జూన్‌ 2018లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-మే-జూన్) లో ప్యాసింజర్ కార్ల విభాగం ఏకంగా 19.9 శాతం వృద్దిని సాధించింది. కానీ ఇదే కాలంలో ఎగుమతులు 7.37 శాతం పడిపోయాయి. జూన్ 2018 నెలలో అత్యధికంగా అమ్మ

By Anil Kumar

భారతదేశ వాహన పరిశ్రమ గడిచిన జూన్ 2018లో భారీ వృద్దిని నమోదు చేసుకుంది. తాజాగా అందిన సేల్స్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఒక్క జూన్ 2018 నెలలోనే ఏకంగా 80,64,239 కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే వ్యక్తిగత మరియు వాణిజ్య వాహనాల విక్రయాలు సంయుక్తంగా 16.55 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-మే-జూన్) లో ప్యాసింజర్ కార్ల విభాగం ఏకంగా 19.9 శాతం వృద్దిని సాధించింది. కానీ ఇదే కాలంలో ఎగుమతులు 7.37 శాతం పడిపోయాయి. జూన్ 2018 నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 ప్యాసింజర్ కార్ల వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

10. హోండా అమేజ్

కొత్త తరం హోండా అమేజ్ మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే భారీ మార్పులతో వచ్చింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్-డీజల్ ఇంజన్ కాంబినేషన్‌లో లభించే ఏకైక కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్. అచ్చం హోండా సిటీ డిజైన్ తరహాలో అవే శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లలో రావడటంతో అత్యుత్తమ ఫలితాలు సాధించి టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది.

  • జూన్ 2018: 9,103
  • జూన్ 2017: 1,193
  • వృద్ది రేటు: 663%
  • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

    09. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 విపణిలో ఉన్న ఇయాన్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మధ్య స్థానాన్ని భర్తీ చేసింది. పొందికైన డిజైన్ మరియు ప్రతి భారతీయుడు కోరుకునే ఫీచర్లు గ్రాండ్ ఐ10 సొంతం. నిరాశపరచని పనితీరు మరియు నమ్మదగిన మైలేజ్‌తో ఇండియన్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    • జూన్ 2018 : 10,343
    • జూన్ 2017: 12,317
    • వృద్ది రేటు: -16%
    • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

      08. మారుతి వితారా బ్రిజా

      భారతదేశపు మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి సుజుకి వితారా బ్రిజా టాప్ 10 ప్యాసింజర్ కార్ల జాబితాలో 8 వ స్థానంలో నిలిచింది. కేవలం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. విశాలమైన క్యాబిన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, సౌకర్యవంతమైన 5-సీటింగ్ లేఔట్ మరియు ధరకు తగ్గ విలువలను కలిగి ఉండటంతో పోటీదారుల కంటే మంచి ఫలితాలు సాధిస్తోంది.

      • జూన్ 2018: 10,713
      • జూన్ 2017: 8,293
      • వృద్ది రేటు: 29%
      • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

        07. హ్యుందాయ్ క్రెటా

        భారతదేశపు ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా పలు ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో సెకండ్ జనరేషన్‌లో ఇటీవల మార్కెట్లోకి విడుదలయ్యింది. జూన్ 2018 విక్రయాలతో ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ స్థానాన్ని క్రెటా సొంతం చేసుకుంది. ఎంచుకోదగిన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లు పలు రకాలు ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది.

        • జూన్ 2018: 11,111
        • జూన్ 2017: 6,436
        • వృద్ది రేటు: 73%
        • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

          06. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

          కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యింది. నూతన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సరికొత్త 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లతో పరిచయం అయ్యింది. సరికొత్త ఫ్లూయిడిక్ డిజైన్ ఫిలాసఫీలో డిజైన్ చేసిన ఎలైట్ ఐ20 చూడటానికి చాలా అడ్వాన్స్‌గా ఉంది.

          • జూన్ 2018: 11,262
          • జూన్ 2017: 10,609
          • వృద్ది రేటు: 6%
          • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

            05. మారుతి వ్యాగన్ఆర్

            బాక్స్ ఆకారంలో ఉన్న మారుతి సుజుకి వారి టాల్ బాయ్ డిజైన్ మోడల్ వ్యాగన్ఆర్ సిటీ అవసరాలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కారణంగానే 1999లో విడుదలైన మారుతి వ్యాగన్ఆర్ ఇప్పటికీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అత్యుత్తమ సేల్స్ సాధిస్తోంది. మారుతి అతి త్వరలో వ్యాగనఆర్ ఆధారిత సోలియో ఎమ్‌పీవీ కారును విడుదల చేయాలని భావిస్తోంది.

            • జూన్ 2018: 11,311
            • జూన్ 2017: 10,668
            • వృద్ది రేటు: 6%
            • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

              04. మారుతి బాలెనో

              మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో విక్రయిస్తున్న బాలెనో ఈ జాబితాలో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. యూరోపియన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని డెవలప్ చేసిన బాలెనో కారులో విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీటింగ్ మరియు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్ కలిగించే కార్లలో మారుతి బాలెనో ఒకటి.

              • జూన్ 2018: 17,850
              • జూన్ 2017: 9,057
              • వృద్ది రేటు: 97%
              • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

                03. మారుతి ఆల్టో

                మారుతి 800 విజయానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఆల్టో దశాబ్దానికి పైగా ప్రతి నెలా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఇటీవల అంతర్గతంగా ఎదురైన పోటీ కారణంగా మూడవ స్థానానికి పడిపోయింది. మారుతి ఆల్టో 800 మరియు ఆల్టో కె10 అనే రెండు మోడళ్లలో లభ్యమవుతోంది.

                • జూన్ 2018: 18,070
                • జూన్ 2017: 14,856
                • వృద్ది రేటు: 22%
                • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

                  02. మారుతి స్విఫ్ట్

                  ఇండియా మొత్తం అత్యధికంగా ఇష్టపడుతున్న హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్. మారుతి సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో మూడవ తరానికి చెందిన సరికొత్త స్విఫ్ట్ కారును డిజైన్ పరంగా భారీ మార్పులు చేర్పులతో, నూతన ఫీచర్ల జోడింపుతో లాంచ్ చేసింది. కొత్త తరం స్విఫ్ట్ మారుతి సుజుకి ఇండియాకు విపరీతమైన సేల్స్ సాధించిపెడుతోంది.

                  • జూన్ 2018: 18,171
                  • జూన్ 2017: 9,902
                  • వృద్ది రేటు: 84%
                  • జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు

                    01. మారుతి డిజైర్

                    మారుతి సుజుకి చేసిన అద్భుతాలలో డిజైర్ ఒకటి. గత ఏడాది విడుదలైన డిజైర్ సెడాన్ కారు మీద ఇప్పటికీ ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. మోస్ట్ పాపులర్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును తొలుత 2008లో లాంచ్ చేసింది. మారుతి డిజైర్ అత్యాధునిక డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అన్నింటి కంటే బెస్ట్ మైలేజ్ ఇలా ఎన్నో అంశాలు మారుతి డిజైర్‌ను సేల్స్ పరంగా మొదటి స్థానంలో నిలిపాయి.

                    • జూన్ 2018: 24,465
                    • జూన్ 2017: 12,049
                    • వృద్ది రేటు: 103%

Most Read Articles

English summary
Read In Telugu: Top-Selling Cars In India June 2018: Maruti Cars Attain The Top Five Positions
Story first published: Thursday, July 12, 2018, 14:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X