విపణిలోకి వోక్స్‌వ్యాగన్ అమియో పేస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

వోక్స్‌వ్యాగన్ ఇండియా విపణిలోకి 1.0 లీటర్ అమియో పేస్ ఎడిషన్ కారును లాంచ్ చేసింది. వోక్స్‌వ్యాగన్ అమియో పేస్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 6.10 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil Kumar

వోక్స్‌వ్యాగన్ ఇండియా విపణిలోకి 1.0 లీటర్ అమియో పేస్ ఎడిషన్ కారును లాంచ్ చేసింది. వోక్స్‌వ్యాగన్ అమియో పేస్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 6.10 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. పోలో పేస్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న అదే 999సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ ఇందులో వచ్చింది.

వోక్స్‌వ్యాగన్ అమియో పేస్

పోలో మరియు అమియో హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఉన్న పెట్రోల్ ఇంజన్ 75బిహెచ్‌పి పవర్ మరియు 95ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. గతంలో ఉన్న 74బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేసింది. పేస్ వెర్షన్ అమియో కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతుంది.

వోక్స్‌వ్యాగన్ అమియో పేస్

వోక్స్‌వ్యాగన్ అమియో పేస్‌ మోడల్‌లో 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ కెపాసిటి గల టిడిఐ ఇంజన్ కలదు. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డైరక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

Recommended Video

Ford Freestyle Review | Test Drive | Interior, Top Features & More - DriveSpark
వోక్స్‌వ్యాగన్ అమియో పేస్

వోక్స్‌వ్యాగన్ అమియో నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్, హైలైన్ మరియు హైలైన్ ప్లస్. అమియో మధ్యస్థ వేరియంట్ కంఫర్ట్ ఆధారంగా పేస్ వెర్షన్ మోడల్ అభివృద్ది చేసింది. అమియో పేస్ వెర్షన్‌లో బ్లాక్ ఫినిషింగ్ గల అవుట్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఫాక్స్ కార్బన్ ఫైబర్ ట్రంక్ లిప్ స్పాయిలర్, అల్లాయ్ వీల్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ అమియో పేస్

వోక్స్‌వ్యాగన్ ఇటీవల పోలో పేస్ మరియు వెంటో స్పోర్ట్ మోడళ్లను లాంచ్ చేసింది. రెండు మోడళ్లను కూడా ధరలలో ఎలాంటి తేడా లేకుండా ఎన్నో అదనపు ఫీచర్లను అందించింది. వోక్స్‌వ్యాగన్ కార్ల లైనప్‌లో 1.0-లీటర్ ఇంజన్ పొందిన మొదటి మోడల్ పోలో హ్యాచ్‌బ్యాక్, తరువాత మోడల్ పోలో ఆధారిత అమియో.

వోక్స్‌వ్యాగన్ అమియో పేస్

వోక్స్‌వ్యాగన్ అమియో పేస్ విపణిలో ఉన్న మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, టాటా టిగోర్ మరియు ఫోర్డ్ ఆస్పైర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

వోక్స్‌వ్యాగన్ అమియో పేస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ అమియో పేస్ కారును 999సీసీ ఇంజన్‌తో ఎలాంటి చడీచప్పుడు లేకుండా లాంచ్ చేసింది. తమ పోలో హ్యాచ్‌బ్యాక్‌లో వచ్చిన 1.0 లీటర్ ఇంజన్ బిఎస్-4 ఉద్గార నియమాలను పాటిస్తుంది. నూతన ఇంజన్ మరియు అదనపు ఫీచర్ల జోడింపుతో అమియో పేస్ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ అమియో పేస్

1. కస్టమర్‌ను మోసం చేసినందుకు 9.23 లక్షలు జరిమానా విధించిన కోర్టు

2.కారుకు కుడి లేదా ఎడమవైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది మధ్యలో ఎందుకు ఉండదు?

3.3.55 లక్షల బిల్లుతో కస్టమర్‌కు భారీ షాక్ ఇచ్చిన ఓలా

4.3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

5.కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు గురించి తెలుసా?

Most Read Articles

English summary
Read In Telugu: Volkswagen Ameo 1.0 Pace Launched; Priced At Rs 6.10 Lakh
Story first published: Saturday, April 14, 2018, 15:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X