ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మీద ధరల పెంపు

By Anil Kumar

టయోటా కిర్లోస్కర్ మోటార్ తమ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లు అయినటువంటి ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ మరియు ఫార్చ్యూనర్ మోడళ్లలో స్వల్ప మార్పులు నిర్వహించి అప్‌డేట్ చేసింది. అదనపు ఫీచర్లను జోడించి భద్రతను మరింత పెంచింది. అయితే, వీటి ధరలను కూడా కొద్ది మేరకు పెంచింది.

ఈ మూడు మోడళ్లలో చోటు చేసుకున్న మార్పులు మరియు పెరిగిన ధరల గురించి పూర్తి వివరాల కోసం...

ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మీద ధరల పెంపు

ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ మరియు ఫార్చ్యూనర్ ఈ మూడింటిలో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిగ్నల్స్, రియర్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు గ్లాస్ బ్రేక్ మరియు అల్ట్రాసోనిక్ సెన్సార్ గల యాంటీ-థెఫ్ట్ అలారమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మీద ధరల పెంపు

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ మోడళ్లలో అదనంగా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పవర్-ఫోల్డింగ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, పడిల్ ల్యాంప్స్ మరియు స్పీడ్ అండ్ ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్ లాక్/అన్‌లాక్ వంటివి వచ్చాయి.

ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మీద ధరల పెంపు

ఇదే తరహాలో, టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్యాసింజర్ సైట్ పవర్ సీటు, అల్ట్రాసోనిక్ సెన్సార్ గల యాంటీ-థెఫ్ట్ అలారమ్ ఎమర్జెన్సీ బ్రేక్ సిగ్నల్, రియర్ ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎలక్ట్రోక్ క్రోమిక్ ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటి అదనపు ఫీచర్లు పరిచయం అయ్యాయి.

ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మీద ధరల పెంపు

కొత్తగా జోడించిన అదనపు ఫీచర్లను మినహాయిస్తే, ఈ మూడు మోడళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కానీ, వీటి మీద ధరలు పెరిగాయి. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. వీటిలో ఒకటి, అదనపు ఫీచర్లు రావడం మరియు రెండవది, అన్ని ప్యాసింజర్ కార్లలో మూడు సంవత్సరాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి కావడం.

ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మీద ధరల పెంపు

ఇప్పుడు టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ధర రూ. 14.65 లక్షలు (ధరల పెంపుకు ముందు దీని ధర రూ. 14.35 లక్షలు) మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22.06 లక్షలుగా ఉంది. అదే విధంగా టూరింగ్ స్పోర్ట్ ప్రస్తుత ప్రారంభ ధర రూ. 18.59 లక్షలు (గతంలో రూ. 18.15 లక్షలు) టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 23.06 లక్షలు.

ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మీద ధరల పెంపు

టయోటా ఫార్చ్యూనర్ ధర రూ. 27.27 లక్షలు (ధరల పెంపుకు ముందు రూ. 26.69 లక్షలు) మరియు ఫార్చ్యూనర్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 32.97 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మీద ధరల పెంపు

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

టయోటా మోటార్స్ ఇండియాలో విక్రయిస్తున్న మూడు బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఎన్నో అదనపు సేఫ్టీ ఫీచర్లను జోడించింది. వీటిలో ఇన్నోవా క్రిస్టా సిరీస్ వాహనాలు మారుతి సుజుకి ఎర్టిగా మరియు మహీంద్రా అప్‌కమింగ్ ఎమ్‌పీవీ మరాజొ మోడళ్లకు పోటీనిస్తుంది. అదే విధంగా టయోటా ఫార్చ్యూనర్ ఫోర్డ్ ఎండీవర్‌కు సరాసరి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Innova Crysta & Fortuner Updated; Prices Increased
Story first published: Monday, September 3, 2018, 10:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X