భవిష్యత్తును శాసించనున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు

ఆటో ఎక్స్‌పో 2018లో కొన్ని కార్ల కంపెనీలు తమ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించాయి. ఆటో ఎక్స్‌పో 2018లో ప్రజా సందర్శనకు వచ్చిన, అతి త్వరలో మార్కెట్లోకి రానున్న ఐదు ఎలక్ట్రిక్ కార్ల గురించి స్పెషల్

By Anil

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

భవిష్యత్ భారత రవాణా మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టూ వీలర్ల నుండి ఆటోలు, కార్లు, బస్సులు మరియు కమర్షియల్ ట్రక్కులు మరియు పెద్ద పెద్ద లారీలు సైతం విద్యుత్‍‌తో నడిచేలా కంపెనీలు అభివృద్ది చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో కొన్ని కార్ల కంపెనీలు తమ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించాయి.

ఆటో ఎక్స్‌పో 2018లో ప్రజా సందర్శనకు వచ్చిన, అతి త్వరలో మార్కెట్లోకి రానున్న ఐదు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

5. మారుతి ఇ-సర్వైవర్

సుజుకి ఇ-సర్వైర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని తొలుత 2017లో జరిగిన టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది. తరువాత ఢిల్లీలో జరిగిన భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదిక 2018 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి స్టాల్ వద్ద సుజుకి తమ ఇ-సర్వైర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

అన్ని రకాల రహదారులను చేధించే లక్ష్యంగా అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ అందించి ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద జపాన్ దిగ్గజం సుజుకి అభివృద్ది చేసింది. పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే సుజుకి ఇ-సర్వైర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని మారుతి భాగస్వామ్యంలో ప్రవేశపెట్టింది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

ఇ-సర్వైర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో నాలుగు చక్రాల వద్ద నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లు బ్యాటరీ నుండి అందే పవర్‌తో వ్యక్తిగతంగా చక్రాలు తిరగడానికి సహకరిస్తాయి. అంతే కాకుండా ఇందులో అటానమస్ డ్రైవింగ్ లక్షణాలను కూడా అందించింది. ప్రొడక్షన్ వెర్షన్ ఇ-సర్వైర్ గురించి మారుతి సుజుకి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందివ్వలేదు.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

4. టాటా టియాగో ఎలక్ట్రిక్

టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018లో టియాగో మరియు టిగోర్ కార్లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. టియాగో ఇవి మరియు టిగోర్ ఇవి మోడళ్లను ఇంగ్లాండులోని టాటా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంలో అభివృద్ది చేశారు.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

టాటా మోటార్స్ ఇది వరకే EESL కు ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసే ఆర్ఢర్ సొంతం చేసుకుంది. అందులో భాగంగానే 350 ఎలక్ట్రిక్ కార్లను EESL కు అప్పగించింది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఆవిష్కరించడం ఇదే ప్రథమం.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

టియాగో మరియు టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి రెగ్యులర్ పెట్రోల్ మరియు డీజల్ వెర్షన్ కార్లనే పోలి ఉంటాయి. అయితే, ఎక్ట్సీరియర్‌లో ఎలక్ట్రిక్ అని సూచించే బ్లూ కలర్ బాడీ డీకాల్స్ ఉంటాయి. సాంకేతికంగా రెండు కార్లలో కూడా ఎలెక్ట్రికా ఇవి సంస్థ నుండి సేకరించిన 40బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 3-ఫేస్ ఏసి ఇండక్షన్ మోటార్ అందివ్వడం జరిగింది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

3. హ్యుందాయ్ కోనా

హ్యుందాయ్ మోటార్స్ ఫిబ్రవరి 9 నుండి 14 మధ్య గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వెర్షన్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. అంతర్జాతీయ విపణిలో కోనా ఎస్‌యూవీ పెట్రోల్, డీజల్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగల్ ఛార్జింగ్‌తో 470కిమీల నుండి 500కిమీల వరకు ప్రయాణించే పరిధితో రెండు విభిన్న ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్‌లతో లభ్యం కానుంది. దీని గురించి మరిన్ని వివరాలను అతి త్వరలో ప్రారంభం కానున్న జెనీవా మోటార్ షోలో వెల్లడించనుంది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

ఇంటీరియర్‌లో రెగ్యులర్ వెర్షన్‍‌ తరహా ఫీచర్లను అందించింది. హెడ్స్ అప్ డిస్ల్పే మరియు ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్, అదే విధంగా ఎక్ట్సీరియర్‌లో హ్యుందాయ్ క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, అగ్రెసివ్ డే టైం రన్నింగ్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు పదునైన క్యారెక్టర్ లైన్స్ ఇంకా ఎన్నో ప్రత్యేకతలు కోనా ఎలక్ట్రిక్‌లో ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

2. మహీంద్రా ఎలక్ట్రిక్ కెయువి100

భారతదేశపు దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ యంగ్ అండ్ మైక్రో ఎస్‌యూవీ కెయువి100 ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి వస్తే ఇండియా యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలవనుంది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

ప్రస్తుతం, ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో మహీంద్రా మాత్రమే పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యలను పెంచుకునే క్రమంలోనే కెయువి100 ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొచ్చింది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

సాంకేతికంగా, ఇందులో పెట్రోల్ లేదా డీజల్ ఇంజన్ స్థానంలో 30కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కలదు. లిథియం-అయాన్ బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్ సరఫరా అవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో మహీంద్రా ఎలక్ట్రిక్ కెయువి100 గరిష్టంగా 140కిమీల వరకు ప్రయాణిస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

1. హ్యుందాయ్ ఇయానిక్

హ్యుందాయ్ మోటార్స్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతోనే ఆగిపోలేదు. ఇదే 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద విలాసవంతమైన ఇయానిక్ ఎలక్ట్రిక్ కారును కూడా ఆవిష్కరించింది. అంతర్జాతీయ విపణిలో ఇయానిక్ సెడాన్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ మరియు హైబ్రిడ్ వెర్షన్‌లో లభ్యమవుతోంది.

ఆటో ఎక్స్‌పోలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసి, ప్రవేశపెట్టిన ఇయానిక్ ఎలక్ట్రిక్ సెడాన్ గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 295ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ అందిస్తోంది. ఇది కేవలం 9.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 165కిలోమీటర్లుగా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Top 5 Electric Cars At Auto Expo 2018. Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X