వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో హ్యాచ్‌బ్యాక్ కారును 2017లో అంతర్జాతీయ ఆవిష్కరణ చేసంది. వోక్స్‌వ్యాగన్ ఈ న్యూ జనరేషన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను 2019లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాల్సి ఉంది.

By Anil Kumar

జర్మనీకి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో హ్యాచ్‌బ్యాక్ కారును 2017లో అంతర్జాతీయ ఆవిష్కరణ చేసంది. వోక్స్‌వ్యాగన్ ఈ న్యూ జనరేషన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను 2019లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో కారును ఇండియాలో ప్రవేశపెట్టదని తెలిసింది.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

వోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం లో-కాస్ట్ కార్లను అభివృద్ది చేసే బాధ్యతను స్కోడాకు అప్పగించింది. ఇండియాలో సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీలను తయారు చేసేందుకు సరికొత్త ఎమ్‌క్యూబీ ఏఒ ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. విపణిలో హ్యాచ్‌బ్యాక్ కార్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది, పోలో విడుదలకు బ్రేక్ పడటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

వోక్స్‌వ్యాగ్ గ్రూప్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ, ఇండియాలోని చిన్న కార్ల మార్కెట్లో ఇప్పటికే లెక్కలేనన్ని మోడళ్లు ఉన్నాయి. కాబట్టి, వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా కంపెనీలు కేవలం సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీల అభివృద్ది మరియు తయారీ మీదనే దృష్టిసారించనున్నట్లు తెలిపాడు. ఈ సెగ్మెంట్లో నాణ్యమైన ఉత్పత్తులను ప్రవేశపెడితే ఇరు కంపెనీలు లాభాల పట్టే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

2020 వరకు వోక్స్‌వ్యాగన్ తమ న్యూ జనరేషన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియాకు తీసుకొచ్చే అవకాశం లేదు. 2020 తరువాత దేశీయ చిన్న కార్ల పరిశ్రమను అధ్యయనం చేసి, చిన్న కార్లకు డిమాండ్ ఆధారంగా పోలో విడుదల పట్ల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా ఇరు కంపెనీలు కూడా సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లను మాత్రమే డెవలప్ చేయనున్నాయి.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు నూతన సెడాన్ కార్లను ఎమ్‌క్యూబీ ఏఒ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించనుంది. రెండు కంపెనీలు లాంచ్ చేసే సెడాన్ కార్లు విపణిలో ఉన్న వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు స్కోడా ర్యాపిడ్ కార్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా అభివృద్ది చేసే కాంపాక్ట్ ఎస్‌యూవీలు పూర్తిగా కొత్త మోడళ్లు. ప్రత్యేకించి ఇవి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా మోడల్‌కు గట్టి పోటీనివ్వనుంది. దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా ప్రవేశపెడితే ఇరు కంపెనీలకు లాభదాయకంగా ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

స్కోడా ఆటో సిఇఒ బెర్న్‌హార్డ్ మైయర్ మాట్లాడుతూ, చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఇండియా వంటి దేశాల కోసం చిన్న కార్లను తయారు చేసేందుకు అవసరమయ్యే నూతన ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ది చేయాలని వోక్స్‌వ్యాగన్ గ్రూపు నుండి అదేశాలు వచ్చినట్లు తెలిపాడు. అంతే కాకుండా, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఈ ఏడాది సగ భాగంలో దీని గురించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాడు.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

ఇండియన్ మార్కెట్ కోసం తీసుకున్న భవిష్యత్ ప్రణాళికలకు వోక్స్‌వ్యాగన్ గ్రూప్ చకన్ ప్రొడక్షన్ ప్లాంటు వేదిక కానుంది. వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా ఇరు కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను ఇక్కడే ఉత్పత్తి చేయనున్నాయి. ఎమ్‌క్యూబీ ఏఒ ఫ్లాట్‌ఫామ్ మీద ఉత్పత్తి చేసే కార్ల కోసం ప్రత్యేకంగా అదనపు ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ పోలో ఇండియాలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్ కారు మరియు విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న వాటిలో వోక్స్‌వ్యాగన్ నెక్ట్స్ జెన్ పోలో ఒకటి. అయితే, సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మీద దృష్టి మళ్లడంతో తరువాత తరం పోలో హ్యాచ్‌బ్యాక్ ఇండియా విడుదలకు బ్రేక్ వేసింది.

వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో విడుదల ఇండియాలో లేనట్లే - ఎందుకంటే...?

ఏదేమైనప్పటికీ, వోక్స్‌వ్యాగన్ ఈ కొత్త తరం పోలో హ్యాచ్‌బ్యాక్ కారును 2020లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌‌యూవీల విభాగంలోకి ఎలాంటి సరసమైన ఉత్పత్తులను ప్రవేశపెడుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తాజా ఆటోమొబైల్ న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Source: ETAuto

Most Read Articles

English summary
Read In Telugu: Volkswagen May Not Introduce The Next-Gen Polo In India — Here’s Why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X