ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

బెంగళూరుకి చెందిన మార్షియల్ వోల్వో డీలర్ ఒక్క రోజులోనే కొత్తగా విడుదలైన వోల్వో ఎక్స్‌‌సి40 లగ్జరీ ఎస్‌యూవీలను 12 మందికి డెలివరీ చేసింది. వోల్వో ఎక్స్‌సి40 రూ. 39.90 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఇండియా)

By Anil Kumar

వోల్వో ఇండియా గత వారంలో తమ అత్యంత చౌకైన ఎక్స్‌సి40 ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే, ఈ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ మీద దేశవ్యాప్తంగా ప్రారంభమైన నేపథ్యంలో బెంగళూరులోని వోల్వో మార్షియల్ మోటార్స్ షోరూమ్ అత్యధిక బుకింగ్స్ నమోదు చేసుకుంది.

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

బెంగళూరుకి చెందిన మార్షియల్ వోల్వో డీలర్ ఒక్క రోజులోనే కొత్తగా విడుదలైన వోల్వో ఎక్స్‌‌సి40 లగ్జరీ ఎస్‌యూవీలను 12 మందికి డెలివరీ చేసింది. వోల్వో ఎక్స్‌సి40 రూ. 39.90 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఇండియా) ధరతో విడుదలయ్యింది.

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

స్వీడన్ దిగ్గజం వోల్వో ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఎస్‌యూవీలలో అతి చిన్న ఎస్‌యూవీలలో ఎక్స్‌సి40 ఒకటి. నగర అవసరాలకు ఉపయోగపడే వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌‌యూవీలో ఎన్నో అత్యాధునిక ఫీచర్లను అందివ్వడం జరిగింది.

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

ఒక్క రోజులో 12 వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలను డెలివరీ చేసిన సందర్భంగా వోల్వో కార్ ఇండియా విభాగాధిపతి ఛార్లెస్ ఫ్రంప్ మాట్లాడుతూ, "కొత్తగా విడుదలైన వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీకి వచ్చిన స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కర్ణాటకలో వోల్వో మరిన్ని ఎక్స్‌సి40 ఎస్‌యూవీల రోడ్డెక్కడం ఖాయం. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోంది. ఫ్యూచర్‌లో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలను ఇండియన్ రోడ్ల ఎక్కువగా చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు."

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

మార్షియల్ మోటార్స్ డీలర్ రితేష్ రెడ్డి మాట్లాడుతూ, "వోల్వో కార్ల కంపెనీతో మా ప్రయాణం 2013లో మొదలైంది. అప్పటి నుండి వోల్వో బ్రాండ్ కార్ల పట్ల మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన వోల్వో ఎక్స్‌సి40 మోడల్‌కు మంచి డిమాండ్ వస్తోందని హర్షం వ్యక్తం చేశాడు."

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

వోల్వో ఇండియా యొక్క చౌక ఎస్‌యూవీ వోల్వో ఎక్స్‌సి40లో ఉన్న 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

వోల్వో ఎక్స్‌సి40 కేవలం ఆర్-డిజైన్ అనే సింగల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. ఈ ఎస్‌యూవీ ఇంటీరీయర్ మరియు ఎక్ట్సీరియర్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. బాహ్య డిజైన్‌లో కంపెనీ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్స్, స్మోక్ ఎఫెక్ట్ మరియు థార్స్ హమ్మర్ ఎల్ఇడి డీఆర్ఎఎల్స్ మరియు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ ఉన్నాయి.

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 9-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వర్చువల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ప్యానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

సేఫ్టీ పరంగా వోల్వో ఎక్స్‌‌సి40 ఎస్‌యూవీ ఎంతగానో ఆకట్టుకుంది. అత్యాధునిక లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, పైలట్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు 8 ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

ఒక్క రోజులో 12 ఎక్స్‌సి40 లగ్జరీ కార్లను డెలివరీ చేసిన వోల్వో డీలర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోల్వో కంపెనీ దేశీయ లగ్జరీ కార్ల పరిశ్రమలో అత్యాధునిక మోడళ్లతో శక్తివంతమైన కార్ల కంపెనీగా ఎదుగుతోంది. తాజాగా నమోదైన ఫలితాలే ఇందుకు నిదర్శనం. వోల్వో ఎక్స్‌సి40 ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ మరియు ఆడి క్యూ3 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

Read more on: #volvo #వోల్వో
English summary
Read In Telugu: Volvo Delivers Twelve Units Of The XC40 In Bangalore On A Single Day
Story first published: Friday, July 13, 2018, 18:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X