హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

హోండా మోటార్స్ విపణిలోకి సిటీ సెడాన్ కారును బిఎస్-6 వెర్షన్‌లో లాంచ్ చేసింది. హోండా సిటీ బిఎస్6 పెట్రోల్ ధర రూ. 9.91 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ప్రస్తుతం పెట్రోల్ ఇంజన్‌ను (మ్యాన్యువల్ & ఆటోమేటిక్) మాత్రమే బిఎస్-6 వెర్షన్‌లో తీసుకొచ్చారు. అయితే, బిఎస్-6 వెర్షన్ డీజల్ ఇంజన్‌లను త్వరలోనే విడుదల చేయనున్నారు.

హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

బిఎస్6 ఇంజన్ అప్‌డేట్‌తో హోండా సిటీలో సరికొత్త డిజీప్యాడ్ 2.0 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పరిచయం చేశారు, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే ఇది V, VX మరియు ZX వేరియంట్లలో మాత్రమే ఉంది.

హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

హోండా సిటీ బిఎస్6 వెర్షన్‌లో ఉన్న ఇతర చెప్పుకోదగ్గ ఫీచర్లలో శాటిలైట్‌ అనుసంధానం గల టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, యూఎస్‌‌బీ లేదా వై-ఫై రిసీవర్ సపోర్ట్ గల లైవ్ ట్రాఫిక్, వాయిస్ కమాండ్, మెసేజులు, బ్లూటూత్ హ్యాండ్స్ ఫ్రీ టెలిఫోన్ మరియు ఆడియోతో పాటు వైర్‌లెస్ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

"కొత్తగా పుట్టుకొస్తున్న కొత్త టెక్నాలజీని కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ మోడళ్లలో అందిస్తూనే వస్తున్నాం. దీనికి తోడు భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన బిఎస్-6 ప్రమాణాలకు తమ ప్యాసింజర్ కార్లను దశల వారీగా అప్‌డేట్ చేస్తున్నామని" హోండా కార్స్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయెల్ తెలిపారు.

హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

హోండా సిటీ మిడ్-సైజ్ సెడాన్ కారులో అదే 1.5-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు, బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్స్ చేసిన దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

హోండా సిటీ పెట్రోల్ బిఎస్-6 వెర్షన్ ధరల శ్రేణి రూ. 9.91 లక్షల నుండి రూ. 14.31 లక్షల మధ్య ఉండగా, హోండా సిటీ డీజల్ బిఎస్-4 వెర్షన్ ధరలు రూ. 11.11 లక్షల నుండి రూ. 14.21 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

జపాన్ దిగ్గజం హోండా ఇటీవల సిటీ నెక్ట్స్ జనరేషన్ మోడల్‍‌ను థాయిలాండ్‌లో ఆవిష్కరించింది. ఇందులో ఐఎమ్ఎమ్‌డి అనే హైబ్రిడ్ టెక్నాలజీ పెట్రోల్ వేరియంట్లలో అందించింది.

Read More:2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది.

హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం హోండా సీఆర్-వి మరియు సివిక్ కార్లలో బిఎస్-6 ఇంజన్‌లను అందించారు. కేంద్ర రవాణా శాఖ విధించిన ఏప్రిల్ 01, 2020 గడువులోగా అన్ని మోడళ్లను బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయనున్నారు.

Read More:యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

Most Read Articles

English summary
Honda City BS6 Petrol Launched In India, Prices Start At ₹ 9.91 Lakh-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X