ఉమ్మడి ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్న మారుతి సుజుకి-టయోటా భాగస్వామ్యం

జపాన్ దిగ్గజాలు సుజుకి మరియు టయోటా మోటార్స్ ఇరు సంస్థల మధ్య ఉమ్మడి భాగస్వామ్యపు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ భాగస్వామ్యంలో కలిసి పనిచేయాల్సిన ప్రాజెక్టుల గురించి సుజుకి మరియు టయోటా చర్చించుకుంటు

By Anil Kumar

జపాన్ దిగ్గజాలు సుజుకి మరియు టయోటా ఇరు సంస్థల మధ్య ఉమ్మడి భాగస్వామ్యపు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ భాగస్వామ్యంలో కలిసి పనిచేయాల్సిన ప్రాజెక్టుల గురించి సుజుకి మరియు టయోటా చర్చించుకుంటున్నట్లు వెల్లడించాయి. సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్కెట్ అభివృద్దితో పాటు ప్యాసింజర్ కార్ల తయారీ పరంగా ఈ భాగస్వామ్యం దృష్టిసారిస్తోంది.

మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం

ఇరు సంస్థలు కూడా ఇండియన్ మార్కెట్లో తమ వాహనాలను పరస్పరం మార్చుకుని విక్రయించడానికి సంసిద్దమైనట్లు పేర్కొన్నాయి. ఉమ్మడి భాగస్వామ్యంతో పలు కొత్త మోడళ్లను అభివృద్ది చేయనున్నారు. అంతే కాకుండా, రెండు కంపెనీలు కూడా ఉత్పత్తిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం

ఇరు కంపెనీలు కూడా ఆటోమోటివ్ విడి పరికరాలు తయారు చేసే డెన్సో కార్పోరేషన్ గురించి చర్చించనున్నాయి. అంతే కాకుండా, సుజుకి సంస్థకు టయోటా అందించే సాంకేతిక సహాయం గురించి చర్చలు సాగనున్నాయి.

మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం

అదే సమయంలో ఇరు సంస్థల ఉపయోగించుకునేందుకు కాంపాక్ట్ అల్ట్రాలైట్-ఎఫీషియన్సీ పవర్‌ట్రైన్ సుజుకి నిర్మించడానికి ముందుకొచ్చింది. మరో ప్రక్కన సుజుకి అభివృద్ది చేసిన మోడళ్లను టయోటా ఉత్పత్తి చేయనుంది. ఈ కార్లను మారుతి సుజుకి మరియు టయోటా ఇరు కంపెనీలు ఇండియాలో ఉన్న డీలర్ల ద్వారా విక్రయించనున్నాయి.

మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం

అదే విధంగా సుజుకి అభివృద్ది చేసిన మోడళ్లు మరియు టయోటా కిర్లోస్కర్ మోటార్ తయారు చేస్తున్న ఉత్పత్తులను ఇండియా నుండి ఆఫ్రికా మార్కెట్‌కు సరఫరా చేసే అంశం గురించి కూడా ఇరు సంస్థల ప్రతినిధులు చర్చించినున్నారు. దీంతో సుజుకి-టయోటా భాగస్వామ్యం దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లకు ఎగుమతి పరంగా పరస్పరం సహకరించుకోనున్నాయి.

మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం

టయోటా మోటార్ కార్పోరేషన్ ప్రెసిడెంట్ అకియో టయోడా మాట్లాడుతూ, "ఇండియన్ ఆటోమోటివ్ సొసైటీలో మెంబర్‌గా ఉన్న టయోటా మరియు సుజుకి అద్భుతమైన భవిష్యత్తు మరియు స్వేచ్ఛాపూరితమైన కార్యకలాపాలు సాగించడానికి ఉమ్మడి భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్లు తెలిపాడు. మేకిన్ ఇన్ ఇండియాతో ఇరు కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్‌తో పాటు ఆఫ్రికా మరియు ఇతర విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. దీంతో సుజుకి-టయోటా భాగస్వామ్యంతో ఇండియాలో తయారైన కార్లు ప్రపంచ రోడ్ల తిరుగుతాయని చెప్పుకొచ్చాడు."

మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం

సుజుకి మోటార్ కార్పోరేషన్ ఒసాము సుజుకి మాట్లాడుతూ, "సుజుకి సంస్థకు ఎంతో అవసరమైన కాంపాక్ట్, అల్ట్రాలైట్-ఎఫీషియన్సీ పవర్‌ట్రైన్‌ను అభివృద్ది చేసే సహాయాన్ని ఈ భాగస్వామ్యం ద్వారా టయోటా నుండి పొందనున్నట్లు తెలిపాడు." అంతే కాకుండా, "ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో ఇరు సంస్థలు భవిష్యత్తులో మంచి విజయాన్ని అందుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశాడు."

మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం

రెండు పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఉమ్మడి భాగస్వామ్యం కుదుర్చుకుని పరస్పర సహాకరాన్ని అందించుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో మహీంద్రా-రెనో మధ్య కూడా ఇలాంటి ఒప్పందం జరిగింది. ప్రస్తుతం రెనో-నిస్సాన్-డాట్సన్ భాగస్వామ్యం ఉంది.

మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం

నిజానికి ఇలాంటి ఒప్పందం ద్వారా ఇరు కంపెనీల కార్లను పరస్పరం మార్చుకుని కొత్త పేర్లతో మార్కెట్లో విక్రయిస్తాయి. ఉదాహరణకు, రెనో డస్టర్ మరియు నిస్సాన్ టెర్రానో. ఈ రెండు మోడళ్లు ఒకే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. అయితే, రెండు కంపెనీలు కూడా వేరు వేరు పేర్లతో విక్రయిస్తున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota & Suzuki Start Discussion Of Vehicle Production And Other Joint Ventures
Story first published: Sunday, May 27, 2018, 14:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X