క్రాసోవర్ ఎస్‌యూవీతో దూకుడు పెంచిన టయోటా

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా విభాగం తమ సరికొత్త సీ-హెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టయోటా సీ-హెచ్ఆర్ ఇండియాలో విడుదలకు ఇంకా రెండేళ్లు సమయం పడుతున్నట్ల

By Anil Kumar

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా విభాగం తమ సరికొత్త సీ-హెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టయోటా సీ-హెచ్ఆర్ ఇండియాలో విడుదలకు ఇంకా రెండేళ్లు సమయం పడుతున్నట్లు తెలిసింది. అయితే, టయోటా ఇప్పుటి నుండే సీ-హెచ్ఆర్ క్రాసోవర్ విడుదలకు కసరత్తులు ప్రారంభించింది.

క్రాసోవర్ ఎస్‌యూవీతో దూకుడు పెంచిన టయోటా

విపణిలో 15 లక్షల నుండి 25 లక్షల ధరల శ్రేణిలో ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న ఇతర ఎస్‌యూవీలకు పోటీగా అంతర్జాతీయ విపణిలో భారీ విజయాన్ని అందుకున్న సీ-హెచ్ఆర్ క్రాసోవర్ విడుదల చేయాలని టయోటా నిర్ణయించుకుంది.

క్రాసోవర్ ఎస్‌యూవీతో దూకుడు పెంచిన టయోటా

అందులో భాగంగానే టయోటా సీ-హెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని బెంగళూరు రోడ్ల మీద పరీక్షిస్తోంది. టయోటా వారి నూతన టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ (TNGA) మీద హైబ్రిడ్ ఇంజన్ వ్యవస్థతో నిర్మించింది.

క్రాసోవర్ ఎస్‌యూవీతో దూకుడు పెంచిన టయోటా

టయోటా ఇండియా లైనప్‌లో కరోలా ఆల్టిస్ తరువాత TNGA ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించబడిన రెండవ మోడల్ సీ-హెచ్ఆర్. ఖరీదైన ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఫార్చ్యూనర్ మరియు

ఇన్నోవా క్రిస్టా మోడళ్లు సాధించినట్లుగానే సీ-హెచ్ఆర్ కూడా మంచి ఫలితాలు సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది.

క్రాసోవర్ ఎస్‌యూవీతో దూకుడు పెంచిన టయోటా

టయోటా సీ-హెచ్ఆర్ క్రాసోవర్ తన విభిన్నమైన ఎక్ట్సీరియర్ డిజైన్‌తో ఇండియన్ కస్టమర్ల మతిపోగొట్టడం గ్యారంటీ. కండలు తిరిగిన రూపం, ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్ మరియు కూపే తరహా రూఫ్ లైన్ గల సీ-హెచ్ఆర్ దేశీయ ఎస్‌యూవీల మార్కెట్లో ఒక కొత్త డిజైన్‌ను పరిచయం చేయనుంది.

క్రాసోవర్ ఎస్‌యూవీతో దూకుడు పెంచిన టయోటా

అత్యంత విశాలమైన క్యాబిన్ స్పేస్ గల ఇటీరియర్ కారులోని ప్రయాణికులందరూ అత్యంత సౌకర్యంగా ప్రయాణించవచ్చు. సీ-హెచ్ఆర్ ఇంటీరియర్ సురక్షితమైన సీటింగ్ లేఔట్ మరియు విలాసవతంమైన ఫీల్ కలిగిస్తుంది. భద్రత, ఎంటర్‌టైన్‌మెంట్, సౌలభ్యమైన డ్రైవింగ్ పరంగా ఎన్నో అత్యాధునిక ఫీచర్లను పరిచయం చేస్తోంది.

క్రాసోవర్ ఎస్‌యూవీతో దూకుడు పెంచిన టయోటా

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, టయోటా మోటార్స్ సీ-హెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీలో పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ వ్యవస్థను అందించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 122బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

క్రాసోవర్ ఎస్‌యూవీతో దూకుడు పెంచిన టయోటా

టయోటా మోటార్స్ తమ హైబ్రిడ్ సీ-హెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని 2020 లేదా 2021 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. దీని విడి భాగాలను దిగుమతి చేసుకుని అసెంబుల్ చేస్తుందా లేదంటే పూర్తి స్థాయిలో ఇండియాలో ఉత్పత్తి చేస్తుందా అనేది ఇంకా తెలియరాలేదు.

Source: AutoCarIndia

Most Read Articles

English summary
Read In Telugu: Toyota C-HR spied testing in India
Story first published: Saturday, July 7, 2018, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X