ఆరు ఎయిర్ బ్యాగుల్లో ఒక్కటి కూడా తెరుచుకోలేదు: స్పందించిన మహీంద్రా

ఇటీవల కేంద్ర రాజధాని పరిధిలో ఓ మహీంద్రా ఎక్స్‌యూవీ 500 వాహనం ఘోర ప్రమాదానికి గురయ్యింది. అయితే, ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్న ఇందులో ఒక్కటి కూడా ఓపెన్ అవ్వలేదు.

By Anil Kumar

అనుకోకుండా ఎదురయ్యే భారీ ప్రమాదాల్లో ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంతో ఎయిర్ బ్యాగులు కీలకపోత్ర పోషిస్తారు. చాలా వరకు కార్లలో డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్లకు మాత్రమే ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మరికొన్ని ఖరీదైన మరియు టాప్ ఎండ్ కార్లలో ఆరు అంత కంటే ఎక్కువ ఎయిర్ బ్యాగులు ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

ఇవి ప్రమాదం జరిగినపుడు వెంటనే విచ్చుకుని ప్రయాణికుల తలకు గాయాలవ్వకుండా రక్షిస్తాయి. అయితే, ఒక్కోసారి ఎయిర్ బ్యాగులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎయిర్ బ్యాగులు కనుక ఫెయిల్ అయితే, ప్రమాద తీవ్రతను ఏ మాత్రం అంచనా వేయలేం, ప్రమాదాన్ని బట్టి ఒక్కోసారి ప్రాణాలుపోయే అవకాశం కూడా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఇటీవల కేంద్ర రాజధాని పరిధిలో ఓ మహీంద్రా ఎక్స్‌యూవీ 500 వాహనం ఘోర ప్రమాదానికి గురయ్యింది. అయితే, ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్న ఇందులో ఒక్కటి కూడా ఓపెన్ అవ్వలేదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

ఢిల్లీకి చెందిన అరవింద్ 2013 మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 మోడల్‌ను కొనుగోలు చేసాడు. అదుపు తప్పిన ఎక్స్‌యూవీ500 తీవ్రంగా ధ్వంసమయ్యింది. ప్రమాదం జరిగినపుడు అరవింద్ కుమారుడు వాహనాన్ని నడపుతున్నాడు, ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన అతని పరిస్థితి విషమంగా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

తీవ్రంగా ధ్వంసమైన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రాణాలు కాపాడాల్సిన ఎయిర్ బ్యాగులు ఒక్కటి కూడా తెరచుకోవడం.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

ఎయిర్ బ్యాగులు తెరచుకోకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి ప్రమాదానికి గురైన మహీంద్రా ఎస్‌యూవీ500 వాహనానికి థర్డ్-పార్టీ-ఇన్వెస్టిగేషన్ చేయించాలని నెటిజన్లు వెహికల్ ఓనర్ అరవింద్‌ను కోరుతున్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

ఈ నేపథ్యంలో, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా ఈ ప్రమాదానికి సంభంది ఓ ప్రతిని విడుదల చేశాడు. ఆ లేఖ ప్రకారం, "మే 2018లో గురుగ్రామ్‌లో జరిగిన ఎక్స్‌యూవీ500 ప్రమాదం గురించి తెలుసుకున్నాము. ప్రమాదం జరిగినపుడు వాహనాన్ని నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాలపాలవ్వడం ఎంతో బాధను కలిస్తోంది. అతను వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుంటుంబం విషాదాన్ని అర్థం చేసుకోగలం. మా కస్టమర్‌తో కలిసి ఉంటామని పేర్కొన్నాడు."

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

ప్రమాదం జరిగినపుడు ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు కస్టమర్లు మరియు నెటిజన్లు వేసిన ప్రశ్నలను మేము అర్థం చేసుకున్నాము. మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనంలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వలేదు, ఇది సురక్షితమైన వాహనం కాదని కొంత మంది సామాజిక్ మాధ్యమాల్లో చేసిన పోస్టులు వచ్చాయి. ఇలాంటి ప్రమాదాల పట్ల మహీంద్రా పూర్తి బాధ్యతతో ఉంటుంది మరియు ప్రమాదానికి గురైన వాహనం లభిస్తే ఆ వాహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షిస్తామని తెలిపారు."

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

అంతే కాకుండా, వాధేరా తన లేఖలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 వెహికల్ సేఫ్టీ గురించి రాశారు. మహీంద్రా ఎక్స్‌యూవీ500 సరిగ్గా 2011లో విడుదలయ్యింది మరియు అన్ని వేరియంట్లలో ఏబిఎస్ మరియు ఎయిర్ బ్యాగులను పరిచయం చేసిన తొలి దేశీయంగా డిజైన్ చేయబడిన ఇండియన్ కారు ఇదేనని తెలిపాడు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

ప్రయాణికుల భద్రత దృష్ట్యా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాన్ని పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ముందే నిర్మాణ నాణ్యత మరియు సేఫ్టీ ఫీచర్ల పనితీరు పరంగా ఎన్నో కఠినమైన పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నాడు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

ప్రమాదానికి గురైన మహీంద్రా ఎక్స్‌యూవీ500 యజమాని మహీంద్రా నుండి వచ్చిన లేఖకు స్పందిస్తూ, ఈ సమాధానం పట్ల సంతృప్తి చెందలేదు. ఈ వాహనానికి ఖచ్చితంగా థర్డ్-పార్టీ-ఇన్వెస్టిగేషన్ నిర్వహించి, న్యాయం కోసం పోరాడుతానని వివరించాడు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 యాక్సిడెంట్

తీవ్ర గాయాలపాలై విషంగా అరవింద్ కుమారుడు త్వరగా కోరుకోవాలని డ్రైవ్‌స్పార్క్ బృందం కోరుకుంటోంది. మహీంద్రా ప్రమాదానికి గురైన వాహనాన్ని పరీక్షించి, ఎయిర్ బ్యాగులు విచ్చుకోకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: XUV500 airbags do not open in crash; Mahindra responds
Story first published: Saturday, August 4, 2018, 18:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X