం చేసిన టియాగో నెలనెలా మంచి వృద్దిని సాధిస్తూ ఇప్పుడు టాటా మోటార్స్ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. మారుతి సెలెరియో ఇటీవల ఫేస్‌లిఫ్ట్‌లో విడుదలైనప్పటికీ టాటా టియాగోను అధిగమించలేకపోయింది.

టాటా టియాగో సేల్స్

గత జనవరి 2018లో టాటా 8,287 టియాగో కార్లను విక్రయించగా, మారుతి 7,641 సెలెరియో కార్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే టాటా టియాగో 53 శాతం వృద్దిని సాధిస్తే, మారుతి సెలెరియో 30 శాతం వృద్దిని కోల్పోయింది.

టాటా టియాగో సేల్స్

ఎంతో కాలంగా బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుగా పేరు సంపాదించుకున్న మారుతి సుజుకి సెలెరియో కారును కాదని టాటా టియాగో కారును ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాలేంటో ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి... ఒక వేళ మీరు లేదా మీ శ్రేయోభిలాషులు సెలెరియో మరియు టియాగో కార్లను ఎంచుకునే ఆలోచనలో ఉంటే, వారికి మంచి సలహా ఇవ్వండి...

టాటా టియాగో సేల్స్

మారుతి సెలెరియోతో పోల్చుకుంటే టియాగో ధర చాలా తక్కువ. సెలెరియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.2 లక్షలు అయితే, టాటా టియాగో ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.26 లక్షలు. రెండింటి ధరల మధ్య సుమారుగా 1 లక్షల రుపాయలు వ్యత్యాసం ఉంది.

టాటా టియాగో సేల్స్

కొలతల పరంగా టాటా టియాగో మారుతి సెలెరియో కంటే పెద్దదిగా ఉంటుంది. అంతే కాకుండా ప్యాసింజర్లకు అత్యుత్తమ క్యాబిన్ స్పేస్ అందిస్తుంది. టియాగో చూడటానికి పెద్దగా మరియు సౌకర్యంగా ఉంది కాబట్టి, పెద్దవి కోరుకునే ఇండియన్స్ టియాగోకే ఓటు వేస్తున్నారు.

టాటా టియాగో సేల్స్

మరో ప్రధానమైన కారణం ఇంజన్. టాటా టియాగో పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్లో 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎమ్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా టియాగో సేల్స్

మారుతి సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో 1-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు కార్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతున్నాయి. అయితే, టియాగోలోని ఇంజన్ అత్యంత శక్తివంతమైనది.

టాటా టియాగో సేల్స్

పెట్రోల్ ఇంజన్‌కు ప్రత్యామ్నాయంగా సెలెరియో సిఎన్‌జి-పెట్రోల్ ఆప్షన్ మరియు టియాగో డీజల్ ఆప్షన్‌లో లభ్యమవుతున్నాయి. టియాగో లోని 1.05-లీటర్ మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ 70బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా టియాగో సేల్స్

ఇండియన్ మార్కెట్లో ఉన్న తొలి ఎంట్రీ లెవల్ డీజల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో కారే. టియాగో డీజల్ వెర్షన్‌లో స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. టయాగో భారీ సక్సెస్ అందుకోవడంలో డీజల్ ఇంజన్ వేరియంట్ పాత్ర కూడా కీలకంగా ఉంది.

టాటా టియాగో సేల్స్

సేఫ్టీ పరంగా మారుతి సెలెరియో మరియు టాటా టియాగో రెండు కార్లలోని టాప్ ఎండ్ వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా టియాగో సేల్స్

మారుతి సుజుకి ఈ మధ్య కాలంలో సెలెరియో ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అత్యంత ఆకర్షణీయంగా డిజైన్ చేసి లాంచ్ చేసింది. అయితే, ఫీచర్ల విషయానికి వస్తే సెలెరియో కంటే బెటర్ ఫీచర్లు టియాగోలో ఉన్నాయి.

టాటా టియాగో సేల్స్

8-స్పీకర్ల ఆడియో సిస్టమ్, టర్న్-బై-టర్న్ న్యావిగేషన్ సిస్టమ్, మరియు సిటి, ఎకానమి మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా సెలెరియో కంటే టాటా టియాగో అత్యాధునిక అని చెప్పవచ్చు.

టాటా టియాగో సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ధర, ఇంజన్, పనితీరు, ఫీచర్లు, కొలతలు మరియు ఇంటీరియర్ పరంగా మారుతి సెలెరియో కంటే టాటా టియాగో ధరకు తగ్గ విలువలను కలిగి ఉందని నిరూపించబడింది. దీంతో సెలెరియో కంటే టియాగో మంచి ఫలితాలు సాధిస్తోంది. టాటా టియాగో కారణంగా మారుతి సెలెరియోకు కష్టకాలం ఎదురైనట్లే అని చెప్పవచ్చు.

టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించిన కొత్త కార్ల గురించి తెలుసుకుందాం రండి...

Most Read Articles

English summary
Read In Telugu: Tata Tiago Beats Maruti Celerio hatchback
Story first published: Friday, February 16, 2018, 11:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X