"ఎగిరే కారు" ను ఆవిష్కరించిన జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ

జపాన్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లు మరియు రైడ్-హయిలింగ్ సేవలు వంటి సాంకేతికతలో పురోగతి సాధించడానికి ఎగిరే కార్లతో తమ సత్తాను చాటాలని, ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. దీనిని ఎన్ఐసి కార్ప్ ద్వారా తయారు చేయబడింది మరి దీని గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

సోమవారం టోక్యో లో ఒక ప్రదేశము వద్ద దీనిని జపాన్ ఎలక్ట్రానిక్స్ మేకర్ ఈ యంత్రాన్ని ప్రదర్శించింది. జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ అయిన ఎన్ఈసి కార్పొరేషన్ వారు ఫ్లయింగ్ కారును ఆవిష్కరించారు. పెద్ద డ్రోన్ వాలే కనిపించే ఈ ఫ్లయింగ్ కారు దాదాపు ఒక నిమిషము పాటుగా గాలిలో ఎగిరింది. టోక్యో లో ఉన్న ఎన్ఈసి సంస్థ కేంద్రంగా ఈ ప్రయోగాన్ని చేసారు. ఈ ప్రయోగాత్మక పరీక్షలో ఇది దాదాపుగా మూడు మీటర్ల పేయికి విజయవంతంగా ఎగిరింది.

ఈ ఎగిరే కార్లను అభివృద్ధి చేయడాన్ని గత కొంతకాలంగా జపాన్‌ ప్రభుత్వం అనేక సంస్థలను ప్రోత్సహిస్తోంది. అలాగే 2030 నాటికి ప్రజలు వీటిలో ప్రయాణించే విధిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అని ప్రభుత్వం ద్వారా తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఫ్లయింగ్ కార్లపై కొన్ని ప్రాజెక్టులు నడుస్తున్నాయి.

ఇటీవల వార్తల్లో నిలిచిన అమెరికాలో ఉబర్‌ ఎయిర్‌ ఈ విధానానికి సంబంధించిన విషయం. అయితే 2017లోనే జపాన్‌కు చెందిన కార్టివేటర్ అనే సంస్థ మొదటి సారిగా ఈ ఫ్లయింగ్ కారును తయారు చేసినది, అయితే దీనిని ప్రయోగిస్తుండగా ప్రారంభ దశలోనే కూలిపోయినది. ఈ ఫ్లయింగ్ కార్లు చాల దూరం ప్రయాణించగలవని అప్పటిలోనే ఈ కార్టివేటర్‌ సంస్థకు చెందిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు.

కార్టివేటర్‌ సంస్థకు చెందిన ఎగిరే కారుకు చాలా సంస్థలు స్పాన్సర్‌ చేసాయి, అయితే అందులో ఉన్న కంపెనీలలో ఎన్‌ఈసి కూడా ఉంది. దీనిని బ్యాటరీ సహాయంతో నడిచేవిధంగా తాయారు చేసారు. జపాన్ దేశం యొక్క రాజధానిలోని అబికోలో దీనిని విజయవంతంగా పరిక్షించారు. ఈ ఎన్ఈసి కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఫ్లయింగ్ కార్లతో ప్రయాణ చేయడం అనేది ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని.

అయితే తగిన సమయం వచ్చినప్పుడు కొత్త టెక్నాలజితో సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే బ్యాటరీ లైఫ్, సేఫ్టీ, నియంత్రణ వంటి అంశాలపై ఇంకా చాల పరిశోధన చేయాలనీ తెలిపారు. టెక్నాలజీ చౌకగా అందుబాటులోకి వస్తే రద్దీ నగరాలు, పట్టణాల పరిధిలో దీన్ని అందుబాటులోకి తేవచ్చునని కూడా చెప్పారు. మేము ఎయిర్ మొబిలిటీ కోసం ఒక ఎనబ్లర్ గా పొజిషనింగ్, ఫ్లయింగ్ కార్ల కోసం డేటా మరియు బిల్డింగ్ కమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలను అందించడం జరిగిందని ఈ సంస్థ పేర్కొంది.

గత కొన్ని సంవత్సరాలుగా, జపాన్ ప్రపంచంలోనే ఎగిరే కార్ల పరిశ్రమను కలిగిన ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు సరైన వాతావరణాన్ని కలిగి ఉందని నమ్మే ఒక చిన్న ఫ్లైయింగ్ కార్ ఆవిర్భావాన్ని చూసాము. దేశంలో వెంచర్ క్యాపిటలిస్టులు, డ్రోన్ ఫండ్ అనబడే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు.

Most Read:హెల్మెట్ లేదని ఫైన్.. కోపంతో పోలీస్ స్టేషన్ కరెంటు పీకేసిన ఘనుడు

సాధారణ మరియు ఎగిరే-కార్ల వ్యాపారాలలో ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి కలిగిన విమానాలలో పెట్టుబడి పెట్టేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. సోమవారం జరిగిన ఈ డెమో ఒక ప్రధాన జపనీస్ కార్పొరేషన్ దీనికి బదులుగా ప్రాజెక్ట్ పార్టనర్ కార్ట్టివేటర్ తో 2026 లో రవాణా యంత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది అని, ఈ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు, టొమోహిరో ఫుకుజోవా తెలిపారు.

Most Read:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారో భారీ ఫైన్ కట్టాల్సిందే...ఇవే కొత్త రూల్స్

ఈ నమూనాను అభివృద్ధి చేయడానికి సుమారు ఒక సంవత్సర కాలం పట్టింది. ఇది సుమారు 3.9 మీటర్ల పొడవు, 3.7 మీటర్ల వెడల్పు, 1.3 మీటర్ల ఎత్తు, సుమారు 150 కిలోల బరువు ఉంటుంది. ఇది 2 మీటర్ల ఎత్తులో ఎగిరింది, ఇది అదుపు తప్పి ఎగరకుండా మరియు ఎవ్వరికి హాని కలిగించ కుండా ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా ఉండడానికి ఒక పెద్ద 10 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు కలిగిన ఒక బోనులో పరీక్షించబడింది.

Most Read:' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

జపాన్ దేశం మాత్రమే ఈ ఫ్లయింగ్ కారును తయారీని చేస్తుందని అనుకొంటే పొరపాటే, ఈ టెక్నాలిజీని దుబాయ్, సింగపూర్, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలు కూడా చేశాయి. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ యొక్క కిట్టీ హాక్ కార్పోరేషన్, ఉబెర్ టెక్నాలజీస్ తో కలిసి ఫ్లైయింగ్ కారుపై కూడా పనిచేస్తోంది.

Most Read Articles

English summary
Will flying car be a reality soon? This Japanese vehicle manages to get off the ground for a minute - Read in Telugu.
Story first published: Tuesday, August 6, 2019, 17:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X