యారిస్ మీద రెండు నెలల వెయిటింగ్ పీరియడ్

టయోటా యారిస్ మిడ్ సైజ్ సెడాన్ కారును లాంచ్ చేసింది. ఇది టయోటా ఇండియా యొక్క మొట్టమొదటి మిడ్ సైజ్ సెడాన్. టయోటా యారిస్ సెడాన్ మీద ఇప్పుడు సుమారుగా రెండు నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం.

By Anil Kumar

టయోటా మోటార్స్ ఏప్రిల్ 2018లో అన్ని మోడళ్ల మీద ధరల పెంపు చేపట్టిన అనంతరం అదే నెల చివరిలో మార్కెట్లో ఉన్న హోండా సిటీకి గట్టి పోటీనిచ్చేలా యారిస్ మిడ్ సైజ్ సెడాన్ కారును లాంచ్ చేసింది. ఇది టయోటా ఇండియా యొక్క మొట్టమొదటి మిడ్ సైజ్ సెడాన్. టయోటా యారిస్ సెడాన్ మీద ఇప్పుడు సుమారుగా రెండు నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

టయోటా ఇండియా యారిస్ మీద 7,200 యూనిట్లు బుకింగ్స్ నమోదు చేసుకున్న సమాచారం. వీటిలో అత్యధికంగా సౌత్ ఇండియా నుండి రావడం విశేషం. దేశవ్యాప్తంగా వస్తోన్న డిమాండును దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలోని బిడది ప్రొడక్షన్ ప్లాంటులో యారిస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 40,000 యూనిట్లకు పెంచినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

మే 2018 నెల గణాంకాలను పరిశీలిస్తే, టయోటా యారిస్ 2,843 యూనిట్ల సేల్స్ జరపగా, ఇదే నెలలో దీని ప్రధాన పోటీదారు అయిన హోండా సిటీ 2,763 యూనిట్ల విక్రయాలు జరిపింది.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

ఏదేమైనప్పటికీ, మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మారుతి సియాజ్ 4,024 యూనిట్లతో ఆధిక్యంలో ఉండగా, హ్యుందాయ్ వెర్నా 3,801 యూనిట్ల విక్రయాలు జరిపి రెండవ స్థానంలో నిలిచింది. ఈ రెండింటిలో డీజల్ వేరియంట్లు ఉండటం వలన ఈ తరహా ఫలితాలు సాధ్యమయ్యాయి.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

టయోటా యారిస్ సెడాన్ కారును డీజల్ వెర్షన్‌లో ప్రవేశపెట్టే ఆలోచోనలో లేదు. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో 80 శాతం వరకు సేల్స్ పెట్రోల్ వేరియంట్ల నుండే లభిస్తున్నాయి. కాబట్టి, డీజల్ వేరియంట్ మీద దృష్టి సారించడం లేదు.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

టయోటా యారిస్ సెడాన్‌లో భద్రత పరంగా 7 ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు యారిస్ అన్ని వేరియంట్లలో తప్పిసరిగా లభ్యమవుతున్నాయి.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

అంతే కాకుండా, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ డ్రైవర్ సీటు, టైర్ ప్రెజర్ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, ఇన్ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్‌ కోసం గెస్చర్ కంట్రోల్, రూఫ్ మౌంటెడ్ రియర్ ఏసి వెంట్స్ ఇలా మరెన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఇందులో వచ్చాయి.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

టయోటా యారిస్‌లో సాంకేతికంగా 1.5-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 108బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

మ్యాన్యువల్ మరియు సీవీటి రెండు కూడా నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. అవి, జె, జి, వి మరియు విఎక్స్. టయోటా యారిస్ ధరల శ్రేణి రూ. 8.75 లక్షల నుండి రూ. 14.07 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

టయోటా యారిస్ వెయిటింగ్ పీరియడ్

మే నెల చివరి నాటికి 4,000 యూనిట్ల యారిస్ కార్లను డెలివరీ ఇచ్చింది. కంపెనీ రెండంకెల వృద్దిని నమోదు చేయడంలో యారిస్ సెడాన్ సేల్స్ సహాయపడింది. టయోటా ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్.

Most Read Articles

English summary
Read In Telugu: Two month waiting period for Toyota Yaris
Story first published: Tuesday, June 26, 2018, 9:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X