ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన టాప్-7 కారు మోడళ్లు

భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన ఫిబ్రవరి 9 నుండి 14 మధ్య గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఈ ఆటో ఎక్స్‌పోలో కొన్ని వందల సంఖ్యలో కొత్త కార్లు, బైకులు, ఎలక్ట్రిక్ కార్లు మరియు కాన్సెప్ట్ మోడళ్లను ఆ యా కంపెనీ

By Anil

Recommended Video

Auto Expo 2018: Mahindra Thar Wanderlust Specs, Features, Details - DriveSpark

భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన ఫిబ్రవరి 9 నుండి 14 మధ్య గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఈ 2018 ఆటో ఎక్స్‌పోలో కొన్ని వందల సంఖ్యలో కొత్త కార్లు, బైకులు, ఎలక్ట్రిక్ కార్లు మరియు కాన్సెప్ట్ మోడళ్లను ఆ యా కంపెనీలు ప్రదర్శించారు.

ఆటో ఎక్స్‌పో 2018లో ఎంతో మంది సందర్శకులను ఆకర్షించిన టాప్-7 కార్ల గురించి ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

7. టయోటా యారిస్

టయోటా మోటార్స్ ఆటో ఎక్స్‌ 2018 వేదికగా ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన పోటీ ఉన్న బి-సెగ్మెంట్లోకి సరికొత్త యారిస్ సెడాన్ కారును ఆవిష్కరించింది. ఇప్పటి ఎస్‌యూవీలనే ద్వారానే మార్కెట్లోకి పట్టు సాధించిన టయోటా యారిస్ సెడాన్ ఆవిష్కరణతో సందర్శకుల తాకిడి విపరీతంగా లభించింది. టయోటా యారిస్ విపణిలో ఉన్న హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

యారిస్ సెడాన్ ఇంటీరియర్‌లో ఫాక్స్ లెథర్ సీట్లు, పెడల్ షిఫర్లు, చిన్న పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏ/సి వెంట్స్, పవర్ డ్రైవర్ సీటు, 7-ఎయిర్‌బ్యాగులు, రూఫ్ మీద ఉన్న ఎయిర్ వెంట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

ఇండియన్ వెర్షన్ టయోటా యారిస్ కారును కేవలం 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 107బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

6. హోండా అమేజ్

హోండా కార్స్ ఇండియా విభాగం ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదికలో సరికొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న అమేజ్ సెడాన్‌తో పోల్చుకుంటే ఇది పూర్తి భిన్నంగా ఉంది. పాత మరియు కొత్త తరం అమేజ్ కార్లను ఒకే వేదికపై పోల్చితే భారీ మార్పులను గుర్తించవచ్చు. విభిన్న డిజైన్ శైలిలో వచ్చిన అమేజ్‌కు ఊహించని ఆదరణ లభించింది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

హోండా కార్స్ ఇండియా యొక్క పాపులర్ మిడ్ సైజ్ సెడాన్ కారు హోండా సిటి ఆధారంగా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును అభివృద్ది చేసింది. రెండవ తరానికి చెందిన హోండా అమేజ్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మారుతి సుజుకి డిజైర్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి కాంపాక్ట్ సెడాన్ కార్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

కొత్త తరం హోండా అమేజ్ సెడాన్‌లో సాంకేతికంగా అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-డీజల్ ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి. వీటిలో పెట్రోల్ వేరియంట్ 87బిహెచ్‌పి పవర్ మరియు 108ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ వేరియంట్ 98బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

5. మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్

సందర్శకుల నుండి ఎక్కువ ఆదరణ లభించిన వాటిలో మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్ కారు ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎస్టేట్ వెర్షన్ యొక్క రివైజ్డ్ వెర్షన్ ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్. దీనిని తొలుత 216లో ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించారు.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

వచ్చే ఏడాది మార్కెట్లో పూర్తి స్థాయిలో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్ ధర సుమారుగా రూ. 65 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది. విపణిలో ఉన్న వోల్వో వి90 క్రాస్ కంట్రీ సెడాన్‌కు గట్టి పోటీనివ్వనుంది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

సాంకేతికంగా మెర్సిడెస్ ఇ-క్లాస్ (ఇ 220డి) ఆల్ టెర్రైన్‌లో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 191బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

4. టాటా 45ఎక్స్

ఆటో ఎక్స్‌పో 2018లో టాటా మోటార్స్ మొత్తం తొమ్మిది విభిన్న మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. టాటా మోటార్స్ నుండి ఊహించని డిజైన్ అంశాలతో వచ్చిన 45ఎక్స్ కారును ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టింది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

టాటా వారి ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీకి కొనసాగింపుగా వచ్చిన 2.0 వెర్షన్ ఆధారంగా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ది చేసింది. ముందు మరియు వెనుక వైపున పదునైన డిజైన్ అంశాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

ఇప్పటి వరకు ఇంతటి అత్యాధునిక డిజైన్ కలిగిన ఇండియన్ కారు బహుశా ఇదే కాబోలు. ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

3. కియా ఎస్‌పి కాన్సెప్ట్

వచ్చే ఏడాది నుండి ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్న కియా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా పలుకొత్త మోడళ్లను ఆవిష్కరించింది. అందులో కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఒకటి. చూడటానికి చాలా కొత్తగా ఉన్న కియా ఎస్‌పి కాన్సెప్ట్‌కు సందర్శకుల తాకిడి అధికంగానే లభించింది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

కియా మోటార్స్ ఎస్‌పి కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలకు పోటీగా తీసుకొచ్చింది. దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీలో అందించే ఇంజన్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, ప్రతి ఇండియన్ కస్టమర్‌ను ఆకట్టుకునే ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌తో ప్రత్యేకించి ఇండియన్ రోడ్లకు అనుగుణంగా అభివృద్ది చేసింది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

2. టాటా హెచ్5ఎక్స్

టాటా మోటార్స్ ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త ఎస్‌యూవీని హెచ్5ఎక్స్ పేరుతో కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించింది. చూడటానికి ప్రీమియమ్ డిజైన్ శైలిలో విదేశీ దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే డిజైన్ లక్షణాలు ఇందులో ఉన్నాయి.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

టాటా మోటార్స్ భాగస్వామ్యపు దిగ్గజం ల్యాండ్ రోవర్ వారి ప్రసిద్ద ఎల్ఆర్4 ఛాసిస్ మీద ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 ఆధారంగా ఈ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని నిర్మించారు. చిన్న పరిమాణంలో పదునైన యాంగులర్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్ మరియు కండలు తిరిగిన శరీరాకృతిలో ఇందులో ప్రత్యేకాకర్షణగా నిలిచింది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

టాటా హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ల్యాండ్ రోవర్ ఇంటీరియర్ డిజైన్ అంశాల నుండి సేకరించిన ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. సౌకర్యవంతమైన పెద్ద సీట్లు, మూడు లేయర్లలో ఉన్న డ్యాష్ బోర్డ్ ఉన్నాయి. ఇది 5 మరియు 7 మంది కూర్చునే సీటింగ్ లౌఔట్లో వచ్చే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

1. మారుతి సుజుకి

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. నూతన డిజైన్ అంశాలతో సరికొత్త హార్టెక్ ఫ్లాట్‍‌ఫామ్ మీద అభివృద్ది చేసిన మారుతి స్విఫ్ట్‌కు సందర్శకుల నుండి ఊహించని ఆదరణ లభించింది.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

ఇప్పటి వరకు పరిచయం చేయని ఎన్నో అధునాతన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫీచర్లను, అదే విధంగా స్విఫ్ట్ అన్ని వేరియంట్లో అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా అందించింది. 2018 మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.29 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

ఆటో ఎక్స్ పోలో బెస్ట్ కార్లు

సాంకేతికంగా కొత్త తరం మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే పెట్రోల్ వెర్షన్ 22కిమీ/లీ మరియు డీజల్ వెర్షన్ 28.4కిమీ/లీ మైలేజ్ ఇస్తాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Top 7 cars that stole the show at auto expo 2018
Story first published: Tuesday, February 20, 2018, 18:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X