అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

By Anil Kumar

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ టాటా మోటార్స్ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారు విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో మోస్ట్ పాపులర్ కార్లను వెనక్కి తొక్కేసిన టాటా టియాగో సేల్స్ పరంగా ఈసారి అత్యంత సరసమైన మరియు అతి చిన్న రెనో క్విడ్ కారును అధిగమించింది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

టాటా మోటార్స్ గడిచిన ఏప్రిల్ 2018లో 7,071 యూనిట్ల టియాగో కార్లను విక్రయించింది. దీంతో టియాగో స్థిరమైన ఫలితాలనిస్తున్న టాటా యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా తన స్థానాన్ని పధిలం చేసుకుంది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

ఇదే కాలంలో ఫ్రెంచ్ దిగ్గజం రెనో తమ బెస్ట్ సెల్లింగ్ కారు రెనో క్విడ్ 5,792 యూనిట్ల సేల్స్ సాధించింది. అత్యంత పోటీతత్వముతో కూడిన టాటా టియాగో ధరలు ఇప్పుడు చిన్న కార్ల సెగ్మెంట్లో ఉన్న ఎన్నో మోడళ్లకు పెద్ద గండంగా మారింది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

క్విడ్ మాత్రమే కాదు, హ్యుందాయ్ ఇయాన్ కూడా ఏప్రిల్ 2018లో 4,663 యూనిట్ల సేల్స్ సాధించింది. టాటా టియాగో కారుతో పోల్చుకుంటే క్విడ్ తరహాలో హ్యుందాయ్ ఇయాన్ కూడా అత్యంత సరసమైన కారు. తక్కువ పవర్ మరియు చిన్న బాడీ అనే అంశాలను ప్రక్కన పెడితే ఖచ్చితమైన టాటా టియాగో ధరలు దీని విజయానికి బాగా కలిసొచ్చింది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

టాటా టియాగో ధరల శ్రేణి ఆల్టో కె10 మరియు రెనో క్విడ్ మధ్యన అదే విధంగా, మారుతి సెలెరియో మరియు వ్యాగన్ఆర్ మోడళ్ల మధ్య ఉంది. దీంతో ఈ నాలుగు మోడళ్లతో పాటు వీటికి పోటీగా ఉన్న అన్ని చిన్న కార్ల మీద టాటా టియాగో ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో టాటా టియాగో విపరీతమైన సేల్స్ సాధిస్తోంది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

ధరల పరంగానే కాకుండా, ఇంజన్ పరంగా టాటా టియాగో అత్యంత శక్తివంతమైన 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 67బిహెచ్‍‌పి పవర్ - 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్‌మిషన్‌లో ఎంచుకునే అవకాశాన్ని కల్పిచింది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

ఈ సెగ్మెంట్లో మరే ఇతర కార్లలో రానటువంటి ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఇందులో పరిచయమయ్యాయి. ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ ధరతో లభించే మరియు డీజల్ ఇంజన్ గల ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో. ఇలా బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఆప్షన్‌లలో లభ్యమవుతుండటంతో బడ్జెట్ ఫ్యామిలీ కస్టమర్లకు బాగా దగ్గరవుతోంది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

టాటా మోటార్స్ ఇప్పుడు టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును మరిన్ని ఆసక్తికరమైన ఆప్షన్‌లలో పరిచయం చేయడానికి సిద్దమైంది. టియాగో కారును మరింత స్పోర్టివ్ మరియు పవర్‌ఫుల్‌గా రూపొందించి మార్కెట్‌ను మరింత సొంతం చేసుకోవాలని భావిస్తోంది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

అత్యంత శక్తివంతమైన టాటా టియాగో జెటిపి వెర్షన్ కారును ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్ పో లో ఆవిష్కరించింది. టియాగో జెటిపి వెర్షన్‌ను లాంచ్ చేయడానికి టాటా సర్వం సిద్దం చేసుకుంది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

టాటా టియాగో జెటిపి వెర్షన్ స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ కారులో 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి తోడు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని కల్పించేందుకు ధృడమైన సస్పెన్షన్ సిస్టమ్ అందిస్తోంది. టియాగో జెటిపి ధరల శ్రేణి రూ. 6.5 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అప్పుడు సెలెరియో ఇప్పుడు రెనో క్విడ్‌ను తొక్కేసిన టాటా టియాగో

1. టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన మరిచిపోలేని నిజాలు

2. రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

3. డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి ఎందుకో తెలుసా...?

4. ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు

5. భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

Most Read Articles

English summary
Read In Telugu: Tata Tiago Outsells the Renault Kwid
Story first published: Thursday, May 10, 2018, 13:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X