మరో నిండు ప్రాణాన్ని బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం - వీడియో

ఎటు చూసినా నదులను తలపించే రోడ్లు, దానికి తోడు పాట్ హోల్స్‌కు కొదవలేని రహదారులు ఇలా అన్నీ ముంబాయ్ నగరవాసులకు నరకం చూపెడుతున్నాయి. గత శుక్రవారం నాడు ఓ మహిళ బైకు మీద నుండి క్రింద పడి బస్సు చక్రాల క్రింది

By Anil Kumar

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్‌ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. విపరీతమైన కుండపోత వర్షం ముంబాయ్ ప్రజల జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి ముంబాయ్ వర్షాలు అద్దం పడుతున్నాయి.

ముంబాయ్‌లో బస్సు క్రింద పడిన మహిళ

ఎటు చూసినా నదులను తలపించే రోడ్లు, దానికి తోడు పాట్ హోల్స్‌కు కొదవలేని రహదారులు ఇలా అన్నీ ముంబాయ్ నగరవాసులకు నరకం చూపెడుతున్నాయి. గత శుక్రవారం నాడు ఓ మహిళ బైకు మీద నుండి క్రింద పడి బస్సు చక్రాల క్రింది నలిగిపోయి ప్రాణాలొదిలింది.

ముంబాయ్‌లో బస్సు క్రింద పడిన మహిళ

విపరీతమై వర్షానికి రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న గుంతలు నీటితో నిండిపోయాయి. ఓ జంట బైకు మీద ఇంటికి వెళుతుండగా, రోడ్డు మీద కనబడకుండా నీటితో నిండిపోయిన గొయ్యి మీదుగా బైకును పోనివ్వడంతో అదుపుతప్పి వెనుక కూర్చున్న మహిళ క్రింద పడిపోయింది.

ముంబాయ్‌లో బస్సు క్రింద పడిన మహిళ

వర్షం కుండబోతగా కురుస్తుండటంతో ఆమె గొడుగుని పట్టుకుంది. దానికి తోడు ఒకవైపుకు కూర్చుంది, ఈ క్రమంలో కింద పడిన వెంటనే పక్కనే వెళుతున్న బస్సు వెనుక చక్రాల క్రింద పడిపోయింది. సుమారుగా కొద్ది దూరం మేర బస్సు చక్రాలు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లాయి.

ముంబాయ్‌లో బస్సు క్రింద పడిన మహిళ

ఈ విషాద ఘటన ముంబాయ్‌కి సమీపంలోని కళ్యాణ్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డు అయిన ఈ ఘటన అద్వానంగా ఉన్న ముంబాయ్ నగర రహదారుల నిర్మాణం, నిర్వహణ మరియు అధికారులు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.

ముంబాయ్‌లో బస్సు క్రింద పడిన మహిళ

నాలుగు లేన్ల రహదారి, అందులో రోడ్డుకు ఒకవైపున సగం భాగం నీటితో నిండిపోయింది. అందులో ఆ రోడ్డు మీద ఉన్న గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. తక్కువ మరియు ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలు ఒకదానినొకటి అధిగమించడం సర్వసాధారణం. ఈ క్రమంలో టూ వీలర్ గుంతను ఎక్కిచడంతో అదుపుతప్పడం, ఆ వెంటనే వీరిని అధిగమిస్తూ బస్సు రావడంతో బైకు మీద ఉన్న మహిళ చక్రాల క్రిందకు జారిపోయింది.

ముంబాయ్‌లో బస్సు క్రింద పడిన మహిళ

శరీరం మొత్తం చక్రాల క్రింద ఉండటంతో వెనుక చక్రాలు కదలడానికి కూడా కుదరలేదు, దీంతో బస్సు ఆమె శరీరాన్ని కొద్ది దూరం మేర ఈడ్చుకెళ్లింది. ఎట్టకేలకు నిలిచిపోయిన బస్సు చివరగా ఆమె మీద నుండి ముందుకెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే చనిపోయింది.

ముంబాయ్‌లో బస్సు క్రింద పడిన మహిళ

రోడ్డు మీద భారీగా నిలిచిన నీరు, నీటి క్రింది ఉన్న చిన్న చిన్న గొయ్యిలు, మహిళ కూడా బైకు మీద ఒకవైపుకు కూర్చోవడం, దానికి తోడు రద్దీగా ఉన్న రోడ్డు మీద గొడుగుని పట్టుకుని రైడర్‌కు రోడ్డు కనబడకుండా చేయడం ఇలాంటి అజాగ్రత్తలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.

ముంబాయ్‌లో బస్సు క్రింద పడిన మహిళ

ఇటీవల వాతావరణ పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎప్పుడుపడితే అప్పుడు వచ్చే వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. దీనికి తోడు ప్రజలు మరియు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి కోలుకోలేని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి, వర్షాకాలంలో వీలైనంత వరకు బైకు మీద ప్రయాణించడాన్ని మానేయండి. ఇందుకు ప్రత్యామ్నాయంగా క్యాబ్, ఆటో లేదా బస్సులను ఉపయోగించండి.

ప్రమాదం జరిగిన తీరును ఇక్కడున్న వీడియో ద్వారా చూడగలరు.మన దేశంలో ఇలాంటి రోడ్లకు కొదవలేదు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించండి.

Most Read Articles

English summary
Read In Telugu: Woman falls as bike slips over pothole crushed by bus
Story first published: Monday, July 9, 2018, 18:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X