మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్‌యూవీ సెగ్మెంట్ పాపులర్ అవుతోంది. యువ కొనుగోలుదారులే ఎస్‌యూవీలను అధికంగా ఎంచుకుంటున్నారు. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్లకంటే ఎస్‌యూవీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే.

By Anil Kumar

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్‌యూవీ సెగ్మెంట్ పాపులర్ అవుతోంది. యువ కొనుగోలుదారులే ఎస్‌యూవీలను అధికంగా ఎంచుకుంటున్నారు. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్లకంటే ఎస్‌యూవీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

ఈ నేపథ్యంలో ఎస్‌యూవీల మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు విభిన్నమైన అధునాతన 5-సీటర్ ఎస్‌యూవీలను విడుదలకు చేశాయి. ఈ ఎస్‌యూవీల అంచనా ధరలు, విడుదల మరియు పూర్తి వివరాలను ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

9. మారుతి సుజుకి వితారా

మారుతి సుజుకి రెండేళ్ల క్రితం దేశీయ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అనతి కాలంలోనే బ్రిజా ఎస్‌యూవీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఈ తరుణంలో మారుతి సుజుకి ఇప్పుడు వితారా బ్రిజాకు పై స్థానంలో వితారా ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి సిద్దమైంది.

మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి సరాసరిపోటీనిచ్చే మారుతి వితారా ఎస్‌యూవీని ఇండో-జపనీస్ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ రోడ్ల మీద పలుమార్లు అత్యంత రహస్యంగా పరీక్షించింది. నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవు మరియు ఎత్తైన శరీర బాడీతో కండలు తిరిగిన రూపంలో రూపొందిస్తోంది.

మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

అత్యుత్తమ ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ అనుభూతి పొందాలనుకునే కస్టమర్ల కోసం అత్యంత శక్తివంతమైన ఫియట్ నుండి సేకరించిన 1.6-లీటర్ డీజల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్‌లలో పరిచయం చేస్తోంది. క్రెటాలో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి ఆల్‌గ్రిప్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వితారా రానుంది.

  • ధర అంచనా: రూ. 11 నుండి 15 లక్షల మధ్య
  • విడుదల అంచనా: 2019 ప్రారంభం నాటికి
  • మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

    8. హ్యందాయ్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

    హ్యుందాయ్ ఇండియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ క్రెటా. అయితే, సబ్-4 నాలుగు మీటర్ల విభాగంలో ఒక్క ఎస్‌యూవీ కూడా లేదు. మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలను ఎదుర్కునేందుకు సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది.

    మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

    ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కార్లినో పేరుతో కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించింది. విభిన్న డిజైన్ శైలిలో, బాక్సీ ఆకారంలో ప్రస్తుతం ఉన్న ఇతర హ్యుందాయ్ మోడళ్లతో పోల్చితే చాలా కొత్తగా ఉంటుంది. హ్యుందాయ్ గత ఏడాది అంతర్జాతీయ విపణిలో ఆవిష్కరించిన కోనా ఎస్‌యూవీని పోలి ఉంటుంది.

    మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

    రిపోర్ట్స్ నుండి అందిన సమాచారం మేరకు, హ్యుందాయ్ కార్లినో ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.0-లీటర్ మూడు సిలిండర్ల టుర్బో-ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది.

    • ధర అంచనా: రూ. 5.5-9.9 లక్షల మధ్య
    • విడుదల అంచనా: 2019లో
    • మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

      7. హోండా హెచ్ఆర్-వి

      హోండా మోటార్స్ బ్రియో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన బిఆర్-వి ఎస్‌యూవీని క్రెటాకు పోటీగా తీసుకొచ్చింది. అయితే, హోండా బిఆర్-వి మోడల్‌కు ఆశించిన ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో ఉన్న హెచ్ఆర్-వి ఎస్‌యూవీని బిఆర్-వి స్థానంలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

      మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

      ఇటీవల హెచ్ఆర్-వి ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది. అచ్చం ఇదే మోడల్‌ను ఇండియన్ మార్కెట్ కోస ఖరారు చేయనుంది. క్రాసోవర్ మరియు ఎస్‌యూవీ డిజైన్ లక్షణాలతో రూపొందించబడిన హోండా హెచ్ఆర్-వి ఇంటీరియర్‌లో కూడా ఎన్నో అధునాతన ఫస్ట్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.

      మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

      ఇండియన్ వెర్షన్ హోండా హెచ్ఆర్-విలో సాంకేతికంగా 158బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.6-లీటర్ టర్బోచార్జ్‌డ్ డీజల్ ఇంజన్ మరియు 1.8-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిర్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.

      • ధర అంచనా: రూ. 9-14 లక్షల మధ్య
      • విడుదల అంచనా: 2019 చివరి నాటికి
      • మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

        6. నిస్సాన్ కిక్స్

        నిస్సాన్ అధికారికంగా కొత్త తరం కిక్స్ ఎస్‌యూవీని 2016లో పరిచయం చేసింది. నిస్సాన్ కొత్త మోడల్‌ను ఇప్పుడు ఇండియా మరియు బ్రెజిల్ వంటి అతి ముఖ్యమైన మార్కెట్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రెనో డస్టర్/ నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీల ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిస్తోంది.

        మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

        హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ వంటి మోడళ్లకు పోటీనిచ్చేందుకు నిస్సాన్ కిక్స్ ఎస్‍‌యూవీని సిద్దం చేస్తోంది. ఫ్రంట్ డిజైన్‌లో అత్యంత ఆకర్షణీయంగా వి-ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, కండలు తిరిగిన రూపం మరెన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో వస్తోంది. ఇంటీరియర్‌లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు సేఫ్టీ పరమైన ఫీచర్లు వస్తున్నాయి.

        మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

        ఇండియన్ వెర్షన్ నిస్సాన్ కిక్స్ సాంకేతికంగా 110బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ డీజల్ మరియు 106బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేయగల 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో లభించనుంది. రెండు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి.

        • ధర అంచనా: రూ. 9-14 లక్షల మధ్య
        • విడుదల అంచనా: 2019 నాటికి
        • మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

          5. ఫోర్డ్ కుగా

          దేశీయంగా ఎస్‌యూవీల డిమాండ్ ఎక్కువ అవుతున్న తరుణంలో అమెరికాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా లైనప్‍‌లో ఉన్న ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు ఎండీవర్ ప్రీమియం ఎస్‌యూవీల మధ్య స్థానాన్ని భర్తీ చేయడానికి ఫోర్డ్ కుగా ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది.

          మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

          ఫోర్డ్ కుగా ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లో తొలుత 2008లో పరిచయం చేసింది. ఇప్పుడు తాజాగా కొత్త తరం కుగా ఎస్‌యూవీలో పలు మార్పులు చేర్పులు నిర్వహించి అప్‌డేటెడ్ వెర్షన్‌లో తీర్చిదిద్ది, ఇండియాతో పలు అంతర్జాతీయ విపణిలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

          మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

          ఫోర్డ్ కుగా ఇంటర్నేషనల్ మోడల్ 1.5-లీటర్ పెట్రోల్, 2.0-లీటర్ డీజల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. పలు ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ ఆప్షన్‌లలో వచ్చే 2019లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది.

          • ధర అంచనా: రూ. 11-15 లక్షల మధ్య
          • విడుదల అంచనా: 2019 మధ్య భాగానికి
          • మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

            4. డాట్సన్ గో-క్రాస్

            అత్యంత సరసమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ గో-క్రాస్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దంగా ఉంచింది. జపాన్‌లో జరిగిన 2015 టోక్యో మోటార్ షోలో ఆవిష్కరించిన అనంతరం 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది.

            మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

            ప్రస్తుతం డాట్సన్ ఫ్యామిలీలో ఉన్న ఇతర మోడళ్లను ఆధారంగా చేసుకుని, తమ పాపులర్ వి-ఫ్లాట్‌ఫామ్ మీద గో-క్రాస్ 5-సీటర్ ఎస్‍‌యూవీని నిర్మించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోని మోడళ్లకు గట్టి పోటీచ్చేలా సరసమైన ధరల శ్రేణిలో పలు ఎక్ట్సీరియర్, ఇంటీరియర్, ఎంటర్‌టైన్‌మెంట్, సేఫ్టీ ఫీచర్లను జోడించి లాంచ్ చేయనుంది.

            మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

            ఇండియన్ వెర్షన్ డాట్సన్ గో-క్రాస్ ఎస్‌యూవీలో గో హ్యాచ్‌బ్యాక్ నుండి సేకరించిన 69బిహెచ్‌పి-104ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో పరిచయం చేయనుంది.

            • ధర అంచనా: రూ. 7-10 లక్షల మధ్య
            • విడుదల అంచనా: 2019 ప్రారభం నాటికి
            • మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

              3. స్కోడా కరోక్

              స్కోడా ఇండియా లైనప్‌లో ఆశించిన సేల్స్ సాధించనందుకు గత ఏడాది మార్కెట్ నుండి వైదొలగిన యెటి ఎస్‌యూవీ స్థానాన్ని స్కోడా కరోక్ భర్తీ చేయనుంది. పూర్తి స్థాయిలో ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన కరోక్ ఎస్‌యూవీని ఔరంగాబాద్ ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబ్లీ చేయనుంది. దీంతో స్కోడా కరోక్ ధరలను అత్యంత పోటీతత్వంతో నిర్ణయించవచ్చు.

              మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

              స్కోడా కరోక్ కొలతల పరంగా చిన్న ఎస్‌యూవీనే అయినప్పటికీ, దీని డిజైన్ పరంగా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అత్యాధునిక ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాలతో వస్తోన్న స్కోడా కరోక్ ఇంటీరియర్‌లో 9.2-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు గెస్ట్చర్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు రానున్నాయి.

              మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

              ఇండియన్ వెర్షన్ స్కోడా కరోక్ 5-సీటర్ ఎస్‌యూవీలో 340ఎన్ఎమ్ టార్క్ మరియు 150బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ డీజల్ ఇంజన్ రానుంది. ఫోర్ డ్రైవ్ సిస్టమ్ మరియు నాలుగు విభిన్న డ్రైవింగ్ మోడ్స్‌ ఉన్న కరోక్ ఎస్‌యూవీని 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

              • ధర అంచనా: రూ. 18-23 లక్షలు
              • విడుదల అంచనా: 2019 మధ్యలో
              • మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

                2. టాటా హెచ్5ఎక్స్

                ఈ లిస్టులో అత్యంత ఆసక్తికరమైన మోడల్ టాటా హెచ్5ఎక్స్. టాటా మోటార్స్ తమ టాటా హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని ల్యాండ్ రోవర్ డి8 ఫ్లాట్‌ఫామ్ మీద ఇంపాక్ట్ డిజైన్ పిలాఫీ 2.0 వెర్షన్ ఆధారంగా రూపొందించింది.

                మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

                ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ బాడీని ఉపయోగించి టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. తక్కువ ధరలో అందించేందుకు అల్యూమినియం వంటి మెటీరియల్‌ను వినియోగిస్తోంది. హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని 5 సీటింగ్ మరియు 7 సీటింగ్ లేఔట్లో రెండు మోడళ్లలో రూపొందిస్తోంది.

                మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

                ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఒక కొత్త శైలిలో ఉన్న టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో 140బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ మల్టీజెట్II ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ అనుసంధానంతో రానుంది. ప్రొడక్షన్ వెర్షన్ టాటా హెచ్5ఎక్స్ 2019లో విడుదల కానుంది.

                • ధర అంచనా: రూ. 12-16 లక్షల మధ్య
                • విడుదల అంచనా: 2019 ప్రారంభంలో
                • మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

                  1. వోక్స్‌వ్యాగన్ టి-రాక్

                  వోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ కోసం సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది. 2016 జెనీవా మోటార్ షో లో ఆవిష్కరించిన టి-క్రాస్ బ్రిజా కాన్సెప్ట్ ఆధారంతో, ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తోంది.

                  మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

                  స్కోడా భాగస్వామ్యం నిర్మించిన లో-కాస్ట్ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగించుకుని వోక్స్‌వ్యాగన్ అత్యంత సరసమైన ధరతో కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది. దేశీయ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. అయితే, వోక్స్‌వ్యాగన్ ఇండియా లైనప్‌లో ఇప్పటి వరకు సరసమైన ఎస్‌యూవీ రాలేదు.

                  మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

                  ఇండియన్ మార్కెట్ కోసం వోక్స్‌వ్యాగన్ అభివృద్ది చేస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో రానుంది. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పరిచయం చేయనుంది.

                  • ధర అంచనా: రూ. 9-14 లక్షల మధ్య
                  • విడుదల అంచనా: 2020 నాటికి

Most Read Articles

English summary
Read In Telugu: Upcoming 5-Seater SUVs In India in 2018, 2019
Story first published: Friday, May 18, 2018, 18:26 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X