నిరీక్షణకు ముగింపు: ఎగిరే కార్ల విడుదలకు సర్వం సిద్దం

ఎగిరే కార్ల మీద జరుగుతున్న ప్రయోగాలు ఓ కొలిక్కి వచ్చాయి. జెనీవా మోటార్ షోలో PAL-V సంస్థ తొలి ఎగిరే కారును ఆవిష్కరించింది. వాణిజ్య అసరాలకు 2019 నుండి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సంస్

By Anil Kumar

ట్రాఫిక్‌లో గంటల తరబడి నిలిచిపోయినపుడు, మనసు చిన్న పిల్లల మనస్తత్వంతో ఉన్న ప్రదేశం నుండి మనం ఉన్న కారు లేదా బైకుతో అలాగే గాల్లోకి ఎగిరిపోతే ఎంత బాగుటుందో అని నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొనే వారంతా ఒక్కసారైనా ఆలోచించి ఉంటారు.

గాలిలోకి ఎగిరే కారు

ఎంతో మంది కన్న ఈ కల నిజమవ్వడానికి మరెంతో సమయం పట్టదు. తాజాగా ఎగిరే కార్ల మీద జరుగుతున్న ప్రయోగాలు ఓ కొలిక్కి వచ్చాయి. జెనీవా మోటార్ షోలో PAL-V సంస్థ తొలి ఎగిరే కారును ఆవిష్కరించింది. వాణిజ్య అసరాలకు 2019 నుండి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

గాలిలోకి ఎగిరే కారు

డచ్ దేశానికి చెందిన పాల్-వి ఇంటర్నేషనల్ తాజాగా పర్సనల్ ఎయిర్ అండ్ ల్యాండ్ వెహికల్(PAL-V)లిబర్టి ఎగిరే కారును 2018 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించింది. ఇది 2019లో ప్రొడక్షన్ దశకు చేరుకోనున్న ఎగిరే కారు యొక్క మరో కాన్సెప్ట్ రూపం.

గాలిలోకి ఎగిరే కారు

PAL-V లిబర్టి ఒక మూడు చక్రాల ఎగిరే కారు. చూడటానికి హెలీకాప్టర్ మరియు మూడు చక్రాల బైకు ఆధారంగా రూపొందించిన మూడు చక్రాల కారు శైలిలో ఉంటుంది. ఫ్రంట్ వీల్‌ను చక్కగా కారు బాడీలో ఇమిడిపోయేలా డిజైన్ చేశారు.

గాలిలోకి ఎగిరే కారు

మూడు చక్రాల ఎగిరే కారు రోడ్ల మీద తిరగడానికి మరియు గాలిలో ఎగరడానికి యూరప్ మరియు అమెరికా దేశాల్లో అనుమతులు కూడా పొందింది. దీనిని పూర్తిగా, కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం వంటి విలక్షణమైన పదార్థాలతో నిర్మించడం జరిగింది.

గాలిలోకి ఎగిరే కారు

680కిలోల బరువున్న ఈ ఎగిరే కారు, అతి తక్కువ దూరంలోనే ల్యాండింగ్ మరియు టేకాఫ్ తీసుకుంటుంది. దీనికి టేకాఫ్ కోసం 165-మీటర్లు మరియు ల్యాండింగ్ కోసం 30 మీటర్లు పొడవున్న రన్‌వేలు మరియు రహదారులు ఉంటే సరిపోతుంది.

గాలిలోకి ఎగిరే కారు

పాల్-వి లిబర్టి గాల్లో ఎగిరే కారులో 100బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే రెండు ఇంజన్‌లు ఉన్నాయి. రోడ్డు మరియు గాలిలో రెండు మార్గాల్లో ఇది గరిష్టంగా గంటకు 180కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

గాలిలోకి ఎగిరే కారు

PAL-V లిబర్టి ఎగిరే కారును కంపెనీ అందరికీ విక్రయించదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు పైలట్ లైసెన్స్ ఉన్న కస్టమర్లకు మాత్రమే పాల్-వి సంస్థ తమ ఎగిరే కారును విక్రయిస్తుంది.

గాలిలోకి ఎగిరే కారు

PAL-V లిబర్టి ఎగిరే కారు గాల్లోకి ఎగరడానికి హెలీకాఫ్టర్ల తరహాలో రోటార్ బ్లేడ్లు ఉంటాయి. అయితే హెలీకాఫ్టర్లలో మాదిరిగా రోటార్ బ్లేడ్లు అంత శక్తివంతమైనవేం కాదు. కానీ గైరోప్లేన్‌లో ఉన్న రోటార్ బ్లేడ్ల తరహాలో పనిచేస్తాయి.

గాలిలోకి ఎగిరే కారు

కారు లోపల గల చిన్న బటన్ ప్రెస్ చేయడం ద్వారా రోటార్లు మరియు కారుకు వెనుక వైపున ఇరువైపులా స్పాయిలర్స్ ఆకారంలో ఉన్న బ్లేడ్లు అన్నీ క్రిందకు ముడుచుకుంటాయి. దీంతో రోడ్డు మీద సాధారణ వెహికల్ మాదిరగానే ప్రయాణిస్తుంది.

గాలిలోకి ఎగిరే కారు

PAL-V సంస్థ 2019లో డిమాండును బట్టి 50 నుండి 100 వాహనాలను తయారు చేయాలనే లక్ష్యంతో ఉంది. 2020 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్పత్తి చేసిన అనంతరం కనీసం 150 గంటల పాటు దీనిని పరీక్షించి, నడిపిన తరువాతే కస్టమర్‌కు డెలివరీ చేస్తారు.

గాలిలోకి ఎగిరే కారు

ఒక్కో PAL-V లిబర్టి ఎగిరే కారు ధర 600,000 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ. 3.90 కోట్ల రుపాయలు. కంపెనీ అత్యంత సరసమైన మోడల్‌ను PAL-V లిబర్టి స్పోర్ట్ వెర్షన్ పేరుతో లాంచ్ చేసి 2.18 కోట్ల రుపాయలు లేదా 335,000 డాలర్లకు విక్రయించనుంది.

గాలిలోకి ఎగిరే కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రైట్ బ్రదర్స్ విమానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కాలం నుండి ఇప్పటి వరకు ఎగిరే కారు(Flying Car) ఒక కలగానే మిగిలిపోయింది. గాల్లో ఎగిరే విమానాలు మరియు రోడ్డు మీద దూసుకెళ్లే కార్లలో భారీ మార్పులు జరిగాయి. కానీ, ఈ రెండింటి కలయికలో గాలిలో ఎగిరే మరియు రోడ్డు మీద నడిచే వాహనాన్ని నిర్మించడానికి ఎన్నో కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చాలా వరకు ప్రయత్నాలు ప్రయోగ దశలోనే నిలిచిపోయాయి.

గాలిలోకి ఎగిరే కారు

కానీ డచ్ కంపెనీ మానవ కలలు మరియు ఆవిష్కృతలను అతి కొద్ది కాలంలో నిజం చేయబోతోంది. ప్రొడక్షన్ వెర్షన్ PAL-V లిబర్టి గాలిలో ఎగిరే మరియు రోడ్డు మీద దూసుకెళ్లే వాహనాన్ని విజయవంతంగా అభివృద్ది చేసి "అసాధ్యమైనది ఏదీ లేదు అని" నిరూపించింది.

Most Read Articles

English summary
Read In Telugu; World’s First Flying Car To Go Into Production In 2019 — PAL-V Liberty Unveiled At Geneva Motor Show
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X