వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

By Anil Kumar

టయోటా ఇన్నోవా వాహనం ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న యువకుడు 30 అడుగుల ఎత్తు గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంతటి ఆగని ఇన్నోవా క్రింద పడిన ఆ యువకుడిని తొక్కించేసింది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

ఈ ఘటన మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఇన్నోవా డ్రైవర్ మరియు రోడ్డును గమనించకుండా దాటడానికి ప్రయత్నించిన వ్యక్తి యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.

వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడానికి ముందే ఇన్నోవా డ్రైవర్ సడెన్ బ్రేకులు వేశాడు. అయితే, అప్పటికే దాని వేగం ఎక్కువగా ఉండటంతో తికమకగా పరుగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చిన వ్యక్తిని బలంగా ఢీకొట్టింది.

వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

ఇన్నోవా ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తి రోడ్డు మీద కొన్ని మీటర్లు మేర దొర్లుకుంటూ వెళ్లాడు. అంతటితో అయిపోలేదు, ఆ వెంటనే మరో హృదయవిదారకరమైన ప్రమాదం చోటు చేసుకుంది.

వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

క్రింద పడిన ఆ వ్యక్తి మీదకు ఇన్నోవా ఎడమవైపు చక్రాలు ఎక్కేశాయి. అయితే, ఈ ప్రమాదంలో ఘోరంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడో లేదో తెలియరాలేదు. అదే విధంగా, ఇన్నోవా డ్రైవర్ కూడా పోలీసులకు పడ్డుబడ్డాడో లేదో తెలియలేదు.

వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

కానీ, కేవలం పది సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తావు. ఊహించని విధంగా ప్రమాదానికి గురైన వ్యక్తి తప్పిదం ఈ యాక్సెడెంటులో గమనించవచ్చు.

వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

అతను అలా పెరుగెత్తుకుంటూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించడానికి గల కారణమేంటో తెలియరాలేదు. ఎంత ముఖ్యమైన పని అయినప్పటికీ, జాతీయ రహదారులు దాటేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇన్నోవా డ్రైవర్ కూడా అంత వేగంతో వాహనాన్ని నడిపి ఉండకూడదు.

వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

ఈ ప్రమాదం, ఓ మోస్తారు పట్టణాన్ని తలపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు మరియు ఇళ్లు ఉన్నాయి. రోడ్డు మీద వెళుతున్న వాహనాలు మరియు రోడ్డు నిర్మాణాన్ని బట్టి చూస్తే ప్రమాదం జరిగిన రోడ్డు జాతీయ రహదారి అని తెలుస్తోంది. జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ఇలాంటి రోడ్ల మీద వెళతున్నపుడు మరియు దాటుతున్నపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

జాతీయ రహదారులు మీద ప్రయాణిస్తున్నపుడు పల్లెలు మరియు జంక్షన్లు వచ్చినపుడు వెహికల్ వేగాన్ని దాదాపు తగ్గించేసి, రోడ్డును గమనిస్తూ డ్రైవ్ చేయాలి, ఈ ప్రమాదంలో ఇన్నో డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించేందుకు బ్రేకులను ఎంతో బలంగా ప్రయోగించాడు. వీడియోలో బ్రేకుల నుండి వచ్చిన శబ్దాన్ని గమనించవచ్చు.

వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

ఏదేమైనప్పటికీ, ఇన్నోవా వెహికల్ స్పీడ్ కంట్రోల్ కాలేకపోయింది. హైస్పీడులో ఉన్నపుడు ఒక వ్యక్తి రోడ్డు మీదకు రావడంతో బహుశా డ్రైవర్ కూడా షాక్‌కు గురయ్యి ఉండవచ్చు. ఈ క్రమంలో ఏం చేయాలో ఆలోచించేలోపే వాహనం ఆ వ్యక్తిని తొక్కించేసింది.

వీడియో - టయోటా ఇన్నోవా ఢీకొట్టడంతో 30 అడుగుల ఎత్తు ఎగిరిపడిన యువకుడు.

ప్రమాదానికి గల కారణం ఏమైనప్పటికీ, ఓ నిండు ప్రాణం రిస్కులో పడింది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా ఫర్వాలేదు మితిమీరిన వేగంతో అమాయకుల ప్రాణాలు తీయకండి. ఎంత విలువైన పని ఉన్నప్పటికీ, ప్రాణాలు అన్నింటికంటే విలువైనవి. కాబట్టి, రోడ్డు భద్రత మీద దృష్టిసారించి సురక్షితంగా గమ్యాన్ని చేరండి!!

టయోటా ఇన్నోవా యాక్సిడెంట్

1.4 లక్షల ధరలో లభించే ఐదు పెట్రోల్ కార్లు

2.కారు డ్రైవ్ చేస్తూ గొడవపడిన భార్య భర్తలు: స్పాట్‌లో నలుగురు మృతి

3.100సీసీ ఇంజన్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

4.ఇక్కడ 30 సెకండ్లలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిపోతారు

5.మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న బైకుల RC రద్దు చేస్తున్న అధికారులు

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Innova hits & runs over a pedestrian in a BRUTAL crash; Caught on cam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X