టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు

టయోటా మోటార్స్ విపణిలోకి సరికొత్త ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ కారును లిమిటెడ్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ లివా ఎటియోస్ హ్యాచ్‌బ్యాక్‌లో పలు అధునాతన కాస్మొటిక్ అప్‌డేట్స్ హ్యాచ్‌బ్

By Anil Kumar

టయోటా మోటార్స్ విపణిలోకి సరికొత్త ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ కారును లిమిటెడ్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ లివా ఎటియోస్ కారులో జోడించిన పలు అధునాతన కాస్మొటిక్ అప్‌డేట్స్ హ్యాచ్‌బ్యాక్‌కు స్పోర్టివ్ రూపాన్ని తీసుకొచ్చాయి.

టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను ఇండియాలోని పలు మార్కెట్లలో మాత్రమే అదుబాటులోకి తీసుకొచ్చింది. టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ కేవలం విఎక్స్ వేరియంట్లో మాత్రమే విడుదలయ్యింది. విఎక్స్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6.50 లక్షలు మరియు విఎక్స్ డీజల్ వేరియంట్ ధర రూ. 7.65 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

టయోటా ఎటియోస్ లిమిటెడ్ ఎడిషన్ తెలుపు మరియు నలుపు రంగుల కాంబినేషన్‌లో ఉన్న సింగల్ డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ కలర్‌ ఆప్షన్‌లో లభ్యమవుతోంది. అంతే కాకుండా, పలు రకాల రెడ్ అండ్ బ్లాక్ కలర్ మేళవింపులు ఉన్నాయి. స్పోర్టివ్ రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ గ్రిల్, రెడ్ ఫ్రంట్ ఫాగ్ బెజెల్, రెడ్ డోర్ హ్యాండిల్స్ మరియు సైడ్ డిజైన్‌లో స్పోర్టివ్ డీకాల్స్ ఉన్నాయి.

టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

నలుపు మరియు ఎరుపు రంగుల సొబగులు ఇంటీరియర్‌లో కూడా ఉన్నాయి. రెడ్ కలర్ మేళవింపులు ఉన్న ప్రీమియం బ్లాక్ ఇంటీరియర్స్ అదే విధంగా గేర్‌నాబ్ మరియు ఏసి వెంట్లు రెడ్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి.

టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌లో 6.8-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌‌స్క్రీన్ ఆడియో సిస్టమ్ మరియు రివర్స్ కెమెరా ఉన్నాయి. అంతే కాకుండా, డ్యూయల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రిటెన్షనర్లు మరియు లోడ్ లిమిటర్లు గల ఫ్రంట్ సీట్లు అదే విధంగా ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ లాక్స్ వంటి ఫీచర్లు లిమిటెడ్ ఎడిషన్‌లో తప్పనిసరిగా వచ్చాయి.

టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజర్ ఎన్.రాజా మాట్లాడుతూ, "ఎటియోస్ లిమిటెడ్ ఎడిషన్‌ ఆధునిక కార్ ప్రేమికుల ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక స్టైల్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులో పొందుపరిచిన అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు మరియు దీని స్పోర్టివ్ తత్వము యువ కస్టమర్లను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు."

టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

డిజైన్ మరియు మెకానికల్‌గా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సాంకేతికంగా ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. ఇవి వరుసగా 80బిహెచ్‌పి-104ఎన్ఎమ్ మరియు 67బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

టయోటా ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా ఎటియోస్ కంపెనీకి ఆశించిన సేల్స్ సాధించడంలో విఫలమవుతోంది. అయితే, ఎటియోస్ లివా కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ కావడంతో దీనిని మార్కెట్ నుండి తొలగించకుండా లిమిటెడ్ ఎడిషన్‌లో విడుదల చేస్తూ వస్తోంది. ఎటియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్ ఈసారైనా కస్టమర్లను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Etios Liva Limited Edition Launched In India; Prices Start At Rs 6.50 Lakh
Story first published: Wednesday, August 8, 2018, 9:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X