టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

టయోటా కిర్లోస్కర్ మోటార్ యారిస్ ఆధారిత హ్యాచ్‌బ్యాక్ కారును అంతర్జాతీయ విపణిలోకి విక్రయిస్తోంది. అయితే, రిపోర్ట్స్ మేరకు టయోటా మోటార్స్ దేశీయ విపణిలోకి యారిస్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసే అవకాశం ల

By Anil Kumar

జపాన్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లోకి Toyota yaris sedan చేసింది. టయోటా మిడ్ సైజ్ సెడాన్ యారిస్ ప్రారంభ ధర రూ. 8.75 లక్షలు. యారిస్ ఆధారిత హ్యాచ్‌బ్యాక్ కారును అంతర్జాతీయ విపణిలోకి విక్రయిస్తోంది. అయితే, రిపోర్ట్స్ మేరకు టయోటా మోటార్స్ దేశీయ విపణిలోకి యారిస్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసే అవకాశం లేనట్లు తెలిసింది.

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

టయోటా యారిస్ హ్యాచ్‌‌బ్యాక్ థాయిలాండ్ వంటి ఆసియన్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఆసియన్ వెర్షన్ యారిస్ హ్యాచ్‌బ్యాక్ ధరల శ్రేణి రూ. 10 లక్షల నుండి రూ. 13 లక్షల మధ్య ఉంది.

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

థాయిలాండ్ వెర్షన్ టయోటా యారిస్ హ్యాచ్‌‌బ్యాక్ సాంకేతికంగా 1.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. 87బిహెచ్‌పి పవర్ మరియు 108ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ ఇంజన్‌ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది.

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్ చూడటానికి అచ్చం యారిస్ సెడాన్‌నే పోలి ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో యారిస్ సెడాన్ తరహా బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బంపర్‌లో ఇముడింపజేసిన ఫాగ్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

యారిస్ హ్యాచ్‌బ్యాక్ సైడ్ డిజైన్‌లో ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్, బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న పిల్లర్స్ మరియు ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ కలదు. యారిస్ హ్యాచ్‌బ్యాక్ రియర్ డిజైన్‌ విషయానికి వస్తే, స్పోర్టివ్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఉన్నాయి. యారిస్ సెడాన్‌తో పోల్చుకుంటే యారిస్ హ్యాచ్‌బ్యాక్ అత్యంత స్పోర్టివ్‌గా ఉంటుంది.

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ విత్ కీ లెస్ ఎంట్రీ, బ్లూటూత్ కనెక్టివిటి గల ఆడియో సిస్టమ్ ఇంకా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. సిల్వర్ సొబగులు ఉన్న బ్లాక్ థీమ్ ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్ మరియు వాటర్‌ఫాల్ డిజైన్‌లో ఉన్న సెంట

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

భద్రత పరంగా టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్‌‌లో ఏడు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు రియర్ డీఫాగర్ సేఫ్టీ ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా లభిస్తున్నాయి.

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

సేఫ్టీ, లగ్జరీ మరియు కంఫర్ట్ పరంగా అందించిన ఎన్నో ఫీచర్ల కారణంగా టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఖరీదైన మోడల్‌గా నిలిచింది. ఇది కనుక ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తే, దీని ధర సుమారుగా రూ.10 లక్షల నుండి రూ. 12 లక్షల మధ్య ఉంటుంది. కానీ, ఇదే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న మారతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి మోడళ్లు దీనిలో సగం ధరకే లభిస్తున్నాయి. కానీ, యారిస్ హ్యాచ్‌బ్యాక్ టయోటా ఇండియాకు కలిసొచ్చే అవకాశమే లేదు.

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు రావడం లేదు: ఎందుకంటే...?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇండియన్ మార్కెట్లో అత్యంత ఆసక్తికరమైన మోడల్. ఎక్కువ ధర కారణంగా, కంపెనీ దీనిని దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టడం లేదు. ఓవరాల్ డిజైన్ మరియు ఫీచర్ల పరంగా యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఇటీవల విడుదలైన యారిస్ సెడాన్‌ను పోలి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు, యారిస్ హ్యాచ్‌బ్యాక్ భారత్‌కు రావడం లేదు. అయితే, దీనిని కోరుకునే కస్టమర్లు విదేశీ మార్కెట్ నుండి దిగుమతి చేసుకోవచ్చు.

Source: CarandBike

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Yaris Hatchback Is Not Coming To India — Here’s Why
Story first published: Saturday, May 19, 2018, 17:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X