Just In
- 3 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 6 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 9 hrs ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 12 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Don't Miss
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కొత్త అప్డేట్స్ తో డాట్సన్ రెడి-గో విడుదల: ధర, వివరాలు
డాట్సన్ కొత్త అప్డేట్స్ తో 2019 రెడి-గో హ్యాచ్ బ్యాక్ ను లాంచ్ చేసింది. 2019 డాట్సన్ రెడి-గో ఇప్పుడు మెరుగైన సేఫ్టీ అప్డేట్ లు మరియు ఫీచర్లతో వస్తుంది. మరి ఆ కొత్త ఫీచర్ల, కొత్త అప్డేట్, దీని ధర గురించి వివరంగా తెలుసుకొందాం రండి..
ముందుగా 2019 డాట్సన్ రెడి-గో మీద ఉన్న కొత్త ఫీచర్లులో డ్రైవర్-సైడ్ ఎయిర్ బ్యాగులు, ఈబిడి, రియర్ పార్కింగ్ అసిస్ట్ సెన్సార్, హై-స్పీడ్ వార్నింగ్ మరియు డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కొరకు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి కలిగి ఉన్నాయి.
హర్దీప్ సింగ్ బ్రార్, డైరెక్టర్ సేల్స్ అండ్ కమర్షియల్, నిస్సాన్ ఇండియా ఇలా పేర్కొన్నారు, "డాట్సన్ కస్టమర్ ని సంతోషపెట్టడానికి మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మేం కట్టుబడి ఉన్నాం.
మా పాపులర్ మోడల్, డాట్సన్ రెడి-గో ఇప్పుడు వివిధ రకాల సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్ గా కలిగి ఉంది, భద్రత, టెక్నాలజీ, స్టైల్ మరియు సౌలభ్యం ద్వారా తీసుకురావడానికి మా సంస్థ ఎప్పుడూ పని చేస్తుంటుంది.
2019 డాట్సన్ రెడి-గో లో , ఒక 0.8-లీటర్ (799 సిసి) లేదా 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ల ద్వారా కొనసాగుతుంది. 799 సిసి ఇంజిన్ 54 బిహెచ్పి మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, 1.0-లీటర్ ఇంజన్ చర్న్స్ 68 బిహెచ్పి మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ను విడుదల చేయును.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
రెండు ఇంజన్ లు ఒక స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటాయి, 1.0-లీటర్ ఇంజన్ ను ఆప్షనల్ స్మార్ట్ డ్రైవ్ ఆటో ట్రాన్స్ మిషన్ ను కూడా అందుకుంటోంది.
డాట్సన్ రెడి-గో అద్భుతమైన ఇంధన సామర్థ్య గణాంకాలు అందిస్తుంది, 0.8-లీటర్ ఇంజన్ కు 22.7 కిమీ/లీ మరియు 1.0-లీటర్ ఇంజన్ కు 22.5 కిమీ/లీ మైలేజ్ ను అందిస్తోంది.
రెడి-గో ఒక 'టాల్ బాయ్' డిజైన్ అందిస్తుంది, లోపలి స్థలం గ్రౌండ్ క్లియరెన్స్ 185 మిమీ గ ఉంది. కొత్త అప్డేట్లతో ఉన్న డాట్సన్ కూడా 2 సంవత్సరాల/అపరిమిత కిలోమీటర్ స్టాండర్డ్ వారంటీతో రెడి-గో ను అందిస్తోంది.
వారెంటీ తదుపరి 2 లేదా 3 సంవత్సరాలు/అపరిమిత కిమీలు పొడిగించవచ్చు. దీని వల్ల ఖాతాదారులకు రోడ్డు అసిస్టెన్స్ ను ఉచితంగా ఉంటుంది. డాట్సన్ వారి సమగ్ర సర్వీస్ ప్యాకేజీ అయిన 'డాట్సన్ కేర్' ను కస్టమర్ల అందిస్తోంది.
పార్ట్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్, లేబర్ చార్జీలపై 100 శాతం కవరేజీని అందిస్తోంది. అలాగే 24x7 సహాయాన్ని, ప్యాకేజీలో భాగంగా కూడా అందిస్తోంది. 2019 రెడి-గో హ్యాచ్ బ్యాక్ ప్రస్తుతం రూ. 2.79 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం
డాట్సన్ ఇండియన్ మార్కెట్లో తమ ఎంట్రీ లెవల్ రెడి-గో హ్యాచ్ బ్యాక్ ను అప్డేట్ చేసింది. డాట్సన్ రెడి-గో ఇప్పుడు ఏప్రిల్ 2019 లో కచ్చితమైన అన్ని భద్రతా ఫీచర్లను అందిస్తోంది. డాట్సన్ రెడి-గో ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో మరియు రెనాల్ట్ క్విడ్ లపై పోటీపడనుంది.