ఆటో ఎక్స్‌పో 2018: యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు విడుదల- ధర రూ. 7.14 లక్షలు

యునిటి ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త యునిటి వన్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.

By Anil

Recommended Video

New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

ఆటో ఎక్స్‌పో 2018: యునిటి ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త యునిటి వన్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా విడుదలైన యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 7.14 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్లు యునిటి ప్రతినిధులు పేర్కొన్నారు.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

స్వీడన్‍‌కు చెందిన ఓ అతి చిన్న బృందం యునిటి బ్రాండ్ పేరుతో వన్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించారు. యునిటి సంస్థ 2020 నాటికి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమైంది.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

తాజాగా మార్కెట్లోకి విడుదలైన యునిటి వన్ ఎలక్ట్రిక్ కారును రూ. 1,000 లతో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న అనంతరం కారు వద్దని మనసు మార్చుకుంటే మీ డబ్బును 100 శాతం తిరిగి చెల్లించేస్తారు.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. పలుచటి హెడ్ ల్యాంప్స్, ఏరోడైనమిక్ డిజైన్, పూర్తిగా కప్పేయబడిన చక్రాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచే డిజైన్ అంశాలు. ఇది విపణిలో ఉన్న మహీంద్రా ఇ2ఒ ఎలక్ట్రిక్ కారుకు సరాసరి పోటీనిస్తుంది.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించిన కారు 2-సీటర్ మాత్రమే. అయితే, 5-సీటర్ వెర్షన్ కారును ఆటో ఎక్స్‌పో ఈ వెంట్లో ప్రత్యేక డిస్ల్పేలో ప్రదర్శించారు. 2-సీటర్ కారు డెలివరీలను 2019 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా 5-సీటర్ వెర్షన్ యునిటి వన్ కారును 2020 నుండి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

యునిటి ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఢిల్లీకి చెందిన బర్డ్ గ్రూప్‌తో పరస్పర భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. యునిటి వన్ ఎలక్ట్రిక్ కార్లను దేశీయంగా అసెంబుల్ దేశవ్యాప్తంగా విక్రయించడానికి బర్డ్ గ్రూప్ సహకరించనుంది.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

యునిటి ఆవిష్కరించిన వన్ ఎలక్ట్రిక్ కారులో 22కిలోవాట్ సామర్థ్యం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ కలదు. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఇది గరిష్టంగా 200కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

ప్రస్తుతానికి, కారు పనితీరు గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, ఆధునిక కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన ఫీచర్లను యునిటి కంపెనీ ఇందులో అందించే అవకాశం ఉంది.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

యునిటి ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించుకుంటే కేవలం 20 నిమిషాల్లో 90 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఫుల్ చార్జ్ అవ్వడానికి 40 నిమిషాలు పడుతుంది. సాధారణ ఛార్జర్‌తో అయితే, సుమారుగా మూడు గంటల్లో యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన కారులో స్టీరింగ్ వీల్ లేదు, దీని స్థానంలో జాయ్ స్టిక్ అందించారు. స్టీరింగ్‌లా తిప్పడానికి మరియు కారు వేగాన్ని పెంచడానికి మరియు తగ్గించడానికి కూడా ఈ జాయ్ స్టిక్‌నే వాడాల్సి ఉంటుంది.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

అయితే, ఇండియన్ మార్కెట్లో విక్రయించే మోడల్‌లో జాయ్ స్టిక్ రావడం లేదు. జాయ్ స్టిక్ స్థానంలో రెగ్యులర్ స్టీరింగ్ వీల్ అందిస్తున్నారు. అంతే కాకుండా తమ కార్లలో లెవల్ 4 అటానమస్ ఫీచర్లు ఉంటాయని యునిటి ప్రతినిధులు వెల్లడించారు.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారులో 7-అంగుళాల పరిమాణం గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది జాయ్ స్టిక్స్‌కు మధ్యలో ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ విధులు, సోషల్ మీడియా అప్‌డేట్స్ వంటి ఎన్నో పనులు ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చేస్తుంది. అదనంగా పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్స్-అప్ డిస్ల్పే ఉంది.

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

యునిటి సంస్థ సిఇఒ లెవిస్ హార్న్ మాట్లాడుతూ, "కాలుష్య రహిత వాహనాలకు భారత్‌లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా, ఎలక్ట్రిక్ కార్లను కోరుకునే కస్టమర్ల అభిరుచులకు చాలా దగ్గరగా తమ ఉత్పత్తులు ఉంటాయని తెలిపాడు. భారత్‌లో వాహన రంగంలో తయారీ పరంగా అనుభవం ఉన్న బర్డ్ గ్రూప్ సంస్థను మా ఉత్పత్తుల తయారీ మరియు డిస్ట్రిబ్యూషన్ అవసరాలకు భాగస్వామిగా చేసుకున్నట్లు ప్రకటించాడు."

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యునిటి వన్ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా ఇ2ఒ కారుకు ధర మరియు డిజైన్ పరంగా గట్టి పోటీనిస్తోంది. మహీంద్రా ఇ2ఒ ధర యునిటి వన్ కంటే కాస్త తక్కువగానే ఉంది. అయితే, ఛార్జింగ్ మరియు రేంజ్ పరంగా యునిటి వన్ బెస్ట్. కానీ ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో మహీంద్రా ఇ2ఒ మంచి అనుభవం గడించింది. ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ మరియు సర్వీసింగ్ పరంగా లోటుపాట్లు మహీంద్రాకు బాగా తెలుసు. యునిటి సంస్థ తమ విక్రయకేంద్రాలను ఇంకా విస్తరించుకోవాలి. చెప్పాలంటే రెండు సంస్థలు ప్రారంభ దశలలోనే ఉన్నాయి. మరి వేటిలో ఏది బాగా రాణిస్తుందో వేచి చూడాలి మరి.

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Uniti One Electric Vehicle Launched At Rs 7.14 Lakh; Booking Amount, Specs & More
Story first published: Monday, February 12, 2018, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X