ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ విధంగా అభివృద్ధి జరుగుతున్న తరుణంలో జరిగిన మరియు జరుగుతున్న మార్పులు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రధానంగా అభివృద్ధి అంటే మనకు గుర్తుకు వచ్చేది మొదట రవాణా వ్యవస్థ. మొదట డీజిల్ వాహనాలు ,తరువాత కాలంలో పెట్రోల్ వాహనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు విద్యుత్ సహాయంతో నడిచేకారు భారతదేశంలో రంగప్రవేశం చేసాయి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలలోలాగా మనం కూడా ఇటువంటి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు వినియాగం ఎంతైనా అవసరం.

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

ఇప్పుడు ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యుగం ప్రారంభమైంది. 2019 ఏప్రిల్ నుండి 2019 అక్టోబర్ వరకు ఏడు నెలలపాటు అమ్మిన ఎలక్ట్రిక్ కార్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ కార్లవల్లా పర్యావరణం సురక్షితంగా ఉంటుంది. శిలాజ ఇంధనాల కొరత ఉండదు. రాబోయే తరాలకు ఎటువంటి నష్టము ఉండదు.

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

కాబట్టి వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో బ్యాటరీతో నడిచే కార్లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు వాహనాలను తయారుచేసే పెద్దపెద్ద కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంపై ద్రుష్టి సాగిస్తున్నారు.

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

మనదేశంలో ఈ ఆర్ధిక సంవత్సరంలో 16,05,549 ఎలక్ట్రిక్ కార్లలో కేవలం 1071 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దేశం మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహనాలు 0.067% మాత్రమే అమ్ముడయ్యాయి అని తెలుస్తుంది.

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

ఎలక్ట్రిక్ వాహనాలను బాగా వ్యాప్తిలోకి తీసుకురావాలని, తీసుకురావడానికి కావలసిన సహాయ సహకారాలను ప్రభుత్వం కూడా అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితీష్ గడ్కరీ చెప్పారు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగ దారులు ఎంతైనా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

ఈ ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాలు ఈ విధంగా ఉన్నాయి.

ర్యాంక్ మోడల్స్ 2019 ఏప్రిల్-అక్టోబర్
1 మహీంద్రా - వెరిటో 434
2 టాటా - టిగోర్ 389
3 హ్యుందాయ్ - కోన 227
4 మహీంద్రా - ఇ2ఓ 21
ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

1) 2019 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు "వెరిటో". దీని సగటు 62 కార్లు

2) టైగర్ 7 నెలల వ్యవధిలో 389 కార్లను విక్రయించింది మరియు దాని సగటు 56 కార్లు.

3) కోనా మంచి పురోగతి సాధించింది మరియు ప్రారంభించిన 5 నెలల్లో 227 యూనిట్లను విక్రయించింది మరియు సగటున 45 యూనిట్లు.

4) E2O ఫస్ట్ మూవర్ ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం ఈ మోడల్ యొక్క సగటు అమ్మకం 3 కార్లు మాత్రమే.

Read More:2 సంవత్సరాల వారంటీని 4 సంవత్సరాలకు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్!

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

ఎలక్ట్రిక్ కార్లు వినియోగానికి కావలసిన అన్ని సదుపాయాలను కంపెనీలు సమకూరుస్తున్నాయి. నగరాలలో ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్లు చూడటానికి ఆకర్షంగా ఉండటమే కాకుండా మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. కాబట్టి వినియోగ దారులు నిస్సంకోచంగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించుకోవచ్చు.

Read More:భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

Most Read Articles

English summary
Electric Vehicle Sales Data – India (Cars)- Read in Telugu
Story first published: Thursday, December 26, 2019, 17:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X