వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుపొందిన వోల్వో ఎక్స్‌సి60

అమెరికాలో జరుగుతున్న న్యూయార్క్ ఆటో షో వేదికగా వోల్వో ఎక్స్‌సి60 కారు వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు గెలుపొందింది.

By Anil Kumar

అమెరికాలో జరుగుతున్న న్యూయార్క్ ఆటో షోలో వోల్వో ఎక్స్‌సి60 కారు వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు గెలుపొందింది. ఖరీదైన కార్ల తయారీ సంస్థ వోల్వో తమ ఎక్స్‌సి60 మోడల్‌ మీద అమెరికన్ యుటిలిటి అవార్డ్ మరియు ఎక్స్‌సి40 మీద యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుపొందింది.

వోల్వో ఎక్స్‌సి60 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌

వోల్వో ఈ అవార్డును సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి మరియు వరుసగా రెండవసారి ఈ ఎస్‌యూవీ విభాగంలో వోల్వోకు స్థానం లభించింది. గత ఏడాది, జాగ్వార్ ఎఫ్-పేస్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డును సొంతం చేసుకుంది.

వోల్వో ఎక్స్‌సి60 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌

వోల్వో ఎక్స్‌సి60 కారును కంపెనీ యొక్క స్కేలబుల్ ప్రొడక్టర్ ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద వోల్వో పెద్ద ఎస్‌యూవీ ఎక్స్‌సి90 డిజైన్ అంశాల ఆధారంగా నిర్మించారు. ఎక్స్‌సి60 ఫ్రంట్ డిజైన్‌లో వోల్వో సిగ్నేచర్ మల్టీ-స్లాట్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా పగటి పూట వెలిగే థోర్ హమ్మర్ ఎల్ఇడి లైట్లు గల ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి60 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌

వోల్వో ఎక్స్‌సి60 రియర్ డిజైన్‌లో నిలువుటాకారంలో ఉన్న స్టైలిష్ ఎల్ఇడి టెయిల్ లైట్లు, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపుల ఇముడింపుతో ఉన్న రియర్ బంపర్ వంటివి ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి60 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌

ఇటీరియర్‌లో, ఫ్రంట్ సీట్ల కోసం మెసేజ్ ఫంక్షన్, బ్లైండ్ స్పాట్, ఆడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ బ్రేకింగ్ సిస్టమ్, సెమీ-ఆటోమేటిక్ పార్కింగ్ మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Recommended Video

New Year 2018 Brings The Volvo V90 Cross Country To India - DriveSpark
వోల్వో ఎక్స్‌సి60 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌

అంతర్జాతీయ విపణిలో వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

వోల్వో ఎక్స్‌సి60 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌

ఇండియన్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి60 2-లీటర్, నాలుగు సిలిండర్ల ట్విన్-టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో లభిస్తోంది. 233బిహెచ్‌పి పవర్ మరియు 480ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే శక్తివంతమైన ఇంజన్‌కు 8-స్పీడ్ గేర్‌ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

వోల్వో ఎక్స్‌సి60 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోల్వో బ్రాండ్ సేఫ్టీకి పర్యాయపదంగా నిలిచింది. గత ఏడాది యూరో ఎన్‌సిఎపి నుండి సేఫెస్ట్ కార్ ఇన్ ది వరల్డ్ 2018 అవార్డు కూడా వోల్వోకే దక్కింది. వోల్వో ఎక్స్‌సి60 2017లో ఇండియన్ మార్కెట్లోకి రూ. 55.90 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యింది.

ఇది విపణిలో ఉన్న ఆడి క్యూ5, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌3 మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

వోల్వో ఎక్స్‌సి60 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌

1. రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడానికి టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేసిన పోలీసులు

2.కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!!

3.ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే డ్రైవ్ చేయడం వెనకున్న ఆంతర్యం ఏమిటి?

4.రైలు ప్రయాణం మనకు ఎంతో ఆనందం..... కాని రైలు నడిపే వారికి అదో నరకం...!!

5.2018 మారుతి స్విఫ్ట్ కారుకు క్రాష్ టెస్ట్: హిట్టా.. ఫట్టా..!!

Most Read Articles

Read more on: #volvo #వోల్వో
English summary
Read In Telugu: Volvo XC60 Wins The World Car Of The Year 2018 Award
Story first published: Thursday, March 29, 2018, 18:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X